హౌన్స్లా, లోని లాంప్టొన్ స్కూల్ (Lampton School, Hounslow) ఆడిటోరియం లో జరిగిన 2016 లండన్ సద్దుల బతుకమ్మ – దసరా సంబరాలు సంబరాలకు యుకే నలుమూలల నుండి తెలంగాణ వాసుల కుటుంబాలే కాకుండా బ్రిటిష్ దేశస్థులు కూడా హాజరు కావడం విశేషం. ఈ కార్యక్రమానికి దాదాపుపదిహేను వందల మంది కి పైగా పాల్గొని విజయవంతం చేశారు.
రంగు రంగుల బతుకమ్మలతో తెలంగాణ ఆడపడుచులు సందడి చేసారు, విదేశాల్లోఉన్నపటికీ సంప్రదాయబద్దం గా పూజలు నిర్వహించి బతుకమ్మ ఆట ప్రారంభించారు,విదేశాల్లో స్థిరపడ్డా కాని తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పాటలు పాడటం అందరిని ఆకట్టుకుంది, చిన్నారులు సైతం ఆట లో పాల్గొనడం కాకుండా, చిన్న చిన్న బతుకమ్మ ల తో సంబరాలకు కొత్త అందాన్ని తెచ్చారు…బతుకమ్మలని నిమ్మజ్జనం చేసి తదుపరి సాంప్రదాయ బద్దంగా సద్దులప్రసాదం ఇచ్చపుచ్చుకున్నారు. స్వదేశం నుండి తెచ్చిన ” శమి చెట్టు” కు ప్రత్యేక పూజలు చేసారు.
ఈ సంవత్సరం కేవలం సంబరాలకే పరిమితం కాకుండా, తెలంగాణ పర్యాటక ప్రత్యేక స్టాల్ ని ఏర్పాటు చేసి, హాజరైన అతిదులకు… రాష్ట్రం లో పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలని వివరించడం జరిగింది . భారత సంతతికి చెందిన , బ్రిటన్ ఎం.పీ లు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా, స్థానికి కౌన్సిలర్ ప్రీతం ,తెలంగాణ లంబార్త్ మేయర్ సలేహీ జఫర్ , గీత మోర్ల ,బ్రిటీష్ ఎంపీ రుత్ కాడ్బరీ, మరియు సికింద్రాబాద్ తెరాస నేత నోముల ప్రకాష్ రావు గారు ముక్య అతిదులుతో పాటు ఇతర ప్రవాస భారత సంఘాల ప్రతినితులు, వేడుకలో పాల్గొన్న వారిలో ఉన్నారు.
బ్రిటన్ ఎంపీ వీరేంద్ర శర్మ మరియు సీమమాళోత్ర ముందుగా స్వాగతో పన్యాసం ఇస్తూ భారత – యూకే దేశాల మద్య ఉన్న మంచి వ్యాపార అనుకూల విధానాల గురించి వివరించి, వాటిని సద్వినియోగం చేసుకోవాలని హాజరైయన తెలంగాణా ప్రతినుతులని ప్రతినితులని కోరారు.
తరువాత నోముల ప్రకాష్ రావు గారు మాట్లాడుతూ… తెలంగాణ రాకముందు తనను ముఖ్య అతిధి గా పలుమార్లు రావడం జరిగింది మళ్ళీ ఈ సంవత్సరం బతుకమ్మ పండుగకు రావడం చాలా ఆనందంగా ఉందని ,అలాగే ఉద్యమ సమయం లో తెలంగాణా ఎన్నారై ఫోరమ్ లండన్ వీదుల్లో “జై తెలంగాణా ” అంటూ చేసిన పోరాటం మాకు ఎంతో స్పూర్తినిచ్చిందని తెలిపారు. ఈ బోనాలు వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, తెలంగాణా రాష్ట్రం లో వున్నట్టుగా అనిపించిందని, తెలంగాణా సంస్కృతి ని ప్రపంచానికి చాటి చెప్తున్న తీరుని ప్రశంసించారు. ఒక పక్క వ్యక్తిగతంగా ఇక్కడున్న బిడ్డలు రోజు వారి పనుల్లో ఉన్నపట్టికి, బాద్యత గల తెలంగాణా బిడ్డలు గా ఆనాడు ఉద్యమం లో నేడు పునర్నిర్మాణం లో పోశిస్తున్న పాత్ర నాకు ఎంతో స్పూర్తినిస్తుందని తెలిపారు.
హాజరైన ఇతర ఆతిథులు, సంస్థ చేసిన గొప్ప సాంస్కృతిక సంబరం ఎంతో స్పూర్తినిచిందని, విదేశీ గడ్డ పై ఇంత ఘనంగా బారతీయ సంస్కృతిని, ముక్యంగా కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్ర సాంకృతిని ప్రపంచానికి చాటుతున్న తీరు గొప్పగా ఉందని ప్రశంసించారు.
ఆతిథులు గా వచ్చిన స్థానికి మహిళా ఎంపీ లు ప్రవాస తెలంగాణా బిడ్డల తో కలిసి బతుకమ్మ – కోలాటం ఆడి, సందడి చేసి అందరిలో ఉత్సాహాన్ని నింపారు . తెలంగాణా ఎన్నారై ఫోరమ్ సంస్థ కొన్ని రోజుల ముందు నిర్వహించిన భారత హై కమీషన్ స్వతంత్ర వేడుకలో ని విజేతలకు, ఆతిథులు బహుమతులు అందించారు.ఉత్తమ బతుకమ్మలకు, బంగారు బహుమతులు అందజేశారు. తెలంగాణ కుటుంబసభ్యులు ఇలా ఒక్కదెగ్గర కలుసుకొని పండగ జరుపుకోవడం చాల సంతోషం గా ఉందని హాజరైన వారందరూ అభిప్రాయపడ్డారు.
సభ మరియు సాంస్క్తుతిక కార్యక్రమాలను, ఇవెంట్స్ ఇన్ఛార్జ్ నగేష్ రెడ్డి కాసర్ల గారు స్వాగతోపన్యాసం తో ప్రారంభించారు ఈ కార్యక్రమ నిర్వాహణకు విశేషంగా కృషి చేసిన సంస్థ వ్యవస్థాపక సబ్యులు – గంప వేణు గోపాల్ ,అద్యక్షులు సిక్కచంద్ర షేకర్ గౌడ్, ప్రదానకార్యదర్శి ప్రవీణ్ రెడ్డి గంగసాని , సంయుక్తకార్యదర్శి – సుధాకర్ గౌడ్ ,అడ్వైసరీ బోర్డ్ ఛైర్మెన్ ఉదయ్ నాగరాజు, ,అడ్వైసరీ బోర్డ్ సబ్యులు ప్రమోద్ అంతటి,గోలి తిరుపతి ,మరియు ప్రధాన సభ్యులు రంగు వెంకట్ ,సురేష్ బుడుగుం,స్పోర్ట్స్ఇన్ఛార్జ్ నరేష్ కుమార్ ,మహిళా విభాఘం హేమలత గంగసాని,మీనాక్షి అంతటి , స్వాతి బుడుగుం , శ్రీలక్ష్మి నాగులబండి ,జ్యోతి కాసర్ల ,వాణి అనసూరి,శౌరి రంగుల , ప్రీతీ నోముల ,శివాజీ షిండే, వంశీ చిట్టి, స్వామి, శివ నరపాక,సునీల్, శ్రీధర్ బాబు,తుకారాం,వెంకట్ వెంకోమల ,సతీష్ గుమాడాలి , శ్యామ్ పిట్ల,సుమన్ గోలి , మధుకర్,కిరణ్ ,గిరి ,సంతోష్ ఆకుల , తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.