టిఈఎన్ఎఫ్ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు

1153
టిఈఎన్ఎఫ్ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు
టిఈఎన్ఎఫ్ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు

లండన్: తెలంగాణ ఎన్నారై ఫోరం (టిఈఎన్ఎఫ్) జై భారత్ శాఖ ఆధ్వర్యంలో భారత 65వ గణతంత్ర వేడుకలను పశ్చిమ లండన్‌లోని హౌన్స్‌లో మల్టికల్చరల్ సెంటర్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వర్షాన్ని లెక్కచేయకుండా సుమారు 150 మంది ప్రవాస భారతీయులు బ్రిటన్‌లోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. టిఈఎన్ఎఫ్ వ్యవస్థాపక సభ్యుడు అనిల్ కుర్మాచలం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ పతాకానికి సెల్యూట్ చేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా జాతీయ నాయకులైన మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్, జవహర్‌లాల్ నెహ్రూ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేడుకలకు హాజరైన ఎన్నారైలందరికీ భారతీయ మిఠాయిలను పంచిపెట్టారు.

టిఈఎన్ఎఫ్ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు
టిఈఎన్ఎఫ్ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు

ఈ సందర్భంగా అనిల్ కుర్మాచలం మాట్లాడుతూ.. టిఈఎన్ఎఫ్ స్వచ్ఛంద, సేవా కార్యక్రమాలను వివరించారు. ఉత్తరాఖండ్‌లో జరిగిన వరదల సమయంలో బాధితులకు తమ సంస్థ ద్వారా సహాయ సహకారాలు అందించామని చెప్పారు. స్వాతంత్ర్యం కోసం భారతదేశంలో జరిగిన ఉద్యమాల గురించి ఆయన వివరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల ప్రాముఖ్యతను గురించి ఉదయ్ నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా గాంధీ, అంబేద్కర్, నెహ్రూ, వల్లభ్‌భాయి పటేల్ లాంటి మహానీయులను గుర్తు చేసుకోవడం మన అదృష్టమని పేర్కొన్నారు. ఈ 65 ఏళ్లలో భారతదేశం ఎంతో అభివృద్ధి చెందిందని, అయితే ఇంకా ఆర్థిక అసమానతలు తొలగిపోలేదని తెలిపారు. మహిళల భద్రత విషయంలో కూడా సరైన చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు.

గణతంత్ర వేడుకలను రెండో సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించిన టిఈఎన్ఎఫ్, హాజరైన ఎన్నారైలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చందు గౌడ్ చెప్పారు. ఈ సందర్భంగా జాతీయోద్యమం, ఆటలు, సినిమా, వివిధ రంగాలపై క్విజ్ పోటీలను నిర్వహించారు. సరోజిని నాయుడు టీం ఈ క్విజ్ పోటీల్లో గెలుపొందగా.. రన్నరప్‌గా ఝాన్సీ కి రాణి, సెకండర్ రన్నరప్‍‌గా రాణి రుద్రమ టీం ఎంపికయ్యింది. ఈ కార్యక్రమంలో ప్రమోద్ అంథాటి, పవిత్రా రెడ్డి, సుధాకర్ గౌడ్, రంగు వెంకట్, విష్ణురెడ్డి, నవీన్ రెడ్డి, అశోక్ దుసరి, శ్రావణ్ రెడ్డి, మల్లారెడ్డి, ప్రసాద్ తోట, నగేష్ రెడ్డి, ప్రభా లత, సుహాసినీ, సత్య, వెంకట్ రెడ్డి, మల్లేష్, అపర్ణలు పాల్గొన్నారు.