కెనడాలో అత్యంత వైభవంగా తెలంగాణ తీన్మార్ సాంస్కృతిక ఉత్సవాలు

1455

తెలంగాణ కెనడా సంఘం Telangana Canada Association (TCA) అద్వ్యర్యంలో తేది 10 జనవరి  2015 శనివారం రోజున మిస్సిస్సౌగలోని పోర్టుక్రెడిట్  సెకండరీ పాఠశాల ఆడిటోరియంలో  తెలంగాణ కెనడా తీన్మార్ సాంస్కృతిక  ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు.

ఈ సంబురాల్లో -15 డిగ్రీల అత్యంత ప్రతికూల వాతావరణంలో కూడా 500 పైగా కెనడా తెలంగాణ వాసులు పాల్గొని విజయవంతం చేసారు. మొదటగా తెలంగాణ అమరవీరులకు శ్రద్దాంజలి ఘటించిన తర్వాత ఉత్సవాలను ప్రారంభించారు.

ఈ వేడుకలో ఎన్నోవివిద సాంస్క్రుతిక కార్యక్రమాలతొ దాదాపు 5 గంటలపాటు సభికులను అలరించాయి. ఆఖరున ప్రద ర్శించిన తీన్మార్ డప్పు మరియు నృత్యం సభికులందరిని విపరీతంగా అలరించగా , మల్లన్న వేషంలో  విజయకుమార్ తిరుమలాపురం తెలంగాణ యాస మరియు బాష అందరిని ఆకర్షించాయి.

ఈ కార్యక్రమాలన్నీ స్థానిక తెలంగాణ వారు చక్కటి తెలంగాణ భాని లో ప్రదర్శించటం విశేషం. సభికులందరికి  తెలంగాణ కెనడా అసోసియేషన్  రుచికరమైన  తెలంగాణ హైదరాబాద్ బిర్యాని మరియు ఇతర శాఖాహార వంటకాలతో భోజనాలు ఏర్పాటు చేశారు.

DSC02719 DSCN2819 DSCN2877 DSCN2958 Image10 Image14

ఈ సంబురాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ చంద్ర స్వర్గం గారి ఆధ్వర్యంలో జరుగగా, ట్తస్టీ అధ్యక్షులు  శ్రీ అఖిలేశ్ బెజ్జంకి, ఫౌండేషన్ కమిటి అధ్యక్షులు  శ్రీ  కుందూరి శ్రీనాధ్, ఉపాధ్యక్షులు  శ్రీ కోటెశ్వరరావు చిత్తలూరి, సెక్రటరీ సయ్యద్ అతీక్  పాషా, కల్చరల్  సెక్రటరీ శ్రీ వేణు రోకండ్ల, ట్రెజరర్ శ్రీ దేవేందర్ గుజ్జుల, జాయింటు ట్రెజరర్  శ్రీ శంతన్ నేరెల్లపల్లి, డైరక్టర్లు శ్రీ వేణు గుడిపాటి, శ్రీ సంతోష్ గజవాడ, శ్రీ సమ్మయ్య వాసం, శ్రీ విజయ కుమార్ తిరుమలాపురం, శ్రీ రవీందర్ బయ్యారపు, శ్రీమతి శిరిష స్వర్గం,  ట్రుస్టీలు శ్రీ హరి రావుల, శ్రీ రాజేశ్వర్ ఈద, శ్రీమతి రాధిక బెజ్జంకి, ఫౌండర్లు శ్రీ ప్రకాశ్ చిట్యాల,  శ్రీ నవీన్ సూదిరెడ్ది, ముఖ్య వలంటిర్లు శ్రీ అనిల్ దుద్దుల, శ్రీ మధుసూధన్ స్తోత్రభాస్యమ్, శ్రీ నర్సింహ మూర్తి కలగోని, శ్రీ మురళి కందివనం, శ్రీ మల్లికార్జున్ మదపు, కలీముద్దీన్  మరియు  ఇతర వాలంటీర్సు సహకారంతో నిర్వహించగా శ్రీ రమేశ్ మునుకుంట్ల సమన్వయ పరిచారు.

వ్యాఖ్యాతలుగా కుమారి మేఘన స్వర్గం మరియు కుమారి మనస్విని బెజ్జంకి వ్యవహరించారు.  ఈ సభలో TCA 2015 తెలుగులో టొరొంటో టైములో చక్కటి తెలుగు క్యాలెండరును ఆవిష్కరించారు.  ఆఖరున సయ్యద్ అతీక్  పాషా వందన సమర్పణతో కార్యక్రమాలు ముగిసాయి.