టోరొంటో నగరంలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు 2016

1222

తెలంగాణ కెనడా సంఘం (Telangana Canada Association- TCA)  ఆద్వర్యంలో 1 అక్టోబరు 2016 శనివారం రోజున కెనడా దేశం గ్రేటర్ టోరొంటో లోని  లింకన్ అలక్జెండర్ పాఠశాల ఆడిటోరియంలో 600 మంది ప్రవాస తెలంగాణా వాసులు  పాల్గొని బతుకమ్మ ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. మహిళలు సాంప్రయ దుస్తులతో బతుకమ్మ ఆటలు ఆడుతు పాటలు పాడుకొన్నారు.  సంఘం ఆద్వర్యంలో ఇది పన్నెండొవ  బతుమ్మ కాగా తెలంగాణ ఏర్పాటు తర్వాత మూడవ బతుకమ్మ కావడంతో అందరు కూడ పండుగను  అత్యంత సంబురంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ కెనడా సంఘం (Telangana Canada Association- TCA)  ఆద్వర్యంలో మంచి రుచికరమైన భొజనాలు ఏర్పాటు చేసారు.

tca_bathukamma tca_bathukamma2016 telangana-canadaassn_bathukamma_2016 telanganacanadaassn2016bathukamma

అధ్యక్షులు శ్రీ చంద్ర స్వర్గం గారు మాట్లాడుతూ తెలంగాణ కెనడా సంఘం (Telangana Canada Association- TCA)  ఆద్వర్యంలో చేయబడె అన్ని కార్యక్రమాలలో ఇంతే ఉత్సాహంతో పాల్గొని విజయవంతం చేయవలెనని సబికులందరిని కోరారు.

బతుకమ్మలను ప్రక్కనేగల హంబర్ నదిలో నిమజ్జనం చేసి సాంప్రదాయ బద్దంగా తయరు చేసుకొని వచ్చిన ఫలహారాలను ఆరగించారు. మహిళలు గౌరమ్మ పసుపు కుంకుమలను పంచుకున్నారు. చివరగా  వందన సమర్పనతో బతుకమ్మ ఉత్సవాలు ముగిసాయి.