తెలుగు ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించిన చికాగో తెలుగు అసోసియేషన్

1176

చికాగో: తెలుగు ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించింది చికాగో తెలుగు అసోసియేషన్. తెలుగువాళ్ల మధ్య అనుబంధం పెంచడం, సంస్కృతిని కాపాడడంతో పాటు విందు వినోదాలతో కాస్తంత ఆటవిడుపు ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆగస్ట్ ఒకటిన నిర్వహించిన ఈ కార్యక్రమానికి చికాగోలోని కోపర్నికస్ థియేటర్ వేదికైంది. మొదట వీణా గాయత్రి, శ్వేతా రావు, శృతి ఠాకూర్ ఆలపించిన గణపతి పాటతో కార్యక్రమాలు మొదలయ్యాయి. కాన్ఫరెన్స్ కో-ఆర్డినేటర్ శ్రీధర్ ముంగండి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ ఫెస్టివల్ కు ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, నాట్స్ అధ్యక్షుడు రవి ఆచంట, నాట్స్ డైరెక్టర్ శ్రీధర్ కాసాని, కొలంబస్ తెలుగు అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు సురేష్, డీటీఏ మాజీ అధ్యక్షుడు వేణు, షాంపైన్ పారిశ్రామికవేత్త రాజా పాతూరి, టాలీవుడ్ సింగర్స్ గీతా మాధురి, రేవంత్, పృథ్వి, జబర్దస్త్ కామెడీ టీమ్ లోని సుధీర్, చంటి ముఖ్య అతిథులుగా వచ్చారు.

CTA Telugu Festival Grand Success in Chicago 2015 (1) CTA Telugu Festival Grand Success in Chicago 2015 (2) CTA Telugu Festival Grand Success in Chicago 2015 (3) CTA Telugu Festival Grand Success in Chicago 2015 (4) CTA Telugu Festival Grand Success in Chicago 2015 (5) CTA Telugu Festival Grand Success in Chicago 2015 (6) CTA Telugu Festival Grand Success in Chicago 2015 (7) CTA Telugu Festival Grand Success in Chicago 2015 (8) CTA Telugu Festival Grand Success in Chicago 2015 (9) CTA Telugu Festival Grand Success in Chicago 2015 (10) CTA Telugu Festival Grand Success in Chicago 2015 (11) CTA Telugu Festival Grand Success in Chicago 2015 (12) CTA Telugu Festival Grand Success in Chicago 2015 (13) CTA Telugu Festival Grand Success in Chicago 2015 (14)

సుమారు 1400 మంది హాజరైన ఈ ఫెస్టివల్ లో యువతే ఎక్కువగా కనిపించింది. అందుకే, ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమాలు కూడా ఉర్రూతలూగించేలా సాగాయి. చికాగో తెలుగు ఫెస్టివల్ కు శుభాభినందనలు తెలుపుతూ యూఎస్ సెనేటర్ మార్క్ క్రిక్ కూడా సందేశాన్ని పంపారు. స్వాతి, లక్ష్మి లాలసతో పాటు భరత్ ఆచంట, సిద్ధార్థ సాయి ముప్పవరపు, రిత్విక్ మువ్వ, అర్నవ్ తోటకూర, గోపి తోటకూర, యశస్వి ముంగండి, రినా రాకర్స్ టీమ్ లు టాలీవుడ్ గీతాలను ఆలపించారు. అనూష నాయుడు క్లాసిక్ కంపోస్, మలిష్క అంబటి, హనిత, శర్మ పురాణం, గీతా ప్రియ, శ్రీహంసి కోగంటి, నమశ్రిత కోగంటి, అశ్రిత తుంగుంట్ల, మహిత పాములపాటి, అనూష అరవింద్ పర్ఫామెన్స్ కు అభినందనలు వెల్లువెత్తాయి. ఇక బింద్య, రేవతి, స్నేహ అంకిత, స్రవంతి, నికిత, జయప్రద, అనుష, మేఘన ఏలేటి కలిసి చేసిన జుగల్ బంది డ్యాన్స్ కు విశేష స్పందన వచ్చింది. ప్రియాంక ఆచంట, తేజస్వి ఆచంట, ప్రణవి పోలవరపు, లాస్య రంగు చేసిన కూచిపూడి నృత్యం ఆహుతులను అలరించింది.

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు చికాగో తెలుగు అసోసియేషన్ సభ్యులు నివాళి
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు చికాగో తెలుగు అసోసియేషన్ సభ్యులు నివాళి అర్పించారు. ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన స్పెషల్ వీడియోను ప్రదర్శించారు.

ఇక సాయంత్రం సెషన్ కూడా ఉత్సాహంగా మొదలైంది. స్వాగతం పలుకుతోంది సీటీఏ కోవెల అంటూ తెలుగు ఫెస్టివల్ కోసం ప్రత్యేకంగా రాయించి, స్వరపరచిన పాటతో కార్యక్రమాలను మొదలుపెట్టారు. చికాగో తెలుగు అసోసియేషన్ చరిత్ర, చేపట్టే కార్యక్రమాల గురించి సీటీఏ ఎగ్జిక్యూటివ్స్ ప్రసంగించారు. కాన్ఫరెన్స్ కో-ఆర్డినేటర్ శ్రీధర్ ముంగంది వచ్చిన వారికి మరోసారి స్వాగతం పలికారు.

మూర్తి కొప్పాక సేవలకు  సీటీఏ బోర్డ్ అభినందన

మూర్తి కొప్పాక అందించిన సేవలను సీటీఏ బోర్డ్ అభినందించింది. సీటీఏ అధ్యక్ష బాధ్యతల నుంచి మూర్తి కొప్పాక అండ్ టీమ్ నిష్క్రమిస్తుండటంతో సీటీఏ సెక్రటరీ మదన్ పాములపాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. . ముఖ్యంగా సంస్థను బలోపేతం చేయడానికి, సేవలను విస్తృతం చేయడానికి మూర్తి కొప్పాక చేసిన కృషి విశేషం అంటూ సీటీఏ బోర్డ్ ప్రెసిడెంట్ రావు ఆచంట కొనియాడారు. ఇదే సందర్భంలో నాగేంద్ర వేగె అధ్యక్షతన కొలువుదీరిన కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీని రావు ఆచంట పరిచయం చేశారు. సీటీఏ కొత్త బోర్డుకు వైస్ ప్రెసిడెంట్స్ గా మదన్ పాములపాటి, సుజనా ఆచంట, వెంకట్ యలమంచిలి, శ్రీధర్ ముంగండి, సెక్రటరీ సుబ్బారావు పుట్రేవు, జాయింట్ సెక్రటరరీ రాజేష్ వీధులమూడి, ట్రెజరర్ వరప్రసాద్ బోడపాటి, జాయింట్ ట్రెజరర్ హవిల దేవరపల్లి బాధ్యతలు చేపట్టారు. సీటీఏ కొత్త అధ్యక్షుడు ఏడాది అజెండాను ప్రకటించారు. యువత, చదువు, పెద్దలకు వైద్యసహాయం, మహిళ కోసం కార్యక్రమాలు, స్పోర్ట్స్ నిర్వహిస్తామని తెలిపారు. సీటీఏ లక్ష్యాలు, విజన్, మిగతా సంస్థల కంటే సీటీఏ ఎందుకు భిన్నమైంది, సేవలందించడంలో రోల్ మోడల్ ఎలా అయింది అనే దానిపై ప్రవీణ్ మోటూరు వివరించారు. అటు సీటీఏ చేస్తున్న కృషిని నాట్స్ ప్రెసిడెంట్ రవి ఆచంట అభినందించారు. అందునా 2017లో నాట్స్ సంబరాలు చికాగో నగరంలోనే జరుగుతాయని మరోసారి గుర్తుచేశారు.

ఇక సాయం సమయాన మూడుగంటలకు పైగా అనూప్ రూబెన్స్ మ్యూజికల్ నైట్ జరిగింది. సుమారు వంద మంది చిన్నారులు ‘మనం’ సినిమాలోని పాటను ఆలపించారు. సందీప్, ఉమ్ యాంకరింగ్ ఉత్సాహభరితంగా సాగింది. సుధీర్, చంటి, రాకేష్ కామెడీ స్కిట్స్ అదిరిపోయాయి. లోహిత, బిందు బాలినేని, రాణి వేగె, సుజనతో పాటు మరికొంత మంది కల్చరల్ ప్రోగ్రామ్స్ ను సక్సెస్ చేశారు. సీటీఏ అవార్డ్స్ 2015ను ప్రకటించారు. గత వేసవిలో రాజేష్ వీదులమూడి, లక్ష్మి బొజ్జ, శైలేంద్ర గుమ్మడి ఆధ్వర్యంలో జరిగిన టోర్నమెంట్ విజేతలకు అవార్డులు అందజేశారు. కూల్ మిర్చి రెస్టారెంట్ అందించిన వంటకాలన్నీ అదిరిపోయాయి. మురళీ కలగర, వెంకట్ యలమంచిలి విందు ఏర్పాట్లు చూశారు. చికాగో తెలుగు అసోసియేషన్ విడుదల చేసిన తెలుగు ఫెస్టివల్ సావనీర్ ను భారతరత్న అబ్దుల్ కలాంకు అంకితం చేశారు. తెలుగు ఫెస్టివల్ కు తమవంతు సహాయ సహకారాలు, మద్దతు ఇచ్చినందుకు వాలంటీర్లు, సభ్యులు, దాతలకు, వివిధ తెలుగు సంఘాల నుంచి వచ్చిన ప్రతినిధులకు సీటీఏ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. చివరిగా నిర్దేశించుకున్న లక్ష్యాలకు అంకితమవాలంటూ మరోసారి సీటీఏ సభ్యులు విధులను గుర్తు చేసుకున్నారు. తెలుగు ఫెస్టివల్ గ్రాండ్ సక్సెస్ అయినందుకు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.