టాంటెక్స్ కార్యవర్గంలొ నూతనోత్సాహం – 2016 అధ్యక్షులుగా జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం ప్రమాణ స్వీకారం

1104

జనవరి 3,2016, డాలస్/ఫోర్ట్ వర్త్

టెక్సాస్ రాష్ట్రంలోని డాలస్- ఫోర్ట్ వర్త్ నగరం తెలుగు సంగీత, సాహత్య, సంస్కృతీ సంప్రదాయాలకు నిలయం. డాలస్ అంటే అమెరికాలో నివసిస్తున్న తెలుగు వారందరికీ “రాజధాని” గా పలువురు అభివర్ణించిన సందర్భాలు ఎన్నో. ఇక్కడ నివసించే తెలుగువారికి కమ్మనైన అమ్మ భాషంటే ప్రాణం. తెలుగు కళలంటే ఇంకా మక్కువ ఎక్కువ. అందుకే భాషకు పట్టాభిషేకం, సాహిత్యానికి అగ్ర తాంబూలం, కళలకు మంగళ హారతులు మన తెలుగు వారు నిత్యం అందిస్తూనే ఉన్నారు. 1986 లో డాలస్-ఫోర్ట్ వర్త్ నగరంలోని కొన్ని తెలుగు సజ్జన కుటుంబాలతో ప్రారంభించబడి, ఎందరో స్వచ్చంద కార్యకర్తల, నిస్వార్ధ కార్య నిర్వాహుల నిరంతర కృషితో పయనం సాగిస్తూ, తెలుగు జాతీయ సంస్థలకు ధీటుగా, ప్రతి సంవత్సరం వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెడుతూ దిన దిన ప్రవర్థమానంగా అభివృద్ధి చెందుతున్న అందరి ప్రియతమసంస్థ టాంటెక్స్ ఈ సంవత్సరంలో ముప్పది వసంతాలను పూర్తి చేసుకుంటున్నది.

 

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం, 2016 సంవత్సారానికి గాను నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. 2016-అధ్యక్షుడిగా జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం పదవి బాధ్యతలు స్వీకరిస్తూ “ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘంలో దాదాపు 15 సంవత్సరాల క్రితం ఒక సేవకుడిగా, కార్యవర్గ సభ్యుడిగా, వివిధ హోదాలలో సేవలందించి ఇంతటి అత్యున్నత సంస్థకు నూతన అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించడం నా అదృష్టంగా భావిస్తున్నాను” అని మరియు ఆ పదవికి పూర్తి న్యాయం చేస్తానని వారి పరిచయ ప్రసంగంలో పేర్కొన్నారు.

Subramanyam Jonnalagadda_TANTEX 2016 President__Photo for Press

TANTEX 2016_Board of Trustee Team TANTEX 2016_Executive Committee Team Photo

తెలుగు భాషా పరిరక్షణ, భావి తరాలకు మన భాష మరియు సంస్కృతి ఔన్నత్యం కోసం ప్రత్యేక కృషి చేస్తానని  ఆయన తెలియ చేసారు. వినూత్నకార్యక్రమాలతో డల్లాస్ తెలుగు ప్రజలకి చేరువ అవతామని తెలిపారు. సాంస్కృతిక అవసరాలతో పాటు మారుతున్న మన సభ్యుల అవసరాలకు అనుగుణంగా సంస్థ కార్యకలాపాలను రూపుదిద్దుకోవడం ఎంతైనా అవసరం.

అధికారిక కార్యనిర్వాహక బృందం


అధ్యక్షుడు : జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం

ఉత్తరాధ్యక్షుడు: ఉప్పలపాటి కృష్ణా రెడ్డి

ఉపాధ్యక్షుడు : శీలం కృష్ణవేణి

కార్యదర్శి : వీర్నపు చిన్నసత్యం

సంయుక్త కార్యదర్శి : చంద్రశేఖర్ కాజ

కోశాధికారి: వెంకట్ దండ

సంయుక్త కోశాధికారి: శారద సింగిరెడ్డి

తక్షణ పూర్వాధ్యక్షులు: డా.ఊరిమిండి నరసింహారెడ్డి

 

అజయ్ గోవాడ, ఆదిభట్ల మహేష్ ఆదిత్య, జ్యోతి వనం, కృష్ణారెడ్డి కోడూరు, లక్ష్మి పాలేటి, పద్మశ్రీ తోట,

ప్రవీణ్ బిల్లా, రఘు గజ్జల, శ్రీలక్ష్మి మండిగ, శేఖర్ రాజ్ బ్రహ్మ్మదేవర, లోకెష్ నాయుడు కొణిదెల, ఉమా మహేష్ పార్నపల్లి , పావులూరి వేణుమాధవ్.

 

పాలకమండలి బృందం

శ్రీనివాస్ రెడ్డి గుర్రం (అధిపతి), రమణ పుట్లూర్ (ఉపాధిపతి),

సుగన్ చాగర్లమూడి , రామకృష్ణా రెడ్డి రొడ్డ, శ్యామల రుమాళ్ళ, శ్రీనివాస్ బావిరెడ్డి, డా. రాఘవ రెడ్డి సిరిపిరెడ్డి

 

తమ పదవీ బాధ్యతలు స్వీకరించిన జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం గారు “టాంటెక్స్ సంస్థ ఇప్పటివరకూ సాధించిన ప్రగతిని కాపాడుకొంటూ, మారుతున్న కాలానికి, అవసరాలకు అనుగుణంగా కార్యకలాపాలను మలచుకొంటూ , ముందుకు సాగడమే మన తక్షణ కర్తవ్యం. ప్రపంచ జనాభాలో అత్యధిక శాతం నేడు యువత. నవజీవన బృందావన నిర్మాతలు యువత అని అందరి లాగానే టాంటెక్స్ కూడా విశ్వసిస్తోంది . అందువలన యువత పురోగతి యే మేము ఈ   సంవత్సరం చేపట్టబోయే పనులలో ప్రధాన బిందువవుతుంది. 2016వ సంవత్సరములో మన సభ్యుల విజ్ఞానం, వినోదం తో పాటు పెరుగుతున్న సభ్యుల అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలను రూపు దిద్దడానికి నూతనోత్సాహంతో మీముందుకు వస్తున్నాము. చేపట్టబోవు ప్రధాన కార్యక్రమాలను క్లుప్తంగా ఇక్కడ అందిస్తున్నాము.

  • టాంటెక్స్ శాశ్వత భవనంకు ఆమోదం లభించింది కనుక ఇక ఇప్పుడు తగినంత నిధులు సమకూర్చుకోవడం, అందుకు అనువైన స్థలం ఎంపిక చేయడం, ఆ తర్వాత భవననిర్మాణ పనులు మొదలుపెట్టడం చేయవలసిఉన్నది.
  • టాంటెక్స్ సభ్యుల వివరాలను నమ్మకమైన శాశ్వతమైన పద్ధతిలో(Permanent Database) కంప్యూటర్లో భద్రపరచటం . దీనివల్ల ముందుముందు ఈ వివరాలు అవసరమైనప్పుడు సమయం ఆదా అవ్వడమే కాకుండా సంస్థాపరంగా జరిగే ఎన్నికలు కూడా సజావుగా నిర్వహించడానికి తోడ్పడుతుంది.
  • భవిష్యత్తు భావితరాలదే అని టాంటెక్స్ గట్టిగా నమ్ముతున్నందు వల్ల భావితరాన్ని మరిన్ని అవకాశాలతో

ప్రోత్సహించడం, వారిలో నాయకత్వపు లక్షణాలను పెంపొందించడం తద్వారా వారి అభ్యున్నతికి , సంఘ అభివృద్ధికి తోడ్పడం

  • ప్రతిభా వంతులైన తెలుగు యువతతో ముఖా ముఖీ కార్యక్రమాలు నిర్వహించడం. ఆవిధంగా రాబోయే సంవత్సరాలలో కళాశాలలకు వెళ్ళే పిల్లలకు స్ఫూర్తిని, అవగాహన కలిగించడం .
  • ప్రస్తుతం మన ఊరిలో ని కళాశాలల్లో తెలుగువిద్యార్ధుల సంఖ్య ఘననీయంగా పెరుగుతోంది. స్థానిక యువతరాన్ని

టాంటెక్స్ లో భాగస్వాములను చేసి సంస్థ ను పటిష్టపరచడం.

  • మనఉన్నతికి స్వయంకృషి, కుటుంబం ఇచ్చే ప్రోత్సాహం తో పాటు, సమాజం కల్పించే అవకాశాలు కూడా దోహదం చేస్తాయి. అందువల్ల తిరిగి ఆ సమాజ అభివృద్ధికి సమాజ సేవా కార్యక్రమాల (Community Services) ద్వారా సేవ చేయాలన్నదే టాంటెక్స్ ధ్యేయం.

పైన చెప్పిన కర్యక్రమాలతో పాటు టాంటెక్స్ ముప్పది వసంతాల పుట్టిన రోజు వేడుకను ఘనంగా, గుర్తుండిపోయేలా మీ అందరి సహకారం తో జరుపుకుందాం.“, అని తెలిపారు.

 

2015 సవత్సరంలో టాంటెక్స్ అధ్యక్షుడుగా ఇటీవలే పదవీ విరమణ చేసిన తక్షణ పుర్వాధ్యక్షుడు డా.ఊరిమిండి నరసింహారెడ్డి మాట్లాడుతూ “ గత సంవత్సరంలో భాషా సంస్కృతులతో పాటు మరెన్నో సాంస్కృతిక మరియు సేవా కార్యక్రమాలతో మన సంస్థ సభ్యుల అవసరాలకు అనుగుణంగా పురోభివృద్ది సాధించింది అనడంలో ఆశ్చర్యం లేదు. జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో నిర్వహించబోయే కార్యక్రమాలకు నా సంపూర్ణ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను”, అని తెలిపారు.

మరిన్ని వివరాలకు www.tantex.org సందర్శించండి.