ఎంపీ కవిత చేతుల మీదుగా తెలంగాణా ఎన్నారై ఫోరమ్(TeNF) – లండన్ ‘ బతుకమ్మ – దసరా’ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ !!

1287

ఈరోజు తెలంగాణా భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి చేతుల మీదుగా లండన్ లో తెలంగాణా ఎన్నారై ఫోరమ్(TeNF)  ఆద్వర్యం లో నిర్వహించబోతున్న “బతుకమ్మ – దసరా” సంబరాలు పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది.

ప్రతి సంవత్సరం  బతుకమ్మ – దసరా సంబరాలు ఘనంగా  నిర్వహించుకుంటామని, కానీ ఈ సంవత్సరం పండగ తో పాటు – మా వంతు బాద్యతగా ,  తెలంగాణా రైతు కుటుంబాలని ఆదుకోవాలనే గొప్ప మనసుతో  మన తెలంగాణా ఆడబిడ్ద – ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి పిలుపు మేరకు  “ADOPT A FARMER” & “EACH ONE – ADOPT ONE” కు మద్దత్తుగా …..బతుకమ్మ – దసరా వేడుకల్లో రాఫెల్ (Raffle) ద్వారా  సమకూరిన  మొత్తాన్ని అందచేయాలని నిర్ణయించుకున్నామని నిర్వాహకులు తెలిపారు.

రైతు కుటుంబాలని ఆదుకోవాలనే సంకల్పం తో ముందుకు వచ్చి మద్దత్తు తెలిపినందుకు వారిని ఎంపీ కవిత గారు అభినందించారు.

సంస్థ  నిర్ణయాన్ని అభినందించి,  ప్రోత్సహించి ” బతుకమ్మ – దసరా”  సంబరాల పోస్టర్ ను ఆవిష్కరించిన  కవిత  గారికి  నిర్వాహకులు  కృతజ్ఞతలు తెలిపారు.

అక్టోబర్ 24 న సాయంత్రం 4 గంటల నుండి  వెస్ట్ లండన్ లోని లాంప్టొన్ స్కూల్ ఆడిటోరియమ్, హౌంస్‌లో లో జరగబోయే వేడుకల్లో పాల్గొని తెలంగాణా సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్తూ, అడాప్ట్ – ఫార్మర్ కార్యక్రమంలో బాగస్వాములు కావాలని తెలిపారు.

ఈ కార్యక్రమం లో తెలంగాణా ఎన్నారై ఫోరమ్ వ్యవస్థాక సబ్యులు గంప వేణుగోపాల్, ఎన్నారై .టీ. ఆర్. యస్ సెల్ ఉపాద్యక్షులు రాజ్‌కుమార్ శణాబోియన, కో కోర్డిన్‌టోర్లు ప్రవీణ్ కుమార్, సుబష్ తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.

TeNF - Bathukamma - Dasara Poster Launch