తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ శాక్రమెంటో (TAGS) ఆధ్వర్యంలో ఆటల పోటీలు

913

తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ శాక్రమెంటో (TAGS) ఆధ్వర్యంలో శాక్రమెంటో శివారు నగరం ఫోల్సోం  లో  డిసెంబర్ 11, 2016 న రాంచో కార్దోవ లో  డిసెంబర్ 17 మరియు  18, 2016 న పలు  ఆటల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. అమెరికా లో కాలిఫోర్నియా రాష్ట్రం శాక్రమెంటో శివారు నగరాలకు చెందిన తెలుగు కుటుంబాలకు చెందిన పిల్లలు, పెద్దలు పెద్దఎత్తున పలు ఆటల పోటీలలో పాల్గొన్నారు. ఆటలో గెలిచి తీరాలన్న లక్ష్యమే వారిని విజేతలుగా నిలిపింది. తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ శాక్రమెంటో (TAGS) ఆధ్వర్యంలో జరిగిన ఈ క్రీడా పోటీల్లో 200 మందికి పైగా  పిల్లలు, పెద్దలు పాల్గొని  సత్తా చాటారు. ఈ పోటీలను అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్ మందడి   ప్రారంభించారు. మోహన్ కాట్రగడ్డ, సందీప్ గుడుపెల్లి, శ్రీదేవి మాగంటి, కీర్తి సురం, సురేంద్రనాథ్ కొప్పారపు, శ్రీరామ్ అకిన, మమతా దాసి, నాగేశ్వరరావు దొండపాటి,  నాగేంద్రనాథ్ పగడాల, శ్రీనివాస రావు యనపర్తి, వెంకట్ నాగం, అశ్విన్ తిరునాహరి  ల పర్యవేక్షణలో చదరంగం, తెలుగు ప్రశ్నావళి, తెలుగు కధ చెప్పడం, క్యారమ్స్, గాలిపటాల తయారీ, చిత్ర లేఖనం, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, లెక్కల పోటీలు,  మరియు ముగ్గుల పోటీలు నిర్వహించారు. కాలిఫోర్నియా శాక్రమెంటో లో TAGS ఆటల పోటీలు విజయవంతం కావడానికి అహర్నిశలు కృషి చేసిన వారిలో టీఏజిఎస్ కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు: సత్యవీర్ సురభి, అనుదీప్  గుడిపెల్లి,ధీరజ్ మద్దిని, పరాగ్ వేదపాథక్,శ్రీ రామ్ గౌర, శివ రామిశెట్టి, సందీప్ గొర్లె, కూశాలి సురేష్ కుమార్, రాకేష్ రెడ్డి  గుర్రాల, దివ్య రెడ్డి కుంభం, దర్శన్ దేవాచ, పవన్  దగ్గుబాటి, అనిత వినయ్, గోపి, కొల్లి, పూజ, శిరీష మారేపల్లి తదితరులు ఉన్నారు. చదరంగం పోటీల నిర్వహణకు విశేష సహకారం అందించిన చదరంగం గురు “బ్రహ్మ మొహంతి” కు  TAGS కార్యవర్గ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక “చికాగో పిజ్జా విత్ ఎ ట్విస్ట్” రెస్టారెంట్ వారు అందించిన నోరూరించే ఇండియన్  పిజ్జాలు అందరినీ అలరించాయి. విజేతల వివరాలను అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్ మందడి  ప్రకటించారు. విజేతలకు జనవరి 14, 2017 న జరుగబొనున్న TAGS 13 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి సంబరాల సందర్భంగా బహుమతులు అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు ప్రకటించారు.

 

అమెరికా లో కాలిఫోర్నియా రాష్ట్రం లో ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (TAGS) 13 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి సంబరాల కు ఏర్పాట్లు శరవేగంగా  జరుగుతున్నాయి. స్థానిక కళాకారులు సంక్రాంతి వేడుకల ప్రాంగణం ను తమ ఆట పాటలతో అలరించబోతున్నారు. స్థానిక ఫోల్సోం నగరం లో ఉన్న ఫోల్సోం హై స్కూల్ ధియేటర్ లో శనివారం జనవరి 14 వ తేది 2017 మధ్యాన్నం 12 గంటలకు శాక్రమెంటో తెలుగు సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబారాలు మొదలయ్యి, రాత్రి 10 గంటలకు ముగుస్తాయి. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనకు 250 మందికి పైగా స్థానిక కళాకారులు సంసిద్ధులు అవుతున్నారు. ఈ సందర్భం గా వివిధ  కళా రూపాల ప్రదర్శన  తో ప్రేక్షకులను అలరింప జేయడానికి శాక్రమెంటో తెలుగు సంఘం కార్యవర్గ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మరుగునపడిన కళల వికాసానికి శాక్రమెంటో తెలుగు సంఘం చేస్తున్న సాంస్కృతిక కృషి కి అందరు పెద్ద ఎత్తున హాజరై సహకరించాలని కార్యవర్గ సభ్యులు ఈ సందర్భం గా విజ్ఞప్తి చేసారు. TAGS సంక్రాంతి సంబరాల  కార్యక్రమాలకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసు కోవాలనుకునే వారు http://www.sactelugu.org లేదా https://www.facebook.com/SacTelugu ను సందర్శించాలని లేదా [email protected] కు ఈమెయిలు లో సంప్రదించాలని ఈ సందర్భంగా  TAGS కార్యనిర్వాహక సభ్యులు కోరారు.

 

tags-telugu-association-sports-event-2016-1 tags-telugu-association-sports-event-2016-2 tags-telugu-association-sports-event-2016-3 tags-telugu-association-sports-event-2016-4 tags-telugu-association-sports-event-2016-5 tags-telugu-association-sports-event-2016-6 tags-telugu-association-sports-event-2016-7 tags-telugu-association-sports-event-2016-8 tags-telugu-association-sports-event-2016-9 tags-telugu-association-sports-event-2016-10 tags-telugu-association-sports-event-2016-11 tags-telugu-association-sports-event-2016-12