హుద్ హుద్ తుఫాను బాధితులకు విరాళాలు అందించిన టాస్క్ (TASC)

1482

హుద్ హుద్ తుఫాను తాకిడికి అతలాకుతలమైన విశాఖపట్టణం ఇప్పుడే పునర్నిర్మాణ ప్రయత్నంలో ఉంది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా, ఎన్నో వ్యాపార సంస్ధలు, స్వచ్చంద సంస్ధలు కూడా తమవంతు పాత్ర ద్వారా కృషి చేస్తునే ఉన్నాయి. అలాగే ఎందరో దాతలు, తమ విరాళాలను ఉదారంగా అందించారు.

 

దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం కూడా “మేము సైతం” అంటూ, తుఫాను బాధితుల సహాయార్ధం విరాళాలను సేకరించాము. అందులోని ప్రతి ఒక్క రూపాయి, నేరుగా బాధితులకు, లబ్ధిదారులకు చెందాలన్న తపనతో, స్వయంగా
విశాఖపట్టణం లోని ప్రముఖ స్వచ్చంద సంస్ధ అయినటువంటి లయన్సు క్లబ్ వారి సహకారంతో ఈ సేకరించిన సొమ్మును అందించడం జరిగింది.

 

TASC Hud Hud relief fund 1 TASC Hud Hud relief fund 2 TASC Hud Hud relief fund 3 TASC Hud Hud relief fund 4 TASC Hud Hud relief fund 5

విశాఖపట్టణంలోని రామ్మూర్తి పంతులు పేట స్లమ్ ఏరియా లో 1తరగతి నుండి 8 వ తరగతి బాలబాలికలు విద్య నేర్చేవారి ప్రాధమిక పాఠశాల తుఫాను తాకిడికి వీగిపోయింది.  వారి స్కూలు పునర్నిర్మాణం లో తాత్కాలిక మరమ్మత్తుల
కోసం మొన్న జనవరి 26 వ తేది, రిపబ్లిక్ డే సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో వారికి సుమారు ముఫై వేల రూపాయలు అందజేయడం జరిగింది. అలాగే స్కూలు లోని 60 మంది విద్యార్ధులకు, వారికి అవసరమైన బట్టలు
(స్కూలు యూనిఫారాలు), పుస్తకాలు, క్రీడా వస్తువులు మొ. అందించడం జరిగింది. ఈ కార్యక్రమం, దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం తరఫున శ్రీమతి సుభద్ర రాణి (పూర్వాద్యక్షుడు ప్రసాద్  రాణి గారి భార్య), లయన్సు క్లబ్ తరఫున జిల్లా
మాజీ గవర్నరు లయన్. ప్రొ.N.V.N. దుర్గా ప్రసాద్ రావు గారు, ప్రెసిడెంట్ లయన్. R. రాజేశ్వరరావుగారు, వైస్ ప్రెసిడెంట్ లయన్ శ్రీ ఉదయ్ శంకర్ గారు, Past President Lion శ్రీ  సరిపల్లి మురళీ కృష్ణగారు,  మెంబరు లయన్.  శ్రీమతి
జయశ్రీ గారు ల  ఆధ్వర్యంలో జరిగింది.

 

లబ్ధిదారులను గుర్తించి, ఈ కార్యక్రమాన్ని  ఏర్పాటు చేసి, TASC వారు సేకరించిన విరాళాలు నేరుగా బాధితులకు అందేలా చెయ్యడంలో సహకరించినందుకు టాస్క్  తరఫున శ్రీమతి సుభద్ర గారు లయన్సుక్లబ్ వారికి కృతజ్నతలు తెలియజేసారు.

 

మన తెలుగు సంఘానికి విరాళాలు ఇచ్చి తుఫాను బాధితులకు మనవంతుగా సహాయపడేలా సహకరించినందుకు దాతలందరికీ శతకోటి వందనాలు టాస్క్  సంఘం తరఫున తెలియజేశారు.