ఘుమ ఘుమలతో నోరూరిస్తూ సాగిన ​​ టా౦టెక్స్ ​​ వనితావేదిక వంటల పోటీలు

1278

నవంబరు 23, 2014, డాల్లస్/ఫోర్టువర్త్, టెక్సస్ :

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టా౦టెక్స్) వనితావేదిక మరియు ఉత్తర టెక్సస్ భారతీయ సంఘం (IANT) వనితా విభాగం సంయుక్తంగా వంటల పోటీలు నిర్వహించారు. డాల్లస్ ప్రాంత ఆడపడుచులు అధిక సంఖ్యలో పాల్గొన్న ఈ వంటల పోటీల్లో పాల్గొన్న దాదాపు పాతిక రకాల వినూత్న వంటలు తయారు చేసుకొని వచ్చారు. వారు వంటలను ప్రదర్శించిన తీరు అందరినీ ఆకట్టుకున్నది. ప్రత్యేకించి సొరకాయ హల్వ, మడత కాజ, ఫ్రూట్ కేసరి, వెజ్ హలీమ్, దాబేలి, రాగి గుంటపునుగులు, వాక్కాయ పచ్చడి అందరి నోరూరించాయి.

టా౦టెక్స్ వనితావేదిక సమన్వయకర్త మండిగ శ్రీలక్ష్మి, ఉమెన్ ఫోరమ్ సమన్వయకర్త మందాడి ఇందు రెడ్డి మరియు టా౦టెక్స్ వనితావేదిక కార్యవర్గ బృందం పంచార్పుల ఇంద్రాణి, తోట పద్మశ్రీ, పాలేటి లక్ష్మి, శీలం కృష్ణవేణి , మెంట మాధవి, బజ్జూరి లక్ష్మి ఆధ్వర్యం లో ఈ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. వంటల పోటీల న్యాయనిర్ణేతలుగా బావిరెడ్డి శిరీష , రెడ్డి సుధ, పడాల సంధ్య , ముద్ద మనోజ్ఞ వ్యవహరించారు.TANTEX Vanitaa Vedika_Vantala Poteelu_11232014_Audience TANTEX Vanitaa Vedika_Vantala Poteelu_11232014_Group Photo TANTEX Vanitaa Vedika_Vantala Poteelu_11232014_Prize Distribution_1 TANTEX Vanitaa Vedika_Vantala Poteelu_11232014_Prize Distribution_2 TANTEX Vanitaa Vedika_Vantala Poteelu_11232014_Samanvaya Kartha Prasangam TANTEX Vanitaa Vedika_Vantala Poteelu_11232014_Vantala Pradarshana

సొరకాయ పొట్ట ను తొలిచి అందులో పెట్టి ప్రదర్శించిన సొరకాయ హల్వా కి అశ్విని గారికి ‘డిష్ అఫ్ ది ఇయర్’ అవార్డు లభించింది. టా౦టెక్స్ అధ్యక్షుడు కాకర్ల విజయ్ మోహన్, ఉత్తరాధ్యక్షుడు డా. ఉరిమిండి నరసింహారెడ్డి మరియు IANT అధ్యక్షులు స్వాతి షా ఈ పోటీలో గెలిచిన విజేతలకు బహుమతి ప్రధానం చేసారు.

తోట పద్మశ్రీ నిర్వహించిన ‘వంటల పరిజ్ఞానం ‘ క్విజ్ కార్యక్రమం అందరిని అలరించింది. కార్యక్రమానికి వచ్చిన పురుషులు కూడా సమాధానాలు చెప్పి బహుమతులు గెలుచుకోవడం విశేషం. వనితా వేదిక సమన్వయకర్త మండిగ శ్రీలక్ష్మి మాట్లాడుతూ, మున్ముందు తాము ఇతర సంస్థలతో కలిసి మరిన్నిఆసక్తికరమైన కార్యక్రమాలు చేపడతాం అని అన్నారు.

వనితా వేదికసమన్వయకర్త మరియు కార్యవర్గ బృందం న్యాయనిర్ణేతలకు , కార్య క్రమానికి విచ్చేసిన అందరికి ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమం విశేషాలను చిత్రాల ద్వారా, ఈ క్రింది లంకె లో చూడండి.

http://tantex.smugmug.com/2014/Vanitaa-Vedika/Vanitaa-Vedika-Cooking/45857081_wNWfBs#!i=3710851598&k=53ZxS5K