స్ఫూర్తిదాయకంగా జరిగిన 65 వ భారతీయ గణతంత్ర దినోత్సవ సంబరాలు

1164
యూకె, రీడింగ్ నగరంలో స్థానిక తెలుగు వారి సంఘం తారా ఆద్వర్యంలో 65 వ భారతీయ గణతంత్ర దినోత్సవ సంబరాలు ఎంతో వైభవంగా జరిగాయి. 
 
చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరు ఎంతో జాతీయతా స్ఫూర్తి తో జెండా వందనం ,జాతీయ గీతాలాపన ,వందేమాతరం ప్రతిజ్ఞ చేసారు. 

చిట్టి చిట్టి పాపలు స్వాతంత్ర్య సమరయోధుల రూపంలో కనిపించి అందరిలో భారతీయతకు ప్రతిబింబంలా నిలిచారు. భరతమాత, చాచా నెహ్రు ,ఝాన్సీ లక్ష్మీభాయ్ , రాణి రుద్రమదేవి , తిలక్ మరియు మన్నెందొర అల్లూరి సీతారామరాజు రూపదారనతో అందరిని ఉత్తేజ భరితులను చెశారు.వివిధ రాష్ట్రాలకు చెందిన వస్త్రధారనతో బిన్నత్వంలో ఎకత్వతని ప్రదర్శించారు. 
 
ఎంతో మంది చిన్నారులు జాతీయతను పురిగొలిపేలా చిత్రలేఖనం చేశారు, వాటిని ఇక్కడ ప్రదర్శించారు,అవి చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నవి. యువతీ యవకులు ఎంతో ఉత్సాహంగా జాతీయ గీతాలాపనలు చేశారు,ఈ కార్యక్రమానికి కేవలం తెలుగు వారే కాకుండా అన్ని రాష్ట్రాల వారు  హాజరయ్యారు. 
 
యూకే లో ఉన్నప్పటికీ తమ పిల్లలకి భారతీయతను మరియు దాని గొప్ప ధనాన్ని తెలుసుకోవాదానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహద పడతాయని అందరు తల్లిదండ్రులు  వ్యక్తపరిఛి భవిష్యత్తులో కూడా ఇలానే కొనసాగించాలని  తారా నిర్వాహకులని ప్రోత్సహించారు .