టి. ఆర్. యస్ పార్టీ ఎన్నారై ఆస్ట్రేలియా శాఖ ” ఓవర్‌సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ టి. ఆర్. యస్ ” అధ్యక్షునిగా నాగేందర్ రెడ్డి కాసర్ల

1245
టి. ఆర్. యస్ పార్టీ ఎన్నారై ఆస్ట్రేలియా శాఖ – ఓవర్‌సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ టి. ఆర్. యస్ అధ్యక్షునిగా నాగేందర్ రెడ్డి కాసర్ల
ఆస్ట్రేలియా పర్యటన లో ఉన్న టి. ఆర్. యస్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు, ఇటీవల జాగృతి ఆస్ట్రేలియా  ఆద్వర్యంలో జరిగిన తెలంగాణా ఆవిర్భావ వేడుకల్లో టి. ఆర్. యస్ పార్టీ ఆస్ట్రేలియా ఎన్నారై శాఖ – “ఓవర్‌సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ టి. ఆర్. యస్” గా ప్రకటించి  అధ్యక్షునిగా నాగేందర్ రెడ్డి కాసర్లను నియమించడం జరిగింది.  అక్టోబర్ లో పూర్తి కమిటీ ప్రకటించి ప్రత్యేక సభను ఏర్పాటు చేస్తామని కవిత తెలిపారు.
 గతి కొద్ది రోజులుగా ఆస్ట్రేలియా లో రెండు గ్రూపులుగా ఉన్న టి. ఆర్. యస్ పార్టీ సంస్థలు ఇక కవిత గారి ఆదేశాల మేరకు అధికారిక “ఓవర్‌సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ టి. ఆర్. యస్”  సంస్థ లో బాగస్వాములై క్రమశిక్షణ కలిగిన   కార్యకర్తలుగా, పార్టీకి మన వంతు బాద్యత నిర్వాహిద్దామని, అలాగే ఈ అవకాశం కలిపించి కే. సీ. ఆర్ గారికి, నా పై నమ్మకం ఉంచి అధ్యక్ష బాద్యతలు  అప్పగించిన కవిత గారికి
అద్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల కృతజ్ఞతలు తెలిపారు.
Nagendar Kasarla