టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా శాఖ ప్రారంభోత్సవం

1551

గత ప్లీనరీలలో ముఖ్యమంత్రి కె సి ఆర్ గారు ప్రతిదేశంలో టి ఆర్ ఎస్ శాఖలు విస్తరించాలానీ, ప్రపంచమంతా గులాబీమయం కావాలని ఇచ్చిన పిలుపుమేరకు పలు దేశాల్లో ఎన్ ఆర్ ఐ టి ఆర్ ఎస్ శాఖలు ఏర్పడుతున్నాయి.
ఆస్ట్రేలియాలో కూడా టి ఆర్ ఎస్ యొక్క ఎన్ ఆర్ ఐ అధికారిక శాఖ ‘టి ఆర్ ఎస్  ఆస్ట్రేలియా శాఖ’ ప్రారంభోత్సవం గౌరవ ఎం పి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కవిత గారి చేతుల మీదుగా ఈ నెల 8వ తేదీన సిడ్నీలో అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నామనీ,ఈ కార్యక్రమానికి ఆస్ట్రేలియాలోని అన్ని నగరాల నుండి పెద్ద సంఖ్యలో తెలంగాణ బిడ్డలు హాజరవుతున్నారని అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల మీడియాకు తెలిపారు. గత 2 సంవత్సరాలుగా ఆస్ట్రేలియాలోని తెలంగాణ బిడ్డలు,టి ఆర్ ఎస్ అభిమానులు తమ ఈ శాఖను ఏర్పరుచుకొని వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామనీ ఇప్పుడు తమ అధికారిక ప్రారంభోత్సవం మన తెలంగాణ అడ పడుచు గౌరవ ఎం పి కవిత గారి చేతులమీదుగా జరగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

trs-australia