వ్యాలీ తెలుగుస్ ఆద్వర్యంలొ లాస్ ఏంజిల్స్ లోని శాన్ ఫెర్నాండొ వ్యాలీలొ ఉగాది వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. వెస్టుహిల్స్ డీ టొలొడొ హైస్కూల్ లొ నిర్వహించిన ఈ వేడుకలకు సుమారు 500 మంది తెలుగు వారు పాల్గొన్నారు. 100 మందికి పైగా కళాకారులు ఈ సందర్భంగా ప్రదర్శించిన పలు సాంస్క్రుతిక కార్యక్రమాలు అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిన్నారుల నృత్యాలు, గీతాలు మరియు మహిళల ఫ్యాసన్ షొ అందరిని అలరింప చేసాయి. విష్ణు కేటరింగ్ వారు ప్రేక్షకులకు పసందైన విందు భోజనం అందించారు. కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేసిన ప్రతిఒక్కరికి నిర్వాహకులు కృతజ్ణతలు తెలిపారు.
Photos Link :