విదేశాల్లోనూ తెలుగుపతాకను రెపరెపలాడిస్తున్న యార్లగడ్డ

1373

తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (తాకా) వారి ఆధ్వర్యములో మే  7న, శనివారం మిస్సిసాగా నగరంలో పాయల్ బ్యాంకేట్ హాల్ లో పద్మభూషణ్ గ్రహీత ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ గారిని  కెనడా లోని తెలుగు వారందరూ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా ఇండియన్ కాన్సల్ జనరల్ శ్రీ దిలీప్ భాటియా గారు హాజరు అయ్యారు. తాకా అద్యక్షుడు శ్రీ చారి సామంతపూడి మరియు వారి కార్యవర్గం పండితుల వేదోచ్చారణల మద్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ గారిని స్వాగతించారు. కెనడాలో తొలి భారత సాంస్కృతిక రాయబారిగా లక్ష్మీప్రసాద్ సేవలందించారు. ఈ సందర్భంగా ప్రదీప్ భాటియా మాట్లాడుతూ తెలుగు, హిందీ భాషలకు స్వదేశంలోనే ఆదరణ కరువవుతున్న నేపథ్యంలో యార్లగడ్డ మాత్రం వాటి కీర్తిపతాకలను విదేశాల్లో సైతం రెపరెపలాడిస్తుండటం మనకందరికీ గర్వకారణమని కొనియాడారు. లక్ష్మెప్రసాద్ మాట్లాడుతూ ఇరు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు పెద్దపీట వేయాలని కోరారు. భాషా సంస్కృతులపై ఆయన గంటకు పైగా చేసిన ప్రసంగం అతిధుల హర్షామోదాలు పొందింది. అనంతరం తాకా అధ్యక్షుడు చారి సామంతపూడి, ఉపాధ్యక్షుడు బాచిన శ్రీనివాస్, ఇతర కార్యవర్గ సభ్యులు లయం అరుణ్, మునుకుంట్ల రమేష్, చిల్లకూరు లోకేష్, పి.భాను, దీపా, కల్పన, శ్రావణి, బాషా, వైశాలి, తాకా వ్యవస్థాపక  సభ్యులు రామచంద్రరావు దుగ్గిన, గంగాధర్ సుఖవాసి, శ్రీనాథ్ కుందూరు మరియు స్థానిక ప్రముఖులు  సూరపనేని లక్ష్మీనారాయణ, కొమరవోలు సరోజాదేవి, వెలువోలు బసవయ్య, చంద్ర స్వర్గం, వీరెళ్ల రాజేశ్వరరావు తదితరులు పాల్గొని యార్లగడ్డ టొరంటోలో సేవలందించిన సందర్భాలను సభికులతో పంచుకున్నారు. అతిధులందరికీ బంజార భోజనశాల పసందైన విందుభోజనాన్ని అందించింది.

Teleugu Alliances of Canada(TACA) Felicitated Dr. Yarlagadda Lakshmi Prasad garu in Toronto, Canada (1) Teleugu Alliances of Canada(TACA) Felicitated Dr. Yarlagadda Lakshmi Prasad garu in Toronto, Canada (2) Teleugu Alliances of Canada(TACA) Felicitated Dr. Yarlagadda Lakshmi Prasad garu in Toronto, Canada (3) Teleugu Alliances of Canada(TACA) Felicitated Dr. Yarlagadda Lakshmi Prasad garu in Toronto, Canada (4)