తెలుగుపీపుల్ ఫౌండేషన్ 8th వార్షిక సమావేశం

1052
సొమెర్సెట్, నూ జెర్సీ, మే 15th 2016: తెలుగుపీపుల్ ఫౌండేషన్, ఆర్థికముగా వెనకబడియున్న ఉన్నత విద్యాభ్యాసము చేస్తున్న విద్యార్థుల విజయానికి చేయూతనిస్తున్న ఒక లాభాపేక్ష లేని సంస్థగా 8th వార్షిక సమావేశాన్ని మే 14, 2016 శనివారం నాడు సోమర్సెట్, నూ జెర్సీలో జురుపుకొన్నది.

తెలుగుపీపుల్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ఆర్థికముగా వెనకబడియున్న విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసన్, మానేజ్మెంట్ మరియు ఇతర వృత్తి విద్యలను విజయవంతముగా పూర్తి చేయుటకు సహాయ వేతనములను అందజేస్తున్నది.

“ఒక ఉత్తమ విద్యార్థికి సహాయము చేయడం ద్వారా అది అతని యొక్క జీవితమే కాక అతని  కుటుంబాన్ని మరియు అతని చుట్టు పక్కల ఉన్నవారి జీవితాలను కూడ ప్రవాభితము చేస్తుంది” అన్నారు వ్యవస్థాపక సభ్యులు శ్రీ కొత్త కృష్ణ గారు. ప్రపంచంలో ఉన్నత శిఖరాలను సాధించిన చాలామంది వ్యక్తులు  అతి తక్కువ స్థాయి లో ఉన్నప్పుడు ఎవరిదో ఒకరి సహాయముతో ఉన్నత విద్యలను పూర్తి చేసారని కృష్ణ గారు గుర్తుచేసారు. అందుకు ప్రతీకగా ఆయన పలు తెలుగు ప్రముఖుల పేర్లు – శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, శ్రీ దాసరి నారాయణ రావు, శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు, యెల్లాప్రగడ సుబ్బారావు తదితరులుఉదహరించారు.

ఏ విద్యర్థులకైతే ఈ రోజు ఈ సంస్ఠ సహాయము చేస్తున్నదో, ఆ విద్యార్థులే ఒకనాడు గొప్ప నాయకులవుతారని అన్నారు పరోపకారి మరియు లీడ్ ఇండియా 2020 ఇంటర్నేషనల్ చైర్మన్ శ్రీ ఇప్పనపల్లి హరికృష్ణ గారు. తెలుగుపీపుల్ ఫౌండేషన్ యొక్క అంకితభావపూర్వితమైన శ్రమను ఆయన కొనియాడారు.

అవసరములో ఉన్న తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు గుర్తింపు కోసం పాకులాట మరియు దూబరా లేకుండా సహాయం చేసే ఇలాంటి సంస్థలను అందరూ ప్రోత్సాహించాలి అని తానా సంస్థ రీజనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి దేవినేని లక్ష్మి గారు మట్లాడుతూ అన్నారు. అంతే కాకుండా , ఆమె గొప్ప ధనసహాయముతో ముందుకి వచ్చి సంస్థకు తమ సహాయ సమర్ధనలను అన్నివేళలా అందజేస్తామని వాగ్ధానము చేసారు.

TeluguPeple Foundation 8th Annual Success Meet (2) TeluguPeple Foundation 8th Annual Success Meet (3) TeluguPeple Foundation 8th Annual Success Meet (7) TeluguPeple Foundation 8th Annual Success Meet (31) TeluguPeple Foundation 8th Annual Success Meet (33) TeluguPeple Foundation 8th Annual Success Meet (39)
జీవితాలలో శాశ్వత మార్పు తీసుకొని వచ్చే ఈ తెలుగుపీపుల్ ఫౌండేషన్ యొక్క శ్రమ లబ్ధి పొందిన వారి యొక్క స్పందనా మరియు వారు సమాజానికి చేసే తదుపరి సహాయము ఒక “చైన్ రియాక్షన్” గా మారుతుందని జర్నలిస్ట్ మరియు విద్యా సెంటర్ ప్రోజెక్ట్ ఫౌండర్ శ్రీమతి స్వాతి శ్రీరాం అన్నారు. విద్యా సెంటర్ ప్రోజక్ట్ సంస్థ పలు తెలంగాణా జిల్లాలో 10, 000 కి మించి విద్యార్థులకు పుస్తకములు పంచిపెట్టబడినవి. ఈ సంధర్భముగా తెలుగుపీపుల్ ఫౌండేషన్ యొక్క లక్ష్యం సాధించుట కొరకు శ్రీమతి స్వాతి గారు విచ్చేసిన అతిధులకు యధాశక్తి విరాళములు ఇవ్వవలసినదిగా విజ్ఞప్తి చేసారు.
కార్యక్రమములో, ఎబెంజెర్. సీ. మల్లేపల్లి మరియు నరేష్ తాళ్ళూరు స్ఫూర్తిపూరకమైన ప్రసంగములు చేసారు.
ఈ కార్యక్రమము శనివారము(2016-06-14) సాయంత్రము తెలుగుపీపుల్ డాట్ కాం కార్యాలయములో నిర్వహించబడినది. మొత్తము 10 లక్షల రూపాయలకు మించి ఈ కార్యక్రమము ద్వారా సేకరించడమైనది. ఈ మొత్తము సొమ్ము అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్స్ సమకూర్చే నిమిత్తము ఉపయోగించబడును.
మొదటగా చిన్నపిల్లలు పాల్గొన్న సాంస్కృతిక కార్యక్రమములతో సభ ప్రారంభించబడినది.