అంబరాన్నంటిన స్వప్నా-తామా దీపావళి సంబరాలు…

1745

అట్లాంటా మహా నగరం మెట్రో అట్లాంటా తెలుగు సంఘం (తామా) ఆద్వర్యంలో దీపావళి సంబరాలను ఘనంగా జరుపుకున్నది. 2014 దీపావళి సంభరాలకు “స్వప్నా రెస్టారెంట్” అందించిన ఈ దివ్య దీపావళి వెలుగులు అట్లాంటా అంబరాని అందుకున్నాయి. రికార్డు స్థాయి కి చలి ఉన్నా. విశేషం గా తెలుగు వారు హాజరై ఈ దీపావళి దివ్యంగా జరుపుకున్నారు

తామా సాంస్మ్కూతిక కార్యదర్శి అనిల్ బొడ్డిరెడ్డి స్వాగతోపన్యాసంతో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి “స్వప్నా రెస్టారెంట్” మధు తాత, ప్రముఖ తెలుగు చలన చిత్ర నటీ కుమారి రిచా గంగొపాద్యాయ ముఖ్య అతిధులుగా హాజరు అయ్యారు. దీపావళి విశిష్టత, తెలుగు సంస్క్రుతి, సాంప్రదాయాలను భావి తరాలకు అందించడానికి “తామా” చేస్తున్న కృషిని ఈ సందర్బంగా ముఖ్య అతిధులు ప్రశంసించారు.

తామా ప్రెసిడెంట్ సంద్య యల్లాప్రగడ తామా-2014 నందు జరిపిన కార్యక్రమములను వివరించారు. తామా కార్య వర్గం లో మహిళా కార్య దర్శిని పదవిని పొందపరిచినట్లు వివరించరు,తామా ఉచిత వైద్య శాల ద్వార 200 మంది లబ్ది పొందారని వివరించారు. ఈ సంవత్సరం స్పాన్సర్స్ కి , వాలంటీర్స్ కు దన్యవాదములు తెలిపారు. “తామా” బోర్డ్ చైర్మన్ సునిల్ సవలి తామా Clinic మరియు long term projects లో స్కాలర్ షిప్స్ గురించి వివరాలు, మన బడి వివరాలను సభకు వివరించినారు.

టాలీవుడ్ ప్రముఖ గాయకులు రాహుల్ శిప్లిగంజ్ మరియు నిత్య భయ్య తమ మధుర గీతాలతో సభీకులను ఆలపించారు. నిత్యా పాటలకి రిచా గంగొపాద్యాయ నృత్యం చేసి సభికులను అనందపరిచారు.

అట్లాంటా చిన్నారులు మరియు ప్రాంతీయ కళాకారులు తమ వైవిధ్యమైన ప్రతిభా పాఠవాలతో ఈ సంభరాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శివ డాన్సు స్కూల్, హస్త నృత్యం ఇత్యాది నృత్యాలు సబికులను అలరించాయి .

వివిధ నృత్య, గాన పోటిలలో, విజేతలుగా నిలచిన చిన్నారులను తామా ఈ సందర్భంగా జ్ఞాపికలు, గిఫ్ట్ కార్డ్స్ ఇచ్చి సత్కరించినది. ఈ సందర్భం గా తామా సాంస్మ్కూతిక కార్యదర్శి అనిల్, తామా తెలుగు చిన్నరులని ప్రోత్సహించుటకు కంకణం కట్టుకున్నదని తెలిపారు. ఆటా సహకారంతో తామా జరిపిన టెన్నిస్ విజేతలకు శ్రీ. కరుణాకర్ అసిరెడ్డి జ్ఞాపికలుఅందచేసారు.

tama diwali 2014-601

ముఖ్య అతిధి రిచా ఈ సందర్భం గా తామా వార్షిక పత్రిక “మన ఊరి మాట ” ని విడుదల చేసి, శ్రీ మధు టాటా కి మొదటి పత్రిక అందచేసారు.

 

ఈ సంబరాల్లొ భాగమైన రిచా గంగొపాద్యాయతో Meet & Greet and Photo, “గోరింటాకు” మరియు “మహిళలకు దీపావళి చీర raffle” కార్యక్రమాలకు అనూహ్య స్పందన లభించిండి.

 

ఈ కార్యక్రమానికి వాకిటి క్రియొషన్స్ శ్రీధర్ వాకిటి, ఫ్రవీణ్ బొప్పన, కిరణ్ ముదిగొండ, కిరణ్ నాదెళ్ళ మరియు రవి కిరణ్ వడ్డమానులు ఫొటొగ్రఫిని మరియు విడియో అందించారు.

ఆడియో మరియు లైటింగ్ ను బైట్ గ్రాఫ్స్ ప్రశాంత్ అందచేసారు. స్టేజి అలంకరణలో బాగం గా అమర్చిన డిజిటల్ తెర సభికులనుఅంలరించినది.

“Yupp TV” వారు ఈ కార్యక్రమాన్ని అమెరికా అంతటా live telecast ప్రసారం చేసారు.

మధురమైన తెలుగు సాంప్రదాయ వంటకాలను “Hot Breads” వారు సభా సభ్యులకు అందచేసారు.

రాజెష్ యాళ్ళబండి, నాగరాజ్ మంతెన, దేవానంద్ కొండూరి, హర్ష ఎర్నెని, మీసాల వెంకట్, నాగెష్ దొడ్డాక, విజ్జు చిలువూరు, రాజేష్ జంపాల, రాం మద్ధి, శివ, లతా చౌదరి,  సాహితి దొడ్డాక, శ్రీని పెద్ది, శ్యాం మల్లవరపు, కిరణ్ గోగినేని, మధు వంగపల్లి, శ్రావని రచకుల్ల, స్వప్న కసవ, కత్యాయిని బృందం,హర్ష ఎర్నెని ,   వర ప్రసాద్ యడన, మధు వంగవీటి, రాకేష్, అర్జున్ మరియు ప్రసాద్ కల్లి వివిధ శాఖలలో సహాయం అందించారు.

 

ఈ సందర్భం గా తామా హుదుద్ రిలీఫ్ ఫండ్ కోసం హుండీ ని ఏర్పాటు చేసారు.

 

తామా Vice President వినయ్ మద్దినేని ఈ సంభరాలకు విచ్చెసిన అట్లాంటా తెలుగువారలందరికి మరియు ముఖ్య అథిదులకు కృతఘ్నతలు తెలియచేసారు.

జాతీయ గీతం ఆలపనతో ఈ కార్య క్రమం ముగిసినది.