పేద విద్యార్థికి తెలంగాణా ఎన్నారై ఫోరమ్ ఆర్ధిక సహాయం

1320
కరీంనగర్ జిల్లా కట్కూర్ గ్రామానికి చెందిన సాయి కుమార్ ఇంజనీరింగ్ లో మంచి మార్కులు సంపాదించి గ్రూప్స్ కోచింగ్ కి డబ్బులు లేక  ఆర్ధిక సహాయం కోసం ఈమేల్ ద్వారా లండన్ లో నివసిస్తున్న స్థానిక కట్కూర్ గ్రామానికి చెందిన తెలంగాణా ఎన్నారై ఫోరమ్ (TeNF)  వైస్ ప్రెసిడెంట్ పవిత్ర రెడ్డి కంది గారిని సంప్రదించగానే వెంటనే స్పందించి, ప్రస్తుతం సెలవు పై తెలంగాణా రాగానే తన ఇంటికి పిలిపించుకొని 15,000 ల ఆర్ధిక సహాయం  తన  చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది.
ఈ సంధర్భంగా పవిత్ర రెడ్డి మాట్లాడుతూ ప్రతి తెలంగాణా బిడ్డ ఉన్నత చదువులు చదివి మంచి పదవుల్లో ఉండాలన్నాదే మా కోరిక అని, ఈ ఆర్థిక సహాయానికి సహకరించిన తెలంగాణా ఎన్నారై ఫోరమ్ నాయకులు రత్నాకర్ కడుదుల,నవీన్ రెడ్డి  కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి, ఇక ముందు ఎలాంటి సహాయం  కావాలన్న మమ్మల్ని సంప్రదించ్చవచ్చని, మంచిగా చదువుకొని తల్లి తండ్రులకి – ఊరికి పేరు తేవాలని సాయి కి తెలిపారు.
ఈ కార్యక్రమం లో తెలంగాణా ఎన్నారై ఫోరమ్ నాయకులు  సత్యం రెడ్డి కంది మరియు పవిత్ర రెడ్డి తల్లి తండ్రులు పాల్గొన్న వారిలో ఉన్నారు. 
TeNF donation to a student 1 TeNF donation to a student