యునైటెడ్ కింగ్డం (UK)లో ‘తారా’ వారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఉగాది ఉత్సవాలు

1693

యునైటెడ్ కింగ్డం (UK)లో ‘తారా’ వారి ఆధ్వర్యంలో రీడింగ్ నగరంలో తెలుగు ప్రవాసాంధ్రులు ఉగాది ఉత్సవాలు మార్చ్ 21న, 2015 ఆహ్లాదకరమైన షెహనాయి హాల్ లో కన్నుల పండుగగా జరుపుకున్నారు. మొదట ‘తారా’ కమిటీ మెంబర్, వెంకట్ పారా గారు వచ్చిన వారందరిని సాదరంగా ఆహ్వానించారు, ఆపై  వినాయకుడి శ్లోకంతో మొదలుపెట్టి, ఈ కార్యక్రమాలకి వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్న చెర్రీ నాయుడు మరియు  రాజా వశిష్ట ని   ప్రేక్షకులకి పరిచయం చేశారు. వీరిద్దరూ ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తికరంగా, అందరూ ఎంజాయ్ చేసే విధంగా  మొదట నుండి చివరి వరకు యాంకరింగ్ చేశారు.

మొదట తారా ప్రెసిడెంట్  లక్ష్మి మాటూరు గారు జ్యోతి  ప్రజ్వలన చేసి ఉగాది కార్యక్రమాలని మొదలుపెట్టారు. మానవతా గ్రూప్ చిన్నారులు, శ్రీ విద్య గారి సంగీత విద్యార్దులు, జ్యోత్స్న ప్రకాష్ గారి శిష్యులు వారి వారి కీర్తనలు, భక్తి పాటలతో, శాస్త్రీయ మరియు సినీ నృత్య ప్రదర్శనలతో  ప్రేక్షకులని రంజింపజేయగా, ‘మన మాట’ కోర్స్ ద్వారా తెలుగు నేర్చుకుంటున్న చిన్నారులు కలిసి చేసిన ‘సీతా స్వయంవరం’ నాటకం, ఉగాది పండుగని సాంప్రదాయ బద్దంగా ఎలా జరుపుకోవాలో, ఉగాది పచ్చడిని ఎలా చేసుకోవాలో, ఆ పచ్చడిలో వున్న విశిష్టతను, పంచాంగ శ్రవణం (రాశుల ఆదాయవ్యయాలను, రాజ్యపూజ్యావమానాలను) ఈ కార్యక్రమనికే వన్నె తెచ్చింది. పిల్లలు చేసిన ఫిల్మ్ సాంగ్స్ మీద చేసిన మెడ్లీ డాన్సులు అందరినీ అలరించాయి.

TARA 2015 Ugadi Celebrations 1 TARA 2015 Ugadi Celebrations 2 TARA 2015 Ugadi Celebrations 3 TARA 2015 Ugadi Celebrations 4 TARA 2015 Ugadi Celebrations 5

గాయకులు స్వాతి రెడ్డి గారు, రాంప్రసాద్ గారు, సురేష్ గారు ప్రదర్శించిన సంగీత విభావరిలో ప్రేక్షకులను అటు మధురమైన పాత పాటలతో ప్రేక్షకులని మంత్ర ముగ్ధ్లుల్ని చేయడంతో పాటు ఇటు హుశారెక్కించె  పాటలతో వేడుక ప్రాంగణాన్ని హోరెత్తించారు. పెద్దల కూచిపుడు, భరతనాట్య నృత్య ప్రదర్శన చూపరులని ఆకట్టుకున్నాయి.

చీఫ్ గెస్ట్ (Chief  Guest) గా డిప్యూటీ మేయర్ అఫ్ రీడింగ్, Sarah Hacker, గెస్ట్ అఫ్ హానర్ (Guest  of  Honour) గా రీడింగ్ వెస్ట్ MP, అలోక్ శర్మ, విచ్చేయగా, తారా వారి ఉగాది పురస్కారాన్ని (లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ని) ఈ సారి ‘మానవతా’ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ శ్రీనివాస అల్లూరి గారికి, ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలని అభినందిస్తూ ఇస్తున్నట్లుగా తారా సెక్రటరీ రవికాంత్ ప్రకటించారు – శ్రీనివాస గారి తరపున వచ్చిన ఉమా మరియు జయంతి గారు ఉగాది పురస్కారాన్ని Sarah Hacker మరియు Alok Sharma చేతుల మీదుగా అందుకున్నారు. ఉమా గారు, జయంతి గారు మానవతా సంస్థ వ్యవస్థ గురించి, వారు శ్రీని గారు చేపట్టిన సేవా కార్యక్రమాల గురించి వివరించారు – తదుపరి గెస్ట్స్ గా వచ్చిన Sarah Hacker మరియు Alok Sharma అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ భారతీయులు UK లో మరియు ప్రపంచ నలుమూలలా సాదిస్తున్న విజయాలను వివరిస్థూ, భారతీయుల శక్తి సామర్ధ్యాలను ప్రపంచం చూస్తుందని – వారు అన్ని రంగాలలో ముందున్జలో వుండబోతున్నారని చెప్పుకొచ్చారు. Sarah ‘నమస్తే’ అని వంగి, చేతులు జోడించి చెప్పడంతో ప్రేక్షకులు చప్పట్లతో హర్ష్యం వ్యక్తం చేశారు. వీరిద్దరికీ తారా ప్రెసిడెంట్ మెమెంటోలు అందచేశారు.

ఆపై పెద్దలు ప్రదర్శించిన కపుల్స్ డాన్సు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. వివిధ గ్రూప్స్ చేసిన గందరగోలం నాటకంతో, డంబ్ డాన్సుతో, నటుడు చిరంజీవిని, కృష్ణని, ఎన్టీఆర్ని, రాజశేకర్ని తలపిస్తూ చేసిన డాన్సులతో వేదిక ప్రాంగణం ప్రేక్షకుల నవ్వులతో, చప్పట్లతో నిండి పోయింది. చాలా కాలం తరువాత కడుపుబ్భ నవ్వుకున్నాం అని పలువురు ఈ కార్యక్రమాలని వేదికనెక్కించిన  వారిని అభినందించారు.

చివరగా ‘తారా’ సెక్రటరీ రవికాంత్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి తోడ్పడిన వాలంటీర్స్ కి, సభ్యుల కి, యాంకర్స్ కి, ముఖ్యంగా స్పాన్సర్స్ కి (Main Sponsors – AccuLegal, Red Ribbon మరియు  Associate Sponsors – State Bank Of India, Kandala Travels) కృతజ్ఞతలు తెలిపుతూ కార్యక్రమాన్ని ముగించారు.