TLCA తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘము (టి.ఎల్.సి.ఏ) ఆధ్వర్యంలో మిన్నంటిన దీపావళి వేడుకలు

1189

అందాల ప్రమిదల.. ఆనంద జ్యోతుల దీపావళి పండుగ దీపపు కాంతులు మిరుమిట్లు గొలుపుతుండగా ఉరకలెత్తే ఉత్సాహంతో అమెరికాలోని ప్రఖ్యాత తెలుగు సంస్థ టి.ఎల్.సి.ఏ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు నవంబర్ 12వ తేదీన స్థానిక గణేష్ టెంపుల్ ఆడిటోరియం, ఫ్లషింగ్, న్యూయార్క్ నగరంలో ఘన౦గా నిర్వహించింది. సంస్థ ఆవిర్భవించి 45 ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా జరుపుకున్న ఈ దీపావళి ఉత్సవాలకు ప్రత్యేకత సంతరించుకుంది. అధ్యక్షులు శ్రీ సత్య చల్లపల్లి గారి టీం అహర్నిశలూ శ్రమించి ఈ దీపావళి వేడుకలను ఆహుతులు అబ్బురపరిచేలా నిర్వహించి టి.ఎల్.సి.ఏ సంస్థ విశిష్టతను చాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ టాలీవుడ్‌ సినీ హీరో శ్రీకాంత్, నటి ఊహ, యువ హీరో రోషన్ కథానాయిక కమలిని ముఖర్జీ, సత్యకృష్ణన్ పాల్గొని ఈ దీపావళి పండుగకు అదనపు కాంతులు తెచ్చారు.

చీకటి వెలుగుల రంగేళీ, జీవితమే ఒక దీపావళి అంటూ ఉత్చాహంగా మొదలైన దీపావళి సాయంత్రంలో ప్రముఖ గాయనీ గాయకులు విజయలక్ష్మి, లిప్సిక, గుంటా హరి పాటలు, ప్రముఖ గాయకుడు అనుదీప్, సౌజన్య హాయి హాయిగా ఆమనిసాగే.. మది ఉయ్యాలగా జంపాలగా అంటూ పాత, కొత్త తరాలను మైమరిపించే పాటలు పాడి ఆహుతులకు ఆనందాన్ని పంచారు. హాయి హాయిగా ఆమనిసాగే.. మది ఉయ్యాలగా జంపాలగా అంటూ పాత, కొత్త తరాలను మైమరిపించే పాటలతో ఆహుతులకు ఆనందాన్ని పంచారు. విభిన్నమైన వినూత్నమైన కార్యక్రమాలతో అంబరాన్నంటిన ఈ దీపావళి వేడుకలకు దాదాపు 800 మంది ఉత్సాహంతో పాల్గొన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై కార్యక్రమాలు దాదాపు 9 గంటలపాటు నిర్విరామంగా కొనసాగాయి.

దీపావళి పండుగ కల్చరల్ చెయిర్ హరిశంకర్, అశోక్ కుమార్, జయప్రకాష్ ఆధ్వర్యంలోని బృందం వినూత్నంగా రూపకల్పన చేసి అందించిన కార్యక్రమాలు ఆహుతులకు కనులవిందు చేసాయి. దాదాపు 50 మంది పిల్లలు కలసి కట్టుగా ప్రదర్శించిన”శ్రీ కృష్ణ వైభవం” కార్యక్రమం ఆహతులను అలరించింది. నిరాటంకంగా కొనసాగిన వైవిద్యభరితమైన ప్రదర్శనల్లో, చిన్నారుల నృత్యాలు, ఆటపాటలు,నాటికలు ఆహుతులను కనులవిందు చేసాయి.

ఈ సందర్భంగా సినీ నటుడు శ్రీకాంత్, ముఖ్య దాతలకు జ్ఞాపికలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అధ్యక్షులు శ్రీ సత్య చల్ల్లపల్లి గారు ప్రసంగిస్తూ టి.ఎల్.సి.ఏ కార్యక్రమాలు నిర్వహించడానికి అండగా నిలచిన వారందరికీ కృతజ్ఞతలు తెలియ చేసి సత్కరించారు. ఈ సందర్భంగా విచ్చేసిన ప్రముఖ దాతలు శ్రీ పైల్ల మల్లారెడ్డి, సుధాకర్ విడియాల, మాధవరెడ్డి, డా.నాగమ్మ దొడ్డంపూడి, డా.పూర్ణ అట్లూరి, రవి లామ్, జయ్ తాళ్లూరి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. విరామంలో సంఘ సభ్యులు రమకుమారి వనమ, ఉమారెడ్డి బృందం అందించిన టి.ఎల్.సి.ఏ దీపావళి మిఠాయిలు, రుచికరమైన విందు భోజనం ఆహుతులు ఆనందించారు.

tlca-deepavali-celebrations-2016-1 tlca-deepavali-celebrations-2016-2 tlca-deepavali-celebrations-2016-3 tlca-deepavali-celebrations-2016-4 tlca-deepavali-celebrations-2016-5 tlca-deepavali-celebrations-2016-6 tlca-deepavali-celebrations-2016-7 tlca-deepavali-celebrations-2016-8
మద్దిపట్ల ఫౌండేషన్ వారు ప్రకటించిన ప్రత్యేక బహుమతులు ల్యాప్ టాప్ లు 32″, 40″ టీవీ లు, విజేతలకు అందించారు. ఇన్ని కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించిన అధ్యక్షులు శ్రీ సత్య చల్ల్లపల్లి గారిని, అంకితభావంతో పని చేసిన టి.ఎల్.సి.ఏ కార్యవర్గాన్ని ఆహుతులందరూ కరతాళధ్వనులతో ప్రశంసించారు.

అధ్యక్షులు శ్రీ సత్య చల్ల్లపల్లి చివరగా వందన సమర్పణ చేస్తూ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో అండగానిలచిన సంస్థ కార్యవర్గం, మరియు తోటి సహచర సభ్యుల కృషిని కొనియాడారు అలాగే సాంస్కృతిక కార్యక్రమాల ఎంపికకు విశేష కృషిచేసిన హరిశంకర్ రసపుత్ర,, అశోక్ చింతకుంట, జయప్రకాశ్ ఇంజాపురి, ఉమారెడ్డి, రమకుమారి వనమ, శిరీష తునుగుంట్ల, మరియు టి.ఎల్.సి.ఏ కార్యవర్గ సభ్యులు బాబు కుదరవల్లి, జ్యోతి జాస్తి, ప్రసాద్ కోయి టి.ఎల్.సి.ఏ అధ్యక్షులు శ్రీ సత్య చల్లపల్లి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే హాజరైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేసారు. తదనంతరం జాతీయగీతాలాపనతో కార్యక్రమo ముగిసింది.