ప్రజాకవి శ్రీ కాళోజీ గారి వర్ధంతి (13.11.2002)

1475

telugu community news - kaloji vardanthiప్రజాకవి శ్రీ కాళోజీ గారి వర్ధంతి (13.11.2002)


కవిగూడ నేతగాడే -కాళోజి
కవి గూడ నేతగాడే
బహు చక్కని సాలెగూడు అల్లువెడే
రాజకీయ బల్లీ(యు)ల
నోటికి అందక ఎగిరెడి పక్షీ(యు)ల
చూపుల కనుపించనట్టి
సుకుమారపు సూత్రాలతొ –
బహు చక్కని సాలెగూడు అల్లువాడె
కవి గూడ నేతగాడె
రాజకీయ బల్లీ(యు)ల
రక్తసిక్త హస్తాలతొ ఎగరేసిన
తెలతెల్లని కపోతాలు వాలగ, కూర్చొని పాడగ
కైత; సింగిణీల దీర్చు
కవి గూడ నేత గాడె
బహు చక్కని సాలెగూడు అల్లువాడే

–కాళోజి (1972)