టిఎల్ సిఏ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

973

అమెరికాలో ప్రఖ్యాత తెలుగు సంస్థ టి.ఎల్.సి.ఏ 2017 సంవత్సర సంక్రాంతి సంబరాలు నూతన అధ్యక్షులు శ్రీ  శ్రీనివాస్ గూడూరు గారి ఆధ్వర్యంలో జనవరి 28,2017 గణేష్ టెంపుల్ ఆడిటోరియం, ఫ్లషింగ్, న్యూయార్క్ నగరంలో తీవ్రమైన చలిలో దాదాపు 600 మంది ప్రేక్షకులతో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి.

మధ్యాహ్నం ప్రారంభమైన కార్యక్రమాలు దాదాపు  పది గంటల సేపు వైవిద్యభరితమైన చిన్నారుల నృత్యాలు, ఆటపాటలతో ఆహుతులను అలరించాయి. 68 వ భారత గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని దేశభక్తి గీతాలతో కూడిన సందేశాత్మక నృత్య నాటికను ప్రదర్శించారు అనంతరం భారత జాతీయ పథకాన్ని ఎగురవేసి వందేమాతరం గీతాన్ని ఆలపించారు

సంస్థ కార్యదర్శి అశోక్ చింతకుంట, తమ తొలి పలుకులతో ఆహుతులను కళాకారులను ఆహ్వానించి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. చిన్నారుల ప్రార్థన గీతంతో ప్రారంభమైన కార్యక్రమాలు రాత్రి 12 గంటల వరకు కొనసాగాయి.

ప్రసాద్ కోయి, జయప్రకాశ్ ఎంజపురి, రమా వనమా, ఉమా పోలిరెడ్డి గారు రూపొందించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకుల మనసుల్ని దోచాయి.

మాధవి కోరుకొండ ఆధ్వర్యంలో చిన్నారులు  ప్రదర్శించిన  లవకుశ చిత్రం లోని వినుడు వినుడు రామాయణ గాథ, మోహిని భస్మాసుర, ప్రేక్షకుల మనసుల్ని దోచేసింది . కుమారి శబరి ఆధ్వర్యంలో టిఎల్‌సిఏ సభ్యులు ప్రదర్శించిన ”సంక్రాంతి పండుగ నృత్యరూపకం” పండుగ ప్రాశస్తాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించి ఆహుతులను ఆకట్టుకుంది. కోరియోగ్రాఫర్‌ ఉమపుటాని ఆధ్వర్యంలో చిన్నారులు ప్రదర్శించిన  గణతంత్ర వేడుకల నృత్యరూపకం ఆహుతుల జయజయ ధ్వానాలను అందుకుంది.

సంస్థ కోశాధికారి బాబు కుదరవల్లి ఆధ్వర్యంలో సమర్పించిన రోబోట్ ప్రత్యేక ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంది. ప్రముఖ సినీమా పాటల రచయిత శ్రీ చంద్రబోస్  గారు నిర్వహించిన విన్నూత్న ప్రయోగం  మాటకు పాట కార్యక్రమం అందరి మన్నలను పొందింది. గాయకులు వినోద్ బాబు, ఆకునూరి శారద, శృతి నండూరి, సింధు బుధవారపు, అదితి భవరాజు  పాడిన సినీ గీతాలు  ఆహుతులను మైమరిపించాయి.

భారత దేశం నుండి విచ్చేసిన జబర్దస్త్ హాస్య కళాకారుల బృందం బులెట్ భాస్కర్, నరేష్ గార్లు మరియు సంస్థ కార్యదర్శి అశోక్ చింతకుంట గార్లు ప్రదర్శించిన హాస్య రసవత్తర సన్నివేశాలు కార్యక్రమం ఆద్యంతం ఆహుతులను నవ్వులతో ముంచెత్తింది.

సినీ నటి లయ ప్రత్యేక అతిదిగా పాల్గొన్నారు. ఈ సంబరాలలో , సంగీత విద్వాంసు లు కీ.శే. డాక్టర్ మంగళంపల్లి బాల మురళి కృష్ణ గారికి ప్రత్యేక మంగళ నీరాజనాన్ని , రఘురాం పొన్నాల ఆధ్వర్యంలో సమ్పరించారు. అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ గూడూరు గారు స్వాగతోపన్యాసం చేస్తూ, టిఎల్‌సిఏ ఈసీ  నూతన కార్యవర్గాన్ని సభకు పరిచయం చేశారు. బోర్డు అఫ్ ట్రస్టీస్ చైర్మన్ శ్రీ పోలవరపు రాఘవ రావు గారు, 2017 బి. ఓ. టి కార్యవర్గాన్ని సభకు పరిచయం చేసారు. శ్రీ రాఘవ రావు గారు, టి.ఎల్.సి.ఏ. భవన సహాయనిధికి విరాళాలను ఇవ్వాల్సిందిగా సభ్యులను కోరారు.

సంస్థ సహాయ కోశాధికారి జ్యోతి జాస్తి, ఈసీ మెంబెర్స్ రమా వనమా, ఉమా పోలిరెడ్డి ఆధ్వర్యంలో వనితలకు  ప్రత్యేకంగా ముగ్గుల పోటీ  నిర్వహించి  విజేతలకు సినీ నటి లయ చేతులమీదుగా బహుమతులను ప్రదానం చేశారు.

tlca-new-york-celebrates-sankranthi-jan-28-2017-1 tlca-new-york-celebrates-sankranthi-jan-28-2017-2 tlca-new-york-celebrates-sankranthi-jan-28-2017-3 tlca-new-york-celebrates-sankranthi-jan-28-2017-4 tlca-new-york-celebrates-sankranthi-jan-28-2017-5 tlca-new-york-celebrates-sankranthi-jan-28-2017-6

ఈ సంబరాలలో, భూమి ఫామిలీ వారు (డాక్టర్ శ్రీదేవి భూమి మరియు డాక్టర్ శరత్ భూమి) వారు నెలకొల్పిన ” డాక్టర్ శిరీష్ భూమి మెమోరియల్ బెస్ట్ అల్-రౌండ్ స్టూడెంట్ అవార్డు” ను 2016 సంవత్సరానికి, గత సంవత్సర అధ్యక్షులు సత్య చల్లపల్లి ఆద్వర్యం లో విద్యార్థులు కార్తీక్  మధిర మరియు అవినాష్ . కె.  రెడ్డి లకు సంయుక్తంగా బహుకరించారు.

 

ప్రత్యేక కళల్ని గుర్తిస్తూ, ప్రతిభని కనబర్చిన సంస్థ సహాయ కార్యదర్శి శ్రీ జయప్రకాశ్ ఎంజపురి (క్రీడా రంగంలో), కుమారి సంజన ఈరంకి (విద్యాభ్యాసంలో), కుమారిలు శ్రేష్ఠ పరాన్జీ, మనసాదేవి పిసిపాటి, కావ్య తంగెళ్ల, దివ్య దొమ్మరాజు, సందీపన ఈరంకి (భరతనాట్యంలో) లను టీ. ఎల్ . సి. ఏ. ఘనంగా సత్కరించింది.

మద్దిపట్ల ఫౌండేషన్‌ వారు సంక్రాంతి ప్రత్యేక బహుమతులు టీవీ లు విజేతలకు అందించారు. నెహ్రు కటారు, సురేష్ బాబు తమ్మినేని, రమా వనమా, ఉమా పోలిరెడ్డి ఆధ్వర్యంలో సంబరాలకు విచ్ఛేసిన అతిథులకు నోరూరించే పసందైన సంక్రాంతి విందు భోజనాన్ని అందించారు. ఈ కార్యక్రమాలను దిగ్విజయముగా నిర్వహించడానికి సహాయపడిన దాతలు డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి గారికి , డాక్టర్ పూర్ణ అట్లూరి గారికి టి.ఎల్.సి.ఏ. కార్యవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసింది.

నూతన అధ్యక్షులు శ్రీ  శ్రీనివాస్ గూడూరు గారి ఆధ్వర్యంలో కార్యక్రమ విజయవంతానికి కృషిచేసిన తోటి సహచర సభ్యుల కృషిని సంస్థ కార్యదర్శి అశోక్ చింతకుంట కొనియడారు. కిరణ్  రెడ్డి పర్వతాల, యోగి వనమా, రాము కోరుకొండ, వరద రాజు, శ్రీనివాస్  తమ్మిశెట్టి, భగవాన్ నడింపల్లి, కార్తీక్ మణియం, రంజిత్ క్యాతం, సలీల రెడ్డి, కృష్ణవేణి రెడ్డి ల కృషిని సంస్థ కొనియాడింది.

సంస్థ 2017 కార్యవర్గము వందన సమర్పణ మరియు భారత జాతీయ గీతంతో  నాటి కార్యక్రమం ముగిసింది.