కెనడా లో తాకా మన్మధ నామ సంవత్సర ఉగాది వేడుకలు

1615

తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (తాకా) వారి ఆధ్వర్యములో ఏప్రిల్ 4వ తేదిన శనివారం బ్రాంప్టన్ లోని పీల్ సెకండరీ స్కూల్ లో ఉగాది వేడుకలు దాదా పు 700 మంది తోటి తెలుగు వారి తో కన్నుల పండుగ గా జరిగాయి. ఈ వేడుక అచ్చ తెనుగు సాంప్రదాయ పద్ధతులతో దాదాపు 6 గంటలు పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల తో సభికులను అలరించాయి. పండిట్ శ్రీ మంజునాథ్ సిద్ధాంతి గారు మన్మధ నామ సంవత్సర పంచాంగ శ్రవణం చేయగా, శ్రీమతి దుగ్గిన లక్ష్మి గారు ఉగాది పచ్చడి అందరికి అందచేశారు.

uadhi_2 ugadhi_1 ugadhi_3

 

తాకా కల్చరల్ సెక్రటరీ శ్రీ అరుణ్ కుమార్ లయం గారు ఆహ్వానించగా, శ్రీమతి జయశ్రీ కన్నన్, శ్రీమతి వాణి జయంతి, శ్రీమతి కిరన్మయి గార్లు జ్యోతి ప్రజ్వలన చేయగా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉగాది వేడుకలలో తాకా వారు నిర్వహించిన తెలుగు సినిమా ప్రశ్నల పోటీలలో టీంలు ఎంతో మంది ఉత్సాహంగా పాల్గొన్నాయి. DSP టీం (దుర్గ, రవితేజ, స్వామి, ప్రసాద్) మొదటి ఆహుమతి గెలువగా, హేమచందర్ టీం (శ్రీకర్ కోవిరినేని, శ్రీచక్ర కోవిరినేని, వరుణ్ మోటూరి) రెండవ బహుమతి గెలుచు కొన్నారు. వ్యవస్థాపక సభ్యులు శ్రీ చారి సామంతపూడి తాకా పురస్కారముల ప్రాస్తవ్యాన్ని వివరించగా , గ్రేటర్ టొరంటో ఏరియా లో బారతీయ బాషలు, సంస్కృతి, విద్య మొదలగు విషయాల లో సేవ చేస్తున్న శ్రీమతి గీత దేసు, శ్రీమతి సరోజ కొమరవోలు, శ్రీమతి జ్యోతి పగిడేల, శ్రీ సుందర్ ధన్వంతరి, శ్రీ తిరుమల దేశిక చారి గారి ని ఈ సంవత్సరపు తెలుగు పురస్కారములు తో తాకా వారు సత్కరించారు.

 

తాకా అద్యక్షులు శ్రీ మునాఫ్ అబ్దుల్ గారు తాకా కార్యక్రమాలను తెలియచేశారు. బోర్డు అఫ్ ట్రస్టీ చైర్మన్ శ్రీ దుగ్గిన రామచంద్రరావు గారు ఉగాది మరియు ట్రస్టీ కార్యక్రమాల ను వివరించారు. తాకా వారు సాంస్కృతిక కార్యక్రమాల లో పాల్గొన్న వారికి, మరియు మార్చి లో జరిగిన తాకా ఆటల పోటీల లో పాల్గొన్న వారికీ బహుమతులు అంద చేసారు.  తాకా వారు తదుపరి కమ్మని తెలుగు వంటకాలతో యిండియా నుండి ప్రత్యేకంగా తెప్పించ బడిన బొబ్బట్ల తో ఉగాది విందుని ఏర్పాటు చేసారు.

 

ఈ కార్యక్రమంలో తాకా  ఉపాధ్యక్షులు శ్రీ శ్రీనాద్ కుంధూరి, సెక్రటరీ శ్రీ రమేష్ మునుకుంట్ల, త్రెజరర్ శ్రీ లోకేష్ చిలుకూరు, డైరెక్టర్స్ శ్రీ భాను పోతకమూరి, శ్రీ వెంకట్ నందిపాటి, శ్రీమతి వాణి మూసాపేట, ట్రస్టీ సభ్యులు శ్రీమతి వైశాలి శ్రీధర్, శ్రీ ప్రసాద్ వోడురి మరియు తాకా వ్యవస్థాపక కమిటీ చైర్మన్ శ్రీ అరుణ్ కుమార్ లయం మరియు వ్యవస్థాపకలు శ్రీ చారి సామంతపూడి, శ్రీ గంగాధర్ సుఖవాసి గార్లు పాల్గొన్నారు. తాకా డైరెక్టర్ శ్రీ భాను పొతకమూరి వోట్ అఫ్ థాంక్స్ చెప్పగా, తాకా కార్య వర్గం వందన సమర్పణ తో కార్యక్రమాన్ని ముగించారు.