ఉత్తర అమెరికా మొట్టమొదటి తెలుగు కథ స్వర్ణోత్సవాలు & 9వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు

1209

ఈ నెలాఖరున అక్టోబర్ 25-26, 2014 (శనివారం, ఆదివారం) రెండు రోజులూ  ఉదయం  8 నుండి సాయంత్రం 5 వరకూ హ్యూస్టన్ మహా నగరంలో జరుగుతున్న ఉత్తర అమెరికా మొట్టమొదటి తెలుగు కథ స్వర్ణోత్సవాలు & 9వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు కు మిమ్మల్ని సకుటుంబ, సపరివారంగా ఆహ్వానిస్తున్నాం. ఉత్తర అమెరికా ఖండం నుండి మొట్టమొదటి తెలుగు కథ 1964 లో అప్పటి ఆంధ్ర సచిత్ర వార పత్రికలో ప్రచురించబడి యాభై సంవత్సరాలు  గడిచిన  సందర్భంగా, ఉత్తర అమెరికాలో తెలుగు సాహిత్య ప్రారంభానికి అదే తొలి అడుగుగా గుర్తిస్తూ ఆ అర్ధ శతాబ్ది ఉత్సవాలు ప్రధాన అంశం గా ఈ   “తొమ్మిదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు”  నిర్వహించబడుతోంది.  వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి ఆధ్వర్యం లో హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి & హ్యూస్టన్ సాహితీ లోకం బృందం వారి సమిష్టి నిర్వహణలో ఈ సభలు జరుగుతున్నాయి.

భారత దేశం నుండి ఆహ్వానిత అతిథులు

తనికెళ్ళ భరణి, పాపినేని శివ శంకర్, జనార్ధన మహర్షి, ముక్తేవి భారతి, ఆకెళ్ళ రాఘవేంద్ర, కస్తూరి అలివేణి, కేతవరపు రాజ్యశ్రీ, ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి (దళిత విశ్వవిద్యాలయం ఉప కులపతి)   “పద్మశ్రీ” యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్

అమెరికా ఆహ్వానిత అతిథులు

కిరణ్ ప్రభ, అఫ్సర్, కల్పనా రెంటాల, శారదా పూర్ణ, విన్నకోట రవి శంకర్, ఎస్. నారాయణ స్వామి, గొర్తి బ్రహ్మానందం, చంద్ర కన్నెగంటి తదితరులు.

ఆత్మీయ సత్కారాలు

ఉత్తర అమెరికా తొలి కథకులు స్వర్గీయ పులిగండ్ల మల్లికార్జున రావు గారి కుటుంబ సభ్యులు ( (కెనడా)

అమెరికా తొలి కవి & తొలి తెలుగు పత్రిక సంస్థాపకులు స్వర్గీయ పెమ్మరాజు వేణుగోపాల రావు గారి కుటుంబం (అట్లాంటా )

అమెరికా తొలి కథా రచయితల జీవన సాఫల్య పురస్కారం

చెరుకూరి రమా దేవి, వేమూరి వెంకటేశ్వర రావు, వేలూరి వెంకటేశ్వర రావు

“అక్కినేని –ఘంటసాల మధుర గీతాలు”

(తొలి రోజు సాయంత్రం హైదరాబాద్ నుంచి “అపర ఘంటసాల” బాల కామేశ్వర రావు, శారద శాయి, హ్యూస్టన్ గాయని శారద ఆకునూరి, తదితర సుప్రసిద్ధ గాయనీ గాయకుల సంగీత విభావరి” కార్యక్రమం)

రచయితలకు, వక్తలకు విన్నపం

ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సులో ప్రసంగించదల్చుకున్న వారు, స్వీయ రచనా విభాగంలో తమ రచనలను వినిపించదల్చుకున్నవారూ ఈ క్రింది నిర్వాహకులను సంప్రదింఛండి.ప్రసంగాంశాలు ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునిక పోకడల దాకా తెలుగు భాషా సాహిత్యాలకి సంబంధించినవే అయి ఉండాలి. అమెరికాలో తెలుగు సాహిత్య పోకడల మీద ప్రసంగాలను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం.

C.N. Satyadev ([email protected]), Madhu Pemmaraju ([email protected])

Satybhama Pappu ([email protected]), Sai Rachakonda ([email protected])

 

ఈ సదస్సుకి విచ్చేసిన ప్రతినిధులకి,  సభా ప్రాంగణంలోనూ, మా సాహిత్య కార్యక్రమాలని తమ విరాళాలతో సమర్ధించిన ఇతర సాహితీ ప్రియులందరికీ, మా ఖర్చులతో పోస్ట్ ద్వారానూ ఈ సదస్సులో విడుదల చేయబడుతున్న ఈ క్రింది పుస్తకాలు బహుకరించబడతాయి. ఈ సదస్సు  సందర్భంగా మేము ప్రచురిస్తున్న ప్రత్యేక ప్రచురణల విలువ $145.

  1. “అమెరికాలో తెలుగు కథా సాహిత్యం – ఒక సమగ్ర పరిశీలన”-

50 ఏళ్ల అమెరికా తెలుగు కథ పై సుమారు 300 పేజీల పరిశోధనా గ్రంధం.

రచయితలు: వంగూరి చిట్టెన్ రాజు & తన్నీరు కల్యాణ్ కుమార్

  1. “అమెరికా తెలుగు కథానిక  – 12వ సంకలనం

34 మంది అమెరికా కథకులు రచించిన రమ్యమైన కథానికా గుళికలు

  1. “ఆత్మార్పణ” – స్వర్గీయ పెమ్మరాజు వేణుగోపాల రావు గారి సమగ్ర కవితా సమాహారం.

సంపాదకుడు: విన్నకోట రవి శంకర్

  1. “ఎగిరే  పావురమా” – “నాట్య భారతి” కోసూరి ఉమా భారతి తొలి నవల.
  2. “ఘర్షణ” – అపర్ణ మునుకుట్ల గునుపూడి కథా సంపుటి” –30 కథలు.