కెనడాలో తెలంగాణా వాసుల సంబరాలు

1139

తెలంగాణ రాష్త్ర బిల్లు భారత పార్లమెంటులో ఆమోదం పొందిన సందర్భంగా కెనడా టొరొంటో మరియు చుట్టుపక్కల నగరాలలోని తెలంగాణ వాసులు 23 ఫిబ్రవరి ఆదివారం రోజున  అత్యంత ఆనందంతో సంబరాలు జరుపుకున్నరు. ఈ సంబరాలు  మిస్సిస్సగ  నగరంలోని మాల్టన్ కమ్మ్యునిటి హాలులో జరుగగాయి. ఆరు దషాబ్దాల తెలంగణా వాసుల కలలు మరియు ఎందరో ప్రాణ త్యాగాల వలన సాదించుకున్న తెలంగాణ పునర్నిర్మాణంలో ఎన్ ఆర్ ఇ లందరు పాల్గొని వారి వారి నైపున్యంలో సలహాలు అందించవలసినదిగా వక్తలు కోరారు. ఈ సందర్బంగా సభ్యులందరు కేక్ కట్ చేసి ఉత్సవం జరిపారు. తెలంగాణ సాదనలో అశువులు బాసిన అమరులకు మౌనం పాటింఛి శ్రద్దాంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి సందానకర్తలుగా శ్రీనాధ్ కుందూరి, రమేశ్ మునుకుంట్ల, దేవేందర్ గుజ్జుల,కొటేశ్వరరావు చిత్తలూరి, వేణు మరియు శంతన్ వ్యవహరించారు.కెనడాలో తెలంగాణా వాసుల సంబరాలు (1) కెనడాలో తెలంగాణా వాసుల సంబరాలు (2) కెనడాలో తెలంగాణా వాసుల సంబరాలు (3) కెనడాలో తెలంగాణా వాసుల సంబరాలు (4) కెనడాలో తెలంగాణా వాసుల సంబరాలు (5)