కెనడా లో తాకా ధుర్మిఖి నామ సంవత్సర ఉగాది వేడుకలు

1432

తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (తాకా) వారి ఆధ్వర్యములో ఏప్రిల్ 9వ తేదిన శనివారం మిస్సిసాగా నగరంలోని  పోర్ట్ క్రెడిట్ సెకండరీ స్కూల్ లో ఉగాది వేడుకలు దాదాపు 900 మంది తోటి తెలుగు వారి తో కన్నుల పండుగ గా జరిగాయి. ఈ వేడుక తాకా  సాంస్కృతిక కమిటీ శ్రీ  అరుణ్ లయం , శ్రీమతి దీప సాయిరాం, మరియు శ్రీ నాగేంద్ర హంసా ల  ఆద్వర్యం లో అచ్చ తెనుగు సాంప్రదాయ పద్ధతులతో దాదాపు 6 గంటలు పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల తో సభికులను అలరించాయి. పండిట్ శ్రీ  శ్రీకాంత్ కాసరాల  సిద్ధాంతి గారు దుర్మిఖి  నామ సంవత్సర పంచాంగ శ్రవణం చేయగా, శ్రీమతి కల్పన మోటూరి గారు ఉగాది పచ్చడి అందరికి అందచేశారు.

 

శ్రీ అరుణ్ కుమార్ లయం గారు  ఆహ్వానించగా,  శ్రీమతి జ్యోతి సామంతపూడి, శ్రీమతి మీనా ముల్పూరి , శ్రీమతి వైశాలి శ్రీధర్ ,  శ్రీమతి కల్పనా గార్లు జ్యోతి ప్రజ్వలన చేయగా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉగాది వేడుకలలో దాదాపు వంద మంది టొరంటోలో నివసిస్తున్న చిన్నారులు, యువత మరియు పెద్దలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని ప్రేక్షకులను ఉర్రూతలూగించారు . ఈ  కార్యక్రమానికి మిస్సిసాగా M.P.P మరియు మంత్రివర్యులు దీపిక దామెర్ల గారు ముఖ్య అతిధిగా హజరయ్యరు.  తాకా  అద్యక్షులు  శ్రీ చారి సామంతపూడి  తాకా పురస్కారముల ప్రాస్తవ్యాన్ని, తాకా వ్యవస్తాపకతను, మరియు భవిష్యత్తు ప్రణాళికను  వివరించారు. తాకా  వారు  ఉగాది వేడుకల సందర్బంగా  గ్రేటర్ టొరంటో ఏరియా లో  బారతీయ బాషలు, సంస్కృతి, విద్య మొదలగు విషయాల లో సేవ చేస్తున్న శ్రీ గంధర్ సుఖవాసి (మన బడి),  శ్రీమతి  మాధవి ధన్వంతరి (ప్రజ్ఞ) , శ్రీ మూర్తి గండికోట (సేవ), శ్రీమతి ఉదయ సాయిరాం(మన బడి) , శ్రీ ఉదయ కల్లూరి (ఆర్ట్స్)  గారి ని ఈ సంవత్సరపు తెలుగు పురస్కారములుతో  ముఖ్య అతిధి దీపిక దామెర్ల గారు మరియు తాకా అద్యక్షులు  శ్రీ చారి సామంతపూడి , ఫౌండేషన్ చైర్మన్ శ్రీ రమేష్ మునుకుంట్ల, బోర్డు అఫ్ ట్రస్టీ చైర్మన్ శ్రీ అరుణ్కుమార్ లయం, వ్యవస్థాపక సభ్యుదు శ్రీ మునాఫ్ అబ్దుల్ సత్కరించారు. తాకా ట్రస్టీ సభ్యులు శ్రీ బాష షేక్,  శ్రీమతి మీనా ముల్పూరి , శ్రీమతి వైశాలి శ్రీధర్, ఉపాధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ బాచిన గార్లు  సాంస్కృతిక కార్యక్రమాల లో పాల్గొన్న వారికి, మరియు మార్చిలో జరిగిన తాకా ఆటల పోటీల లో పాల్గొన్న వారికీ బహుమతులు అంద చేసారు.  తాకా వారు ప్రత్యేకంగా తయారు చేపించిన పిండివంటలతో  ఉగాది విందుని ఏర్పాటు చేసారు.

 

ఈ వేడుకను ఎంతో అద్భుతం గా చేపట్టి మరియు విజయవంతము చేసిన తాకా కోశాధికారి శ్రీ భాను పోతకమూరిని, ఫుడ్ కమిటీ ఇంచార్జి శ్రీమతి కల్పనా మోటూరిని , కల్చరల్ ఇంచార్జి శ్రీమతి దీప సాయిరాంని , స్టేజి కమిటీ ఇంచార్జి  శ్రీ శ్రీనివాస్ బాచినను తాకా అద్యక్షులు అభినందించారు. ఈ కార్యక్రమం లో తాకా  వ్యవస్థాపక సభ్యులు శ్రీ గంగాధర్ సుఖవాసి, శ్రీ శ్రీనాథ్ కుందూరి, శ్రీ రామచంద్రరావు దుగ్గిన పాల్గొన్నారు.  ఈక్రింది కమిటీలు మరియు వ్యవస్థాపక సభ్యుడు శ్రీ రాకేశ్ గరికపాటి ఎంతో శ్రమకోర్చి కెనడా లోని తెలుగు వారికోసం ఈ వేడుకను నిర్వహించారు. చివరిగా అందరికి ధన్యవాదాలు చెపుతూ జనగణమన జాతీయగీతంతో కార్యక్రమాన్ని ముగించారు.

Teleugu Alliances of Canada(TACA) Durmukhi ugadi celebrations (1) Teleugu Alliances of Canada(TACA) Durmukhi ugadi celebrations (2) Teleugu Alliances of Canada(TACA) Durmukhi ugadi celebrations (3) Teleugu Alliances of Canada(TACA) Durmukhi ugadi celebrations (4) Teleugu Alliances of Canada(TACA) Durmukhi ugadi celebrations (5) Teleugu Alliances of Canada(TACA) Durmukhi ugadi celebrations (6) Teleugu Alliances of Canada(TACA) Durmukhi ugadi celebrations (7) Teleugu Alliances of Canada(TACA) Durmukhi ugadi celebrations (8) Teleugu Alliances of Canada(TACA) Durmukhi ugadi celebrations (9) Teleugu Alliances of Canada(TACA) Durmukhi ugadi celebrations (10) Teleugu Alliances of Canada(TACA) Durmukhi ugadi celebrations (11)

ఎగ్జిక్యూటివ్ కమిటీ :                                                                  

ప్రెసిడెంట్:  హనుమంతాచారి సామంతపూడి
వైస్ ప్రెసిడెంట్:  శ్రీనివాస్ బాచిన
జనరల్ సెక్రటరీ: లోకేష్ చిలకూరు
ట్రెజరర్:  భానుప్రకాష్ పొతకమూరి
డైరెక్టర్స్: 1   కల్పనా మోటూరి
2  దీప సాయిరాం
3  నాగేంద్ర హంసాల

యూత్ డైరెక్టర్స్ :

1. కీర్తి సుఖవాసి

2. శ్రావణి  దుగ్గిన

 

బోర్డు అఫ్ ట్రస్టీస్:
అరుణ్ కుమార్ లయం  (చైర్మన్)
బాషా షేక్
మీనా ముల్పూరి
వైశాలి శ్రీధర్వీరంజనేయులు కోట