టాంటెక్స్ 88వ నెల నెలా తెలుగు వెన్నెలలో తేట తేనియ తీయదనాన్ని పంచిన తెలుగు పద్యం

1410

టాంటెక్స్ 88వ నెల నెలా తెలుగు వెన్నెలలో తేట తేనియ తీయదనాన్ని పంచిన తెలుగు పద్యం

నవంబరు 16, 2014, డాల్లస్/ఫోర్టువర్త్, టెక్సస్ :ప్రతి నెల తెలుగు సాహిత్య సేవలో భాగంగా ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం నిర్వహించే “నెల నెలా తెలుగు వెన్నెల” కార్యక్రమం ఈ ఆదివారం డల్లాస్ లో పారడైస్ రెస్టారెంటు లో సాహిత్య వేదిక సమన్వయకర్త ఆదిభట్ల మహేష్ ఆదిత్య అధ్యక్షతన కవితాన్విత రసరమ్య దీపమై వెలిగింది. ఒక వైపు మంచు కురుస్తూ, దట్టమైన చలిగాలులు వీస్తున్నా కూడా ఈ కార్యక్రమానికి విశేష సంఖ్యలో డాల్లస్ తెలుగు వారు హాజరై తమ భాషాభిమానాన్ని చాటుకొన్నారు. తొలుత సంధ్య గారు పాడిన “మాతెలుగు తల్లి” తో ఈ కార్యక్రమం ప్రారంభం అయింది. ఆ తరువాత అంపశయ్య నవీన్ గారు రచించిన “కాలరేఖలు ” పుస్తకాన్ని పున్నం సతీష్, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రచించిన “వడ్ల గింజలు ” పుస్తకమును బసాబత్తిన శ్రీనివాసులు , చివుకుల పురుషోత్తం రచించిన      “మహా వేద” పుస్తకమును జలసూత్రం చంద్రశేఖర్ సభకు పరిచయం చేసారు. జువ్వాడి రమణ పోతన భాగవతం నుంచి కొన్ని చక్కని తెలుగు పద్యాలు పాడి వినిపించారు. డా.ఊరిమిండి నరసింహరెడ్డి “తెలుగు పొడుపు కధలు” ఆలోచనలతో పాటు హాస్యాన్ని కూడా పంచింది. “ఆకు వేసి భోజనం పెడితే ఆకు తీసి భోజనం చేస్తాం”అది ఏమిటి అంటే చివరగా ఒకరు “కరివేపాకు ” అని చెప్పడంతో అందరూ హాయిగా నవ్వుకొన్నారు.

భారత దేశం నుండి విచ్చేసిన డా. గుడివాడ పద్మావతి గారిని సభకు ఆదిభట్ల మహేష్ ఆదిత్య పరిచయం చేస్తూ వేదిక మీదకు ఆహ్వానించగా టాంటెక్స్ పూర్వాధ్యక్షులు శ్రీమతి లలితా మూర్తి గారు పుష్పగుచ్చంతో ప్రసంగకర్తకు స్వాగతం పలికారు. తదుపరి ముఖ్య అతిధి”తేట తేనియ తెలుగు పద్యం” అన్న అంశం మీద మాట్లాడుతూ సాహితీ ప్రక్రియలలో విశిష్ట మైనది పద్యము, భావరస సమన్వితమై , ఛందో బద్ధమై , పాటకు పదానికి భిన్నంగా లయాత్మకంగా కొనసాగే కవిత్వ ప్రక్రియ పద్యం , వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగి , తరతరాలుగా కాంతులీనే ప్రక్రియ పద్యం అని ఆదికవి నన్నయ కాలం నాటి పద్యాలు ఈనాటికి మనం స్మరించు కొంటున్నామంటే వాటిల్లో దాగిన అక్షర శక్తి, హృద్యత, మాధుర్యం వల్లనే నని తెలిపారు. బమ్మెర పోతన గారి ఆంధ్ర మహా భాగవతం, ఆదికవి నన్నయ ఆదిపర్వం, తిక్కన విరాట పర్వం నుండి పద్యాలు , నంది తిమ్మన పారిజాత పహరణం నుండి , కొడాలి రామదాసు హంపీ యాత్ర , గుఱ్ఱం జాషువా గారి పద్యాలు,వేమన నీతి పద్యాలు ఇలా విభిన్న కాలాలకు చెందిన కవులు , వారి రచనా శైలి, భావ సౌందర్యం ఎంతో చక్కగా వివరించారు.

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు కాకర్ల విజయ్ మోహన్ , ఉత్తరాధ్యక్షుడు డా. ఊరిమిండి నరసింహ రెడ్డి , ఉపాధ్యక్షుడు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం. ముఖ్య అతిధి “డా. గుడివాడ పద్మావతి ” గారికి దుశ్శాలువతో మరియు సాహిత్య వేదిక బృందం జ్ఞాపిక తో సత్కరించారు. సమన్వయకర్త ఆదిభట్ల మహేష్ ఆదిత్య తెలుగు భాష మీద అభిమానంతో, దట్ట మైన మంచులో కూడా ఇంత దూరం వచ్చిన భాషాభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. పారడైస్ రెస్టారెంట్ యాజమాన్యానికి , ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి మరియు ప్రసార మాధ్యమాలైన టీవీ9, టీవీ5, 6టీవీ లకు కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేసారు. సంస్థ కార్యదర్శి ఉప్పలపాటి కృష్ణా రెడ్డి , కోశాధికారి వీర్నపు చినసత్యం , కార్యవర్గ సభ్యులు సింగిరెడ్డి శారద ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

TANTEX_88th NNTV_11162014_Gudivada Prabhavati_Audience TANTEX_88th NNTV_11162014_Gudivada Prabhavati_Gnaapika Pradhaanam TANTEX_88th NNTV_11162014_Gudivada Prabhavati_Group Photo 1 TANTEX_88th NNTV_11162014_Gudivada Prabhavati_Group Photo 2 TANTEX_88th NNTV_11162014_Gudivada Prabhavati_Pushpa Guchham TANTEX_88th NNTV_11162014_Gudivada Prabhavati_Samanvayakartha Palukulu TANTEX_88th NNTV_11162014_Gudivada Prabhavati_Shaluva Sanmaanam TANTEX_88th NNTV_11162014_Mukhya Athithi_Gudivada Prabhavati

కార్యక్రమం విశేషాలను చిత్రాల ద్వారా, ఈ క్రింది లంకె లో చూడండి.

http://tantex.smugmug.com/2014/Sahitya-Vedika/88th-Nela-Nela-Telugu-Vennela/45776464_w83tjw#!i=3701743182&k=Swxn5nQ