స్థానిక కళాకారుల ప్రతిభా ప్రదర్శనలతో వసంతాల సౌరభాలను కురిపించిన టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు

763

ఏప్రిల్ 05, 2014, డాల్లస్ ఫోర్ట్ వర్త్

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్), స్థానిక యూలెస్ లోని ట్రినిటి హైస్కూల్లో  షడ్రుచుల  పండుగ వాతావరణం సంతరించుకుని  ఉగాది ఉత్సవాలను  అత్యంత వైభవంగా నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు విజయ్ మోహన్ కాకర్ల  మరియు ఈ కార్యక్రమ సమన్వయ కర్త మహేష్ ఆదిత్య ఆదిభట్ల ఆధ్వర్యంలో సాంస్కృతిక సమన్వయకర్త శారద సింగిరెడ్డి  కార్యక్రమాలని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి , పూజిత కడ్మిసెట్టి, రశ్మిత కడ్మిసెట్టి, మరియు  గౌతం పటేల్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.స్థానిక కళాకారుల ప్రతిభా ప్రదర్శనలతో వసంతాల సౌరభాలను కురిపించిన టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు (1) స్థానిక కళాకారుల ప్రతిభా ప్రదర్శనలతో వసంతాల సౌరభాలను కురిపించిన టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు (2)

స్థానిక విందు ఇండియన్ రెస్టారెంట్ వారు ఉగాది పచ్చడితో కూడిన, పసందైన పండుగ భోజనాలను , ఈ ఉగాది కి  మొట్టమొదటి సారిగా టాంటెక్స్ వారు అరటి ఆకులో ఆహ్వానితులకు వడ్డించారు. ఈ ఉత్సవానికి విచ్చేసిన సుమారు 1000 మంది సమక్షంలో 250 మంది బాల బాలికలు, స్థానిక కళాకారులు ఉత్సాహంగా పాల్గొని  వైవిధ్యమైన సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. భారత దేశం నుండి ప్రత్యేకంగా విచ్చేసిన మిమిక్రీ కళాకారుడు “ఇమిటేషన్ రాజు”, తన ప్రతిభావంతమైన ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. టాంటెక్స్ కార్యదర్శి కృష్ణ రెడ్డి ఉప్పలపాటి ఉగాది శుభాకాంక్షలతో స్వాగతం పలికి ఆ తరువాయి , సాంస్కృతిక సమన్వయకర్త శారద సింగిరెడ్డి స్వాగతోపన్యాసంతో కార్యక్రమ శుభారంభం జరిగింది. శ్రీ జయనామ సంవత్సర విశేషాలను వివరిస్తూ మారింగంటి యుగంధరాచార్యులు గారు పంచాంగ శ్రవణం తో కార్యక్రమాలు మొదలయ్యాయి . ముందుగా విజి సోమనాథ్ శిష్యుల ‘నారాయణ మంత్రం’ కీర్తన, స్వప్న గుడిమెల్ల ఆధ్వర్యంలో ‘మువ్వల సవ్వడి’, సౌమిత్రి తుపురాని పర్యవేక్షణలో ‘చిన్ని కృష్ణుడు’ డాన్స్, సింధూర పోలసానిపల్లి ఆధ్వర్యంలో ‘లంబాడోళ్ళ పిల్ల’ జానపద నృత్యం, హేమ చావాలి శిష్యుల ‘కూచిపూడి వైభవం’ శాస్త్రీయ నృత్యం, రంజీత ఆర్య కొరియోగ్రఫీ చేసిన  ‘ధమాక’ టాలీవుడ్ మెడ్లీ శ్రోతలను ఆకట్టుకున్నాయి.

 

ఈ ఉగాది ఉత్సవాల సందర్భంగా మార్చి నెలలో నిర్వహించిన “వసంత గాన సౌరభం”  సాహిత్య విలువలతో కూడిన సినీపాటల పోటీలను  టాంటెక్స్ వారు ‘శ్రుతి, లయ, శ్రావ్యత, ఉచ్చారణ’ అంశాల ప్రాతిపదికగా, స్థానిక బాల బాలికలకు వారి ప్రతిభా ప్రదర్శనకు అవకాశం కల్పిస్తూ, పోటీలను నిర్వహించారు. అందులో గెలిచిన భారతి కాల్డ్ వెల్, మహిత జంగేటి, నేహ ధర్మాపురం, ప్రజ్ఞ బ్రహ్మదేవర, కీర్తి చామకూర, ఈ ఉగాది ఉత్సవాల వేదికపై వారి పాటలను వినిపించి శ్రోతల మనస్సును దోచుకున్నారు. ఈ గెలుపొందిన విజేతలకు బహుమతుల పోషక దాత  సతీష్ పున్నం ద్వారా అందుకున్నారు. డాలస్ లో నివసిస్తున్నతెలుగు వారు సాంస్కృతిక కార్యక్రమ ప్రియులే కాక, అందులో ప్రతిభావంతులు కూడా … ఇందుకు నిదర్శనంగా ‘డాలస్ గాయని గాయకుల సినీ విభావరి’ మరియు రాజశేఖర్ సూరిభొట్ల దర్శకత్వం లో ‘స్వరాంజలి’ ప్రత్యక్ష  సంగీత  కార్యక్రమాలు, విచ్చేసిన సంగీత ప్రియులను ఎంతో ఆకట్టుకున్నాయి.
స్థానిక కళాకారుల ప్రతిభా ప్రదర్శనలతో వసంతాల సౌరభాలను కురిపించిన టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు (3) స్థానిక కళాకారుల ప్రతిభా ప్రదర్శనలతో వసంతాల సౌరభాలను కురిపించిన టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు (4) స్థానిక కళాకారుల ప్రతిభా ప్రదర్శనలతో వసంతాల సౌరభాలను కురిపించిన టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు (5)

అధ్యక్షులు విజయ్ మోహన్ కాకర్ల గారు శ్రీ జయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ తమ అధ్యక్ష సందేశంలో సంస్థ అభివృద్దికి తోడ్పాటు నందిస్తున్న పోషక దాతలకు, కార్యవర్గానికి, సభ్యులకు కృతఙ్ఞతలు తెలియ చేశారు.  తన 2014 ముఖ్య సందేశాన్ని “కలుపుకుని పోవడం, కలిసి పని చేయడం, సంతోషంగా సాగటం’ మరొకసారి ఆహ్వానితులకు గుర్తు చేస్తూ, అనుకుని విజయవంతంగా గత మూడు నెలలలో చేసిన కార్యక్రమాలలో గానసుధ ను  1220 AM తిరిగి ప్రసారంచేయటం, ఆరోగ్య అవగాహన సదస్సులు , క్రీడల పోటీలను   గురించి మరియు  తరువాత చేయబోయే కార్యక్రమాల గురించి క్లుప్తంగా తెలుపుతఅందరి సహాయ సహకారాలు అందించమని విజ్ఞప్తి చేసారు.  ఉగాది ని పురస్కరించుకొని  టాంటెక్స్ 2014 ఉగాది పురస్కారాలను  ఈ సంవత్సరం సాహిత్యం,సాంకేతిక, శాస్త్ర, మహిళా సామాజిక సేవా మరియు విద్యా రంగాలలో విశేష సేవలందించిన వ్యక్తులకు ప్రకటించారు. తెలుగు సాహిత్య రంగంలో ఆచార్య పూదూర్ జగదీశ్వరన్ గారికి, శాస్త్ర రంగంలో డా. కృష్ణ బాపట్ల గారికి, విద్యా రంగంలో ఆచార్య మతుకుమల్లి విద్యాసాగర్ గారికి, సాంకేతిక రంగంలో డా.పులిగండ్ల విశ్వనాధం గారికి , మహిళా సామాజిక సేవా రంగంలో డా. భాను ఇవటూరి గారికి ఈ పురస్కారాలను అందచేశారు.

 

టాంటెక్స్ మరియు తానా పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర ప్రసంగిస్తూ, జాతిపిత మహాత్మా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ తరపున మే ౩న శంకుస్థాపన మరియు అక్టోబర్ నెలలో జరగబోయే మహాత్మాగాంధీ  విగ్రహ స్థాపన కార్యక్రమ వివరాలు తెలుపుతూ, టాంటెక్స్ సభ్యులందరినీ ఆహ్వానించారు.

 

ఎంతో చక్కటి మిమిక్రీ ప్రదర్శనతో విచ్చేసిన వారందరినీ ఆనందపరిచిన ‘ఇమిటేషన్’ రాజుని జ్ఞాపికతో సత్కరించారు. ఇలాంటి తెలుగు సంస్కృతి వెల్లివిరిచే కార్యక్రమాలను జరుపుకోవాలంటే,  స్వచ్ఛంద కార్యకర్తలు ఎంతో అవసరం. ఇలాంటి కోవకు చెంది, అత్యుత్తమ  స్వచ్ఛంద సేవలందిస్తున్నసతీష్ పున్నం కు “ఉత్తమ స్వచ్ఛంద సేవకుడు (బెస్ట్ వాలంటీర్)  “ పురస్కారాన్ని  టాంటెక్స్ అధ్యక్షులు విజయ మోహన్ కాకర్ల, ఈ ఉగాది ఉత్సవాల వేదికపై ఆహ్వానితుల కరతాళ ధ్వనుల మధ్య అందచేసారు. ఈ సందర్భంగా ఉగాది కార్యక్రమాలుకు తోడ్పడిన మహిళా బృందానికి తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు.

స్థానిక కళాకారుల ప్రతిభా ప్రదర్శనలతో వసంతాల సౌరభాలను కురిపించిన టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు (6) స్థానిక కళాకారుల ప్రతిభా ప్రదర్శనలతో వసంతాల సౌరభాలను కురిపించిన టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు (7) స్థానిక కళాకారుల ప్రతిభా ప్రదర్శనలతో వసంతాల సౌరభాలను కురిపించిన టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు (8)

టాంటెక్స్ వారు చేస్తున్న వివిధ కార్యక్రమాలను ప్రపంచంలో నలుమూలలో వున్న తెలుగు వారందరికీ చేరవేస్తున్న ప్రసార మాధ్యమాలైన దేసిప్లాజా, రేడియో కుషి, tv 9, tv 5, టోరి, ఏక్ నజర్, 6tv వారిని, ఈ వేదికపై గుర్తించడం జరిగినది.

 

ఇక సాంస్కృతిక కార్యక్రమాల వివరాలు లోకి వెళ్ళితే, శాంతి నూతి నేతృత్వంలో ‘వర్షం’ మెడ్లీ నృత్యం, జ్యోతి కందిమళ్ళ శిష్యులు చేసిన ‘అలరులు కురియగ’ శాస్త్రీయ నృత్యం, సుధా దాసరి ఆధ్వర్యంలో ‘బార్బీ గర్ల్స్ డాషింగ్ బాయ్స్’ మెడ్లీ డాన్సు, వసుధ రెడ్డి ఆధ్వర్యంలో ‘అడవి తల్లి’ మెడ్లీ నృత్యం, రూప బంద నేతృత్వంలో ‘విశ్వరూపం’ కథక్ నృత్యం, శ్రీలత సూరి శిష్య బృందం చేసిన “గాజులు” జానపద  నృత్యం, శ్వేత వాసల్ వారి ‘టాలీవుడ్ బీట్స్’ మెడ్లీ, కళ్యాణి ఆవుల నేతృత్వంలో ‘కుంతల వరాళి” థిల్లాన శాస్త్రీయ నృత్యం, మధు చిత్తజల్లు ఆధ్వర్యంలో ‘పల్లెపడుచులు’ జానపద నృత్యం మరియు చివరగా చక్రపాణి కుందేటి కోరియోగ్రఫీ చేసిన ‘తడాకా’ మూవీ మెడ్లీ డాన్స్ తో ఈ ఉగాది ఉత్సవాల ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు శ్రోతలను ఆనందపరచి ఒక తీపి గుర్తుగా ముగిసాయి.

 

వందన సమర్పణ గావిస్తూ, కార్యక్రమ సమన్వయ కర్త మహేష్ ఆదిత్య ఆదిభట్ల ప్లాటినం పోషక దాతలైన మై టాక్స్ ఫైలర్, బావర్చి బిర్యాని పాయింట్, ఆకుల లా అసోసియేట్స్, బిజినెస్ ఇంటెల్లి సొల్యూషన్స్,  ప్లేనో బేలర్ హార్ట్ హాస్పిటల్,   గోల్డ్ పోషక దాతలైన విందు/పసంద్ రెస్టారెంట్ , హోరైజాన్ ట్రావెల్స్, ప్యారడైజ్ బిర్యాని పాయింట్, పాన్ పెప్సికో, విష్ పాలెపు టాక్స్ కన్సల్టెంట్స్,  ఆ౦బియన్స్ రియాల్టీ (కిశోర్ చుక్కాల), అండర్ గ్రౌండ్ ఇండియన్ రెస్టారెంట్,   సిల్వర్ పోషక దాతలైన కె.ఆర్.యు. ప్రొడక్షన్స్ (డిజే,ఆడియో), రియాల్టర్ శ్రీని చిదురాల, రియాల్టర్ శ్రీధర్ బెండపూడి,   ఈవెంట్ స్పాన్సర్స్  శ్రీకాంత్ మరియు సుధ పోలవరపు గారికి , చలపతి రావు మరియు భ్రమరాంభ కొండ్రకుంట గారికి, యునైటెడ్ ఐ.టి. సొల్యూషన్స్ వారికి, మసాల వాక్ ,డేవిడ్ వీక్లీ హోమ్స్ వారికి కృతఙ్ఞతలు తెలియచేసారు.

“గాన సుధ – మన టాంటెక్స్ రేడియో” 1220 AM లో ప్రసారం చేయడానికి సంయుక్త సహకారం అందిస్తున్న ప్రత్యేక ప్రసారమాధ్యమాలైన  దేసిప్లాజా, రేడియో కుషి లకు  మరియు ప్రసారమాధ్యమాలైన tv9, tv5, టోరి,    ఏక్ నజర్, 6tv లకు  కృతఙ్ఞతలు తెలియచేసారు.

 

ఎంతో కృషి, సమయం వెచ్చించిన టాంటెక్స్ కార్యవర్గ సభ్యులు మరియు వివిధ నామినేషన్ కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. భారతీయ జాతీయ గీతం అందరు ఆలపించడంతో , విచ్చేసిన వారందరికీ ఎంతో ఆహ్లాద పరచిన ఈ కార్యక్రమానికి తెర పడినది.
స్థానిక కళాకారుల ప్రతిభా ప్రదర్శనలతో వసంతాల సౌరభాలను కురిపించిన టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు (9) స్థానిక కళాకారుల ప్రతిభా ప్రదర్శనలతో వసంతాల సౌరభాలను కురిపించిన టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు (10) స్థానిక కళాకారుల ప్రతిభా ప్రదర్శనలతో వసంతాల సౌరభాలను కురిపించిన టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు (11)