Telugu Association of Greater Boston Ugadi Vedukalu 2015

1246

బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు సంఘం, శ్రీ మన్మధ నామ సంవత్సర ఉగాది వేడుకలు చాలా వైభవంగా ఏప్రిల్ 18, 2015 శనివారం నాడు Burlington High School Auditorium , Burlington ,MA లో జరిగాయి. 1000 మందికి పైగా తెలుగు వారు ఈ వేడుకల లో పాల్గొన్నారు. సుమారు 200 మంది పిల్లలు,యువకులు,పెద్దలు ఈ సాంస్కృతిక కార్యక్రమాల లో పాల్గొని విచ్చేసిన ఆహుతులను అలరించారు.

TAGB నూతన కార్యవర్గం తమ ఆధ్వర్యం లో ఎంతో నేర్పుతో , ఓర్పుతో నాటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఆహుతులకి అందజేశారు. ఈ కార్యవర్గం వారు , విచ్చేసిన ప్రేక్షకులందరికీ చక్కని ఉగాది పచ్చడి , పానకం అందించి స్వాగతం పలికారు.

స్వాగత ద్వారం వద్ద మన సాంప్రదాయ అలంకరణల తో తీర్చిదిద్దారు. నాటి కార్యక్రమం కల్చరల్ సెక్రటరీ శ్రీమతి సత్యా పరకాల స్వాగత పలుకుల తో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలు గా వ్యవహరించిన శ్రీమతి దీప్తి మరియూ శ్రీమతి మాధవి తమదైన వాక్చాతుర్యం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

TAGB Ugadi Vedukalu 2015 (1) TAGB Ugadi Vedukalu 2015 (2) TAGB Ugadi Vedukalu 2015 (3) TAGB Ugadi Vedukalu 2015 (4) TAGB Ugadi Vedukalu 2015 (5) TAGB Ugadi Vedukalu 2015 (6) TAGB Ugadi Vedukalu 2015 (7) TAGB Ugadi Vedukalu 2015 (8) TAGB Ugadi Vedukalu 2015 (9) TAGB Ugadi Vedukalu 2015 (10) TAGB Ugadi Vedukalu 2015 (11)

చిన్నారులు ఆలపించిన శ్లోకములు , భజనల తో ప్రారంభమై , డాన్సు మెడ్లీల సందడుల తో , శాస్త్రీయ సంగీతము మరియు శాస్త్రీయ నృత్య ప్రదర్సనల తో ముందుకు సాగుతూ 7 గంటల పాటు నిర్విరామంగా సాగిన నాటి కార్యక్రమంలో 50 కి పైగా ప్రదర్సనామ్సములతో కళాకారులు ప్రేక్షకులను ఉత్తేజ పరిచారు. శ్రీయుతులు రమణా దుగ్గిరాజు గారు మరియు శ్రీకాంత్ గోమట్టం గారు సాంప్రదాయ రీతిలో శ్రీ మన్మధనామ సంవత్సర రాసి ఫలాలను చక్కగా వివరించారు.

నాటి కార్యక్రమముల లో భాగంగా TAGB అధ్యక్షులు శంకర్  మాగాపు  తమ నూతన కార్యవర్గ సభ్యులను ప్రేక్షకులందరికీ పరిచయం చేసారు.బోర్డు అఫ్ ట్రస్టీ చైర్మన్ శ్రీ ప్రకాష్ రెడ్డి గారు నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి గా విచ్చేసారు . TAGB కార్యనిర్వాహక కమిటీ వారు మరియు కార్యవర్గసభ్యులు, TANA ప్రెసిడెంట్, మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అందించిన “ఉగాది పురస్కారం గ్రహీత, మన బోస్టన్ ప్రాంతాలలోని తెలుగు వారి ప్రియతమ నాయకులైన శ్రీ మోహన్ నన్నపనేని గారిని సత్కరించారు.

నాటి వేడుకలకు ముందుగా cake decoration , impromptu painting , మరియు telugu quiz పోటీలు నిర్వహించ బడ్డాయి. పోటీలలో గెలిచిన వారికి TAGB నిర్వాహక సభ్యులు బహుమతులను అందజేశారు.  నాటి సాయంకాలం ప్రత్యేక ఆకర్షణగా నిలచిన కార్యక్రమముల లో ఒకటైన కూచిపూడి నాట్యాలయ వారు ప్రదర్శించిన ” తెలుగు కళా వైభవము ” నృత్య రూపకం ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులను చేసింది. ఆ నృత్య రూపకంలోని కళాకారులు ఈ ప్రదర్శనలో మన తెలుగు చరిత్రని , వైభవాన్ని , సంస్కృతిని కళ్ళకు కటినట్టుగా చూపించారు. ఈ రూపకం ప్రదర్శించ బడుతున్నంత సేపు ఆడిటోరియంలో ఉన్న అన్ని వయసులవారు రెప్పవేయకుండా , కటిక నిశబ్దాన్ని పాటిస్తూ అరగంట సేపు సాగిన ఈ నృత్యరుపకాన్ని ఎంతో శ్రద్ధతో వీక్షించారు. ఈ రూపకాన్ని ప్రదర్శించిన శ్రీమతి శైలజా తుమ్మల గారిని వారి శిష్యులను ప్రేక్షకులందరూ ముక్తకంతము తో , కరతాళ ధ్వనులతో కొనియాడారు.

నాటి సాయంత్రము ప్రదర్శనల తో పాటు ఆ ఆవరణలో పెట్టిన అంగడులు కూడా వచ్చిన వారిని ఆకట్టుకున్నాయి. వివధ రకములైన ఆభరణములు , వస్త్రముల అంగడులు , సాంఘిక సేవాసంస్థలు మరియు సైన్స్ సంబంధించిన వివరములు అందించే అంగడుల తో ఆవరణమంతా జన సందోహముతో క్రిక్కిరిసిపోయింది.  నాటి సాయంత్రము మయూరి రెస్టారంట్ మరియు ఇండియా మార్కెట్ వారు, విచ్చేసిన ఆహుతులకు రుచికరమైన భోజనాన్ని అందించారు.

 

ఎంతో కృషిని , సమయాన్ని వెచ్చించి నాటి వేడుకలను విజయవంతం చేసిన ప్రదర్సకులకు , వారి తల్లితండ్రులకు , విచ్చేసిన ప్రేక్షకులకు , వాలంటీర్లకు , TAGB కార్యవర్గ సభ్యులకు , మరియు దాతలకు , TAGB ప్రెసిడెంట్ శ్రీ శంకర్ మాగపు ప్రత్యేక అభినందనలు తెలియజేసారు.TAGB సెక్రటరీ శ్రీ శ్రీనివాస్ బచ్చు గారి వందన సమర్పణ తో ముగిసింది.  భారత జాతీయ గీతం ఆలపించడంతో , విచ్చేసిన వారందరినీ ఆహ్లాదపరచిన నాటి కార్యక్రమానికి తెరపడింది. బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు వారికి ఈ నాటి కార్యక్రమం మరో చక్కని జ్ఞాపకంలా నిలిచి పోతుందని అనటం లో అతిశయోక్తిలేదు !!