న్యూయార్క్ నగరం లో సిలికానాంధ్ర మనబడి “తెలుగు మాట్లాట పోటీలు”

1186

సిలికానాంధ్ర మనబడి “తెలుగు మాట్లాట పోటీలు” న్యూయార్క్ నగరం లోని క్వీన్స్ లో మే 6 వ తేదీ 2017 న అత్యంత ఉత్సాహభరితం గా జరిగాయి. మనబడి మరియు టి.ఎల్. సి. ఎ సంయుక్తంగా నిర్వ హించిన ఈ పోటీలలో  క్వీన్స్, లాంగ్ ఐలాండ్ ప్రాంతాల నుంచి సుమారుగా 75 మంది   పిల్లలు పాల్గొన్నారు.

తెలుగు పిల్లలందరినీ ఆహ్వానిస్తూ, వారిలో తెలుగు భాషపై ఉన్న పట్టుని మరింత పెంపొందించడానికి, వారికి ఉత్తేజం కలిగించే రీతిలో ఈ ఆటలని సిలికానాంధ్ర మనబడి రూపొందించింది. పిల్లలు ఎంతో క్లిష్టమైన తెలుగు పదాలను వ్రాసి “పదరంగం”లో మేము పెద్దలను మించి పోతామని, ఇరకాటం పెట్టే “తిరకాటం” ప్రశ్నలకు జవాబులిస్తూ అవకాశమిస్తే తెలుగును దూరతీరాలలో కూడా అభివృద్ధి చెయ్యగలమని నిరూపించారు.

“పలుకే బంగారం.. పదమే సింగారం” అనే పిలుపుతో ఈ తెలుగు మాట్లాట పోటీలు భాషాభిమానులను ఆకట్టుకుంటూ, తల్లిదండ్రులకు తెలుగుపై మక్కువ పెంచుతూ, రేపటి తరమైన పిల్లలలో తెలుగు తారలను వెలికి తీస్తోందనడంలో సందేహం లేదు.

టి. ఎల్. సి. ఎ రూపొందించిన ‘తెలుగు బీ’ పోటీలలో పాల్గొని, అత్యంత క్లిష్ట మైన పాదాలను తెలుగు-ఆంగ్ల అనువాదం చేస్తూ, తెలుగు వారి వారసులమని నిరూపించారు న్యూయార్క్ చిన్నారులు.

విజేతలైన చిన్నారులు:

బుడతలు (5 నుండి 9 ఏళ్ళు):

తిరకాటం:  

1) శ్రీజ జీవనగరి

2) శశాంక్ పెన్నబడి

పదరంగం:

1) లాస్య మదర

2) నిఖిల సుఖవాసి

సిసింద్రీలు (10 నుండి 14 ఏళ్ళు):

తిరకాటం:

1) సిద్దార్థ్ ఎలిశెట్టి

2) హర్షిత్ పెన్నబడి

పదరంగం:

1) సిద్దార్థ్ ఎలిశెట్టి

2) రూపిక పన్నాల

టి. ఎల్. సి. ఎ అధ్యక్షుడు శ్రీ  శ్రీనివాస్ గూడూరు మాట్లాడుతూ, క్వీన్స్ మరియు లాంగ్ ఐలాండ్ ప్రాంతాలలోని పిల్లలకు తెలుగు భాషను అందించడం ద్వారా నెహ్రూ కటారు, రాంజోగా ఈరంకి, విద్య కిలంబి గార్ల  అద్వర్యం లో మనబడి చేస్తున్న సేవలను ఎంతో అభినందించారు.

టి. ఎల్. సి. ఎ  కార్యవర్గ సభ్యులు ధర్మా రావు తాపి, అశోక్ కుమార్ చింతకుంట, బాబు కుదరవల్లి,  జై ప్రకాష్ ఇంజపూరి, జ్యోతి జాస్త్రి,  ప్రసాద్ కోయి, రమా కుమారి వనమా, శిరీష తనుగుంట్ల, ఉమారాణి రెడ్డి, సురేష్ బాబు తమ్మినేని మరియు మనబడి బృందం పద్మా రెడ్డి, మాధవి సుఖవాసి,  శ్రీకాంత్ సుఖవాసి, అనుపమ దగ్గుబాటి, భారతి పారుపూడి, స్వప్న పెన్నబడి, సాయీ బాబు, కృష్ణ ప్రసాద్, మధుబాల  గార్ల సహకారం తో కార్యక్రమం విజయవంతం  గా ముగిసింది.