ఇంగ్లాండ్ ప్రవాస తెలంగాణ 2017 తెలుగు కేలండర్ ఆవిష్కరణ

1022

ఈ రోజు (23/01/2016)   సాంస్కృతిక సారధి  భవన్  (మాదాపూర్  లో)  శ్రీ సాంస్కృతిక సారథి  చైర్మన్ శ్రీ రసమయి బాలకిషన్ గారి చే    తెలంగాణ NRI  ఫోరమ్ (TeNF) వారి 2017 తెలుగు కేలండర్ ఆవిష్కరించారు . మొట్ట మొదటి సారిగా  NRI లు మొదటి  తెలుగు కేలండర్  ఆవిష్కరించడం అభినందనీయం అని  సారధి చైర్మన్  బాలకిషన్ గారు కొనియాడారు  . కేలండర్ తెలంగాణ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ,పర్యాటక ప్రాంతాల చిత్రాలు పెట్టి  ప్రముఖ పంచాంగ సిద్ధాంతి గారిచే రాయబడిన  తెలుగు పండుగలు , వారాలు ,ఫలాలు పుణ్యకాలాలు ,రాహు కాలము ,వర్జ్యాలు,గ్రహణాలు  లతో కూడిన మన సాంప్రదాయ కేలండర్  ఆవిష్కరించడం ఇదే మొదటి సారి . విదేశాల్లో  తెలంగాణ భాష ,సాంస్కృతి ,సాంప్రదాయాలని వ్యాప్తి లో భాగం గా తెలుగు కేలండర్ ని పరిచయం చేస్తున్నామని  TeNF సంస్థ సభ్యులు తెలిపారు . ఈ కార్యక్రమం లో   TeNF  member   వంగ అజయ్ గౌడ్ తో పాటు TeNF  ఇండియా కో ఆర్డినేటర్స్   సిక్కా శ్రీధర్ గౌడ్ న్యాయవాది శశాంక్ ,ఓం ప్రకాష్  లు క్యాలెండరు ఆవిష్కరణ లో పాల్గొన్నారు .

tenf-calendar-launched-by-saaradhi-chairman