టోరొంటో నగరంలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

1363

తెలంగాణ కెనడా సంఘం (Telangana Canada Association- TCA) ఆద్వర్యంలో 20 సెప్టెంబరు 2014 శనివారం రోజున కెనడా దేశం గ్రేటర్ టోరొంటో లోని మిస్సిస్సాగ నగరంలోని మిడోవేల్ పార్కు లో దాదాపు 400 మంది పాల్గొని బతుకమ్మ ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. మహిళలు సాంప్రయ దుస్తులతో బతుకమ్మ ఆటలు ఆడుతు పాటలు పాడుకొన్నారు. సంఘం ఆద్వర్యంలో ఇది పదవ బతుమ్మ కాగా తెలంగాణ ఏర్పాటు తర్వాత మొదటి బతుకమ్మ కావడంతో అందరు కూడ పండుగను అత్యంత సంబురంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ కెనడా సంఘం (Telangana Canada Association- TCA) ఆద్వర్యంలో మంచి రుచికరమైన భొజనాలు ఏర్పాటు చేసారు._DSC1000 _DSC1088 _DSC1100

తెలంగాణ కెనడా సంఘం (Telangana Canada Association- TCA) ఆద్వర్యంలో నూతన (2014-16) కమిటీని ఎన్నికల సభ్యులు శ్రీ శ్రీనాధ్ కుందూరి, శ్రీనివాస్ తిరునగరి మరియు ప్రకాష్ చిట్యాల గార్లు ప్రకటించగా ఫౌండింగ్ మెంబర్ శ్రీ రమెష్ మునుకుంట్ల గారు కమిటీ సభ్యులను పరిచయం చేసారు.

నూతన అధ్యక్షులుగా చంద్ర స్వర్గం, ఉపాధ్యక్షులుగా కోటెశ్వర రావు చిత్తలూరి, సెక్రెటరిగా అతీక్ పాషా, కల్చరల్ సెక్రెటరిగా వేనుగొపాల్ రెడ్డి రోకండ్ల, కోషాధికారిగా దేవెందర్ రెడ్డి గుజ్జుల, సమ్యుక్త కోషాధికారిగా షంతన్ రెడ్డి నేరెల్లపల్లి మరియు డైరెక్టర్లుగా సమ్మయ్య వాసం, సంతోశ్ గజవాడ, విజయ్ కుమార్ తిరుమలాపురం, రవిందర్ బయ్యారపు మరియు వేను రెడ్డి గుడిపాటి ఎన్నిక కాగ బోర్డ్ ఆఫ్ ట్రస్టు సభ్యులుగా రాజేశ్వర్ ఈద, ప్రభాకర్ కంబాలపల్లి, హరి రావుల్కర్ మరియు అఖిలేశ్ బెజ్జంకి గార్లు ఎన్నికయ్యారు.

ఉత్తమ బతుకమ్మ మొదటి బహుమతి శ్రీమతి ధనలక్ష్మి మునుకుంట్ల, శీరీష చెన్న, గౌతమి కొండబత్తిని, శీరీష స్వర్గం గ్రూపు గెలుచుకొనగా రెండవ ఉత్తమ బహుమతి శ్రీమతి శ్రీలత శ్రీరంగం గెలుచుకొన్నారు, మూడవ ఉత్తమ బహుమతిని శ్రీ ప్రియ ఈద మరియు సుధ కంబాలపల్లి గ్రూపు గెలుచుకున్నారు. ఉత్తమ బతుకమ్మ పాటలకు గాను శ్రీమతి శోభా పీచర గారు మరియు శ్రీమతి స్వాతి మారెపల్లి గార్లు గెలుచుకొన్నారు.

నూతన అధ్యక్షులు శ్రీ చంద్ర స్వర్గం గారు మాట్లాడుతూ తెలంగాణ కెనడా సంఘం (Telangana Canada Association- TCA) ఆద్వర్యంలో చేయబడె అన్ని కార్యక్రమాలలో ఇంతే ఉత్సాహంతో పాల్గొని విజయవంతం చేయవలెనని సబికులందరిని కోరారు.

బతుకమ్మలను ప్రక్కనేగల క్రెడిట్ నదిలో నిమజ్జనం చేసి సాంప్రదాయ బద్దంగా తయరు చేసుకొని వచ్చిన ఫలహారాలను ఆరగించారు. మహిళలు గౌరమ్మ పసుపు కుంకుమలను పంచుకున్నారు.

చివరగా కమ్మని మసాల తేనీటి ఆరగింపు మరియు వందన సమర్పనతో బతుకమ్మ ఉత్సవాలు ముగిసాయి.