సత్యార్థికి మలాలకు నోబెల్ పై హర్షం ప్రకటించిన ప్రవాస భారతీయులు

1298

సత్యార్థికి నోబెల్ పై హర్షం ప్రకటించిన ప్రవాస భారతీయులు
బాలల హక్కుల ఉద్యమ నేత, భారతీయుడైన సత్యార్థి కైలాష్ కు నోబెల్ శాంతి బహుమతి ప్రకటించడంపై ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్, చికాగో తెలుగు సంఘం సీటీఏ హర్షం ప్రకటించాయి. బచ్ పన్ బచావో ఆందోళన ఉద్యమంతో 80 వేల మంది బాలలను వెట్టిచాకిరి నుంచి తప్పించి ఆయన బడిబాట పట్టించారు. బాలల హక్కుల కో్సం ఆయన నిరంతరం పోరాడుతున్నారు.. మధ్యప్రదేశ్ లోని విదిశ ప్రాంతానికి చెందిన ఆయన బాలల హక్కుల కోసం అవిరాళ పోరాటం చేశారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, మానవ హక్కులు, అనాథ చిన్నారుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. బాలల హక్కుల కో్సం పోరాడే అనేక అంతర్జాతీయ సంస్థల్లో ఆయన సభ్యుడిగా ఉన్నారు.

Telugu Community news - Kailash Satyarthi, Malala's Nobel Peace Prize
కొన్నింటిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఓ భారతీయుడికి ఈ అరుదైన గౌరవం దక్కడంపై నాట్స్, సీటీఏ తమ సంతోషాన్ని వ్యక్తం చేశాయి. సేవే గమ్యం అంటూ నినదించే నాట్స్, సత్యార్థి కైలాష్ స్ఫూర్తితో ఎన్నో అడుగులు వేసింది.. అనాధ బాలలకు విద్యను అందించే అనేక సంస్థలకు ఆర్థిక సాయం చేస్తోంది.. ఇక ముందు కూడా నాట్స్ అదే స్ఫూర్తితో ముందుకు సాగుతుందని నాట్స్ ప్రకటించింది.. నోబెల్ శాంతి బహుమతి సాధించి యావత్ భారతవనికే గర్వకారణంగా నిలిచిన కైలాష్ సత్యార్థికి నాట్స్ ప్రత్యేక అభినందనలు తెలుపుతోంది.

బాలికల విద్య కోసం పోరాడిన మలాలకు కూడా నోబెల్ శాంతి బహుమనం లభించడంపై నాట్స్ హర్షం వ్యక్తం చేసింది. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బాలికల విద్య కోసం సాహోసోపేత పోరాటాన్ని చేసిన మలాల అందరికి ఆదర్శంలా నిలిచిందని నాట్స్ పేర్కొంది.