చేనేతే కు మద్దతు నిచ్చిన యూకే NRI మహిళ

3473
చేనేత పరిశ్రమ అబివృద్ది కి తమ వంతు కృషి చేద్దాం ,బాధ్యత వహిద్దాం అనే నినాదం తో TELANGANA NRI FORUM    మహిళలు  ముందుకొచ్చారు .  సిరిసిల్ల నుండి ప్రత్యేకం గ తెప్పించిన వస్త్రాలను ధరించి  లండన్ బ్రిడ్జి వద్ద ప్రదర్శించి .  WE SUPPORT TELANGANA WEAVERS    అనే నినాదం తో మద్దతు తెలిపారు .    TS NRI శాఖా మంత్రి వర్యులు  K .Rama rao   వారానికి ఒక రోజు చేనేత  దరిస్తా  అన్న స్ఫూర్తి గా మేము సైతం అంటున్నారు లండన్ మహిళా .   త్వరలో  సిరిసిల్ల హ్యాండ్లూమ్ ,ప్రభుత్వ సహకారం తో  వచ్చే నెల లో  చేనేత చీరలు  మరియు  షర్ట్స్ ,  గృహావసరాల నిమిత్త బట్టలు మొదలైనవి  తెలంగాణ నుండి తెప్పించి లండన్ లో ఒక వస్త్ర నిలయం ఏర్పాటు చేసి  మార్కెటింగ్ కి కృషి చేస్తామని  ప్రతినిధులు  కాసర్ల జ్యోతి రెడ్డి , శ్రీ లక్ష్మి ,అంతటి  మీనాక్షి తెలిపారు . 
యూరోప్ లో కాటన్ వస్త్రాల  ఉపయోగం ఎక్కువ గ ఉంటుంది . కొంత సమయం తీసుకొని  మొదట  ఇక్కడి  ప్రవాస భారతీయులకు పరిచయం చేస్తామని  మార్కెటింగ్  సన్నాహాలు చేస్తామని గోలి కవిత తెలిపారు .  ఇతర  తెలంగాణ /తెలుగు   సంఘాల మహిళ ల సహాయం తీసుకొని రాబోయే బోనాలు ,బతుకమ్మ  సంబరాల్లో  చేనేత కు పూర్తి స్థాయి గుర్తింపు తెచ్చే ప్రయత్నం తెస్తామని  సిక్కా ప్రీతీ  తెలిపారు .    

సిరిసిల్ల నుండి ప్రత్యేకం గ తెప్పించిన చేనేత వస్త్రాలను   లండన్ చారిత్రిక ప్రదేశాల్లో  ధరించి  ఫోటో ,వీడియో షూట్ నిర్వహించి సోషల్ మీడియా ద్వారా ప్రవాస భారతీయులను కదిలించే దిశ వా మా ప్రయత్నం మొదలు పెట్టామని అనసూరి  వాణి తెలిపారు . ఈ కార్యక్రమం లో  రంగుల శౌరి ,గంప జయశ్రీ ,హేమలత గంగసాని, పాల్గొన్నారు . 
 
ప్రవాస తెలంగాణ మహిళ లు చేనేత కు మద్దతు ఇవ్వడం పై చేనేత బంధు ,పద్మ శ్రీ , శ్రీ చింతకింది మల్లేశం గారు ప్రశంసించారు .వీడియో ద్వారా తన సందేశాన్ని అందచేస్తూ తమ సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని  తెలిపారు.
 op1a5909