పాఠకులందరికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

1391

మితృలందరికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు  రచించిన లలితగీతం.

జయ జయ జయ ప్రియ భారత
telugu community news happy independence day జనయిత్రీ దివ్యధాత్రి
జయ జయ జయ శత సహస్త్ర
నరనారీ హృదయనేత్రి ||| జయ జయ జయ |||

జయ జయ సశ్యామల
సుశ్యామల చలచ్ఛేలాంచల
జయ వసంత కుసుమ లతా
చలిత లలిత చూర్ణకుంతల
జయ మదీయ హృదయశయ
లక్షారుణ పద యుగళ ||| జయ జయ జయ |||

జయ దిశాంత గత శకుంత
దివ్యగాన పరిశోధన
జయ గాయక వైతాళిక
కల విశాల పద విహరిణి
జయ మదీయ మధుర గేయ
చుంబిత సుందర చరణ ||| జయ జయ జయ |||