లండన్ లో ఘనం గా శ్రీ సీతా రామ కళ్యాణం మరియు ఉగాది సంబరాలు

7265
లండన్ లో   Telangana NRI Forum , JET UK    సంయుక్త ఆధ్వర్యం లో ఘనం గా శ్రీ సీతా రామ కళ్యాణం మరియు ఉగాది సంబరాలు నిర్వహించారు.  800 మంది   భక్తులు  కల్యాణ మహోత్సవం లో పాల్గొన్నారు. ముందుగా  జ్యోతి  ప్రజ్వలన ,శాంతి మంత్రం తో ప్రారంభించి , ప్రత్యేకం గ తయారు చేసిన పల్లకి లో శ్రీ రాముల వారిని ,సీతమ్మ  వారిని తీసుకు వచ్చి కళ్యాణం ప్రారంభించారు . లండన్ లో మొదటి సారిగా 80 కుటుంబాలు స్వామి వారి కళ్యాణం లో పాల్గొన్నారు . శ్రీ త్రిదండి చిన్న జీయర్ గారి మఠం  నుండి వచ్చిన శ్రీ రామాచార్య   అయ్యగారి ఆధ్వర్యం లో కళ్యాణం నిర్వహించారు .
Telangana NRI Forum ugadi celebrations in london (1) Telangana NRI Forum ugadi celebrations in london (2)
కల్యాణానంతరం  అన్నమాచర్య కీర్తనలు ,భక్తి పాటలు సాంప్రదాయక నృత్యాలు ,రామాయణం పై క్విజ్ పోటీలు ,చిన్నారుల ఆట ,పాట  లతో ఘనం గా నిర్వహించారు .  భారత సంతతి కి చెందిన  లండన్ MP   సీమా మల్హోత్రా గారు  స్వామి వారి కళ్యాణం లో పాల్గొని  తమను కళ్యాణం లో భాగస్వామ్యం చేసినందుకు    వారికి ధన్యవాదము తెలిపారు . భగవాన్ శ్రీ రామానుజాచార్య 1000 వ జయంతి ఉత్సవాల పై   ప్రజెంటేషన్  ఇచ్చి  భగవాన్ శ్రీ రామానుజాచార్య చరిత్రను తెలిపారు .   శ్రీ సీత రాముల వారిని పల్లకి ఊరేగింపు తో కార్యక్రమం ముగింపు చేశారు.
Telangana NRI Forum ugadi celebrations in london (3) Telangana NRI Forum ugadi celebrations in london (4)
క్విజ్ లో గెలుపొందిన వారిఁగి బహుమతి ప్రధానం చేశారు . కార్యక్రమం లో TELANGANA NRI FORUM    సభ్యులు   JET UK    ట్రస్టీ మరియు JET UK  సభ్యులు  అందరు పాల్గొని  విజయవంతం చేసారు .