డల్లాస్ లో ఘనంగా వాలీబాల్ మరియు గోల్ఫ్ పోటీలు

1004

క్రీడాకారులు మరియు ఔత్సాహికులు వాలీబాల్ ఆట ఆడాలంటే డల్లాసులో మాత్రమే ఆడాలి అనుకునే విధముగా తెలుగు అసొసియేషన్ అఫ్ నార్త్ టెక్సాస్ (టాంటెక్స్) మరియు ఇండియా అసొసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఇఎయణ్టి) సమ్యుక్తంగా అన్నిహంగులు కలిగిన స్థానిక స్పొర్ట్స్ ప్లెక్స్ క్రీడాసముదాయములో చాలా బ్రహ్మాండముగా నిర్వహించారు. ఈ ఆటలపొటీలకు స్థానిక రెస్టారెంట్ అవర్ ప్లేస్ మరియు సాఫ్ట్వేర్ సంస్థ యునైటెడ్ ఐటి సొలుషన్సు ముఖ్య దాతలుగా వ్యవహరించారు. పద్దెనిమిది జట్లు, రెండువందల యాభై మంది క్రీడాకారులు, స్వచ్చంద కార్యకర్తలు అమితమైన ఉత్చాహముతో పాల్గొన్నారు. అహో అనే విధముగా మంచి ప్రావీణ్యముతో గాలిలో పైకి ఎగిరి బలమైన శాట్లు కొడుతూ క్రీడాకారులు ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఈ సందర్భంగా టాంటెక్స్ స్పోర్ట్స్ పతాకమును  టాంటెక్స్ అధ్యక్షులు విజయ్ మోహన్ కాకర్ల మరియు ఇఎయణ్టి అధ్యక్షులు స్వాతి షా ఆవిష్కరించారు. ఈసారి వినూత్నంగా విజయ్ మోహన్ కాకర్ల క్రీడాకారుల చేత క్రీడల ప్రతిఙ్ణ చేయించి ఆటలను ప్రారంభించారు. ఇఎయణ్టి బోర్డు ఆఫ్  ట్రస్టీ శ్రీధర్ రెడ్డి కొర్సపాటి తన సహజ ధొరణిలో క్రీడాకారులను ఉత్తేజపరుస్తూ వారి క్రీడాస్పూర్తిని కొనియాడారు. టాంటెక్స్ కప్ ను అంబ్లిక్స్ మరియు ఖేయాస్ జట్లు, ఇఎయణ్టి కప్ ను స్పైడర్స్  మరియు వారియర్స్  జట్లు గెల్చుకున్నాయి. టాంటెక్స్ బోర్డు ఆఫ్  ట్రస్టీ అజయ్ రెడ్డి అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ప్రశంసించారు. ఉత్తరాధ్యక్షులు డాక్టర్ నరసిమ్హా రెడ్డి ఉరిమిండి మరియు ఉపాధ్యక్షులు సుబ్రమణ్యం జొన్నలగడ్డ విజేతలను అభినదించారు. పూర్వాద్యక్షులు ఎన్ ఎమ్మెస్  రెడ్డి క్రీడలు మానసిక వికాసానికి తోడ్పడతాయని ఉద్భోదించారు. టాంటెక్స్ కార్యవర్గసభ్యులు క్రుష్ణా రెడ్డి ఉప్పలపాటి, చినసత్యం వీర్నపు, మహేష్ అదిభట్ల, బాల్కి చాంకూర, రఘు చిట్టిమల్ల, వేను పావులూరి, శశికాంత్ కనపర్తి  మరియు ఇఎయణ్టి సభ్యులు ఇందు రెడ్డి మందాడి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టాంటెక్స్ స్పోర్ట్స్ ప్రతినిధి  వెంకట్ దండ మరియు ఇఎయణ్టి స్పోర్ట్స్ ప్రతినిధి రాజ్ గొంధి స్వచ్చంద కార్యకర్తలు బాలాజి మేరెడ్డి, సురేష్ సుగ్గల, హరి మాదిరాజు, రాజు కురుకురి, మురలి కొండెపాటి, అరవింద్ ఇంజ, రామక్రిష్ణారెడ్డి రొడ్డ, శ్రీధర్ బెండపూడి, మురలి పల్ల, మధు మల్లు, శేఖర్ బ్రహ్మదేవర, రాజేంద్ర మాదాల మరియు రవి మంతెన సేవలను కొనియాడారు. సుబ్బుదామి రెడ్డి మరియు దేసి ప్లాజ టీవీ మనోహర్ చాకచక్యముతో క్రీడాకారుల వివిధ విన్యాసాలను తమ కెమరాలతో చిత్రీకరించారు.

TANTEX_VolleyBall 2014_3

తెలుగు అసొసియేషన్ అఫ్ నార్త్ టెక్సాస్ (టాంటెక్స్) గోల్ఫ్ ఆటల పొటీలను జాతీయ సంస్థ అమెరికా తెలుగు సంఘం (ఆటా) తో కలిసి చాలా ఘనంగా నిర్వహించారు. చల్లని వాతావరణంతో పాటు, ఆహ్లదకరమైన పచ్చిక బయల్లు, వాగులు, వొంపులు కలిగినటువంటి బేర్ క్రీక్ గోల్ఫ్ క్లబ్, డల్లస్ లో క్రీడాకారులు, టాంటెక్స్ మరియు ఆటా ప్రతినిధుల సమావేశము నడుమ మొదలయింది. టాంటెక్స్ అధ్యక్షులు విజయ్ మోహన్ కాకర్ల మాట్లాడుతూ తెలుగు వారు ఇంతటి ప్రావీణ్యం కలిగి ఉండడం చాలా గొప్ప విషయం అన్నారు. మన తెలుగు వారిని ఇంకా ఎంతో ప్రోత్సహించాలని కొరారు. అంతేకాకుండా, మన తెలుగు వారిలో మరింత అవగాహన కల్పించడానికి, ముఖ్యంగా పిల్లలలో జిఙ్ణాస కలిగించడానికోసం క్రుషి చేయవలసిందిగా కాకర్ల సూచించారు. ఆటా సెక్రెటరీ అనంత్ పజ్జూర్ మరియు ఆటా ప్రాంతీయ ప్రతినిధి  అరవింద్ రెడ్డి ముప్పిడి మాట్లాడుతూ ఈ ఆటకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలూ అందిస్తూ మన తెలుగు వారి అభ్యున్నతికి క్రుషి చేస్తూ ఉంటామన్నారు. టాంటెక్స్ కార్యవర్గ సభ్యులు వెంకట్ దండ, మహేష్ ఆదిభట్ల మరియు స్వచ్చంద కార్యకర్తలు రామ క్రిష్ణా రెడ్డి రొడ్డ, శ్రీధర్ బెండపూడి నిర్ధిష్తమైన ప్రణాళికతో గోల్ఫ్ ఆటల పొటీలు సక్రమంగా జరగడానికి ఎంతో క్రుషి చేశారు. ప్రధమ స్థానంలో రాహుల్ చింతల, దెవ్ అడ్డగట్ల, రే డెలునా, మరియు రవి భొగ నిలిచారు. ద్వితీయ స్థానంలో శివ శంకరమంచి, రవి, నాగి, మరియు చక్రవర్తి నిలిచారు. రే డెలూన, వెంకట్ సుబ్రమనియన్, గౌతం కొట, మరియు శివ ప్రత్యేక బహుమతులు గెల్చుకున్నారు. మధ్యాన్న భోజనము సమకూర్చిన జల్సా ఇండియన్ రెస్టారెంట్ కు నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.TANTEX_Golf 2014_1 TANTEX_VolleyBall 2014_2 TANTEX_VolleyBall 2014_1 TANTEX_Golf 2014_3 TANTEX_Golf 2014_2-L