TAGS నిర్వహించిన “మాతృ దేవో భవ, పితృ దేవో భవ” కార్యక్రమానికి విశేష స్పందన

1932

కాలిఫోర్నియా: తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున నివాసముండే కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాక్రమెంటో నగరంలో తెలుగు భాషా సంస్కృతులను పరిరక్షించేందుకు 2003 ‌లో తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ శాక్రమెంటో(TAGS) స్థాపించడం జరిగిందని ఆ సంఘం కార్యనిర్వాహక సభ్యులు తెలిపారు. ఈ స్థానిక సంస్థ తెలుగువారికి అండగా ఉంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకోగలిగిందని వారు పేర్కొన్నారు. ఇటీవలే స్థానిక ఫెయిర్ ఓక్స్ నగరం లో పీకాక్ రెస్టారెంట్ కాన్ఫరెన్సు హాలు లో జరిగిన TAGS సర్వ సభ్య సమావేశం లో 2014-2016 సంవత్సారానికి గాను నూతన కార్యవర్గాన్ని ప్రకటించిందని వారు తెలిపారు.

ఈ సందర్భంగా TAGS 2014-2016 సంవత్సరానికి అధ్యక్షుడిగా వెంకట్ నాగం పదవి బాధ్యతలు స్వీకరించారని చెప్పారు. శాక్రమెంటో నగరంలో గత 11 ఏళ్లుగా నివసిస్తున్న వెంకట్ నాగం TAGS సేవ కార్యక్రమాల్లో ఎంతో చురుకైన పాత్ర వహించారని TAGS కార్యనిర్వాహక సభ్యులు పేర్కొన్నారు. TAGS అధ్యక్ష పదవి స్వీకరించడం ఎంతో అదృష్టమని, ఆ పదవికి పూర్తి న్యాయం చేస్తానని ఈ సందర్భంగా వెంకట్ నాగం తెలిపారు. తెలుగు భాషా పరిరక్షణ, భావి తరాలకు మన భాష మరియు సంస్కృతి ఔన్నత్యం కోసం ప్రత్యేక కృషి చేస్తామని సంఘం నూతన కార్యనిర్వాహక సభ్యులు తెలిపారు. TAGS అధ్యక్షుడిగా వెంకట్ నాగం ఎంపిక కాగా, సెక్రటరీ గా అబ్దుల్ షైక్, కోశాధికారిగా దుర్గా సాయి చింతల ఎంపిక అయ్యారు.

కార్యనిర్వహక బృంద సభ్యులుగా మనోహన్ మందాడి, గిరిధర్ టాటిపిగారి, శ్రీదేవి మాగంటి, రాజా రామ్ ముమ్మడవరపు, వనిత ఆలపాటి, మోహన్ కాట్రగడ్డ ఎన్నికయ్యారు. TAGS సేవా కార్యక్రమాలలో పాలుపంచుకొన్న వాసు కుడుపూడి నూతన “చైర్మన్” గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా TAGS కార్యవర్గం గత రెండు సంవత్సరాలలో చేపట్టిన పలు సేవా కార్యక్రమాలను ట్రస్టీ స్వర్ణ కంభంపాటి వివరించారు. 2014-2016 సంవత్సరానికి ఎన్నికైన నూతన కార్యవర్గానికి ట్రస్టీ బోర్డు మెంబర్లు “రాంబాబు బావిరిసెట్టి, సుధాకర్ వట్టి, మల్లిక్ సజ్జనగాండ్ల, స్వర్ణ కంభంపాటి, అశ్విన్ తిరునాహరి, భాస్కర్ దాచేపల్లి, ప్రసాద్ కేటిరెడ్డి, డాక్టర్ జె ఎస్ ఎస్ శ్రీధర్ రెడ్డి, డాక్టర్ సంజయ్ ఎడ్లపల్లి” అభినందనలు తెలిపారు.TAGS matru devobhava pitru devobhava (9) TAGS matru devobhava pitru devobhava (8) TAGS matru devobhava pitru devobhava (7) TAGS matru devobhava pitru devobhava (6)

ఈ సందర్భం గా శాక్రమెంటో శివారు నగరం ఫాల్సోం లో శనివారం అక్టోబర్ 18, 2014 న TAGS నిర్వహించిన “మాతృ దేవో భవ, పితృ దేవో భవ” కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. అమెరికాకు విచ్చేసిన తెలుగు సీనియర్ సిటిజన్స్ వారు ఆరోగ్యం, సినిమా, పురాణాలు, సాహిత్యం తదితర విషయాలపై జరిగిన ప్రశ్నల పోటీ లో ఉత్సాహం గా పాల్గొని సేద తీరారు. పరిచయ కార్యక్రమం తో మొదలు అయిన “మాతృ దేవో భవ, పితృ దేవో భవ” కార్యక్రమం లో ప్రశ్నల పోటీలతో తో పాటు, డెంటిస్ట్ మాధవి గారు పంటి సంరక్షణ గురించి తెలుగు సీనియర్ సిటిజన్స్ కు పలు సూచనలు చేసారు. అలనాటి పాత పాటలతో కూడిన మ్యూజికల్ చైర్స్ కార్యక్రమం లో తెలుగు సీనియర్ సిటిజన్స్ ఉత్సాహం గా పాల్గొన్నారు. పలువురు తెలుగు సీనియర్ సిటిజన్స్ చక్కని పాత సినిమా పాటలు పాటి అందరినీ అలరించారు. ఈ సందర్భం గా జరిగిన పోటీలలో గెలిచిన తెలుగు సీనియర్ సిటిజన్స్ కు TAGS సంఘం కార్యనిర్వాహక సభ్యులు జ్ఞాపికలను అందజేశారు. ఐదు ఏండ్ల నుండి TAGS కొనసాగిన్తున్న “మాతృ దేవో భవ, పితృ దేవో భవ” కార్యక్రమాన్ని పలువురు తెలుగు సీనియర్ సిటిజన్స్ ప్రశంసించారు. మనోహర్ మందాడి చేసిన వందన సమర్పణ తో కార్యక్రమం విజయవంతం గా ముగిసింది. కాలిఫోర్నియా శాక్రమెంటో లో “మాతృ దేవో భవ, పితృ దేవో భవ” విజయవంతం కావడానికి అహర్నిశలు కృషి చేసిన వారిలో టీఏజిఎస్ కార్యవర్గ సభ్యులు మనోహన్ మందాడి, గిరిధర్ టాటిపిగారి, శ్రీదేవి మాగంటి, రాజా రామ్ ముమ్మడవరపు, వనిత ఆలపాటి, మోహన్ కాట్రగడ్డ, అబ్దుల్ షైక్, దుర్గా సాయి చింతల, స్వర్ణ కంభంపాటి,అశ్విన్ తిరునాహరి, గిరి టాటిపిగారి, సుధాకర్ వట్టి, రాంబాబు బావిరిశెట్టి, మల్లిక్ సజ్జనగాండ్ల, వాసు కుడుపూడి, భాస్కర్ దాచేపల్లి, వెంకట్ నాగం, తదితరులు, TAGS కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు.

ఈ సందర్భం గా TAGS కార్యనిర్వాహక సభ్యులు వనిత ఆలపాటి, హుదుద్ తుపాను బాధితుల సహాయార్ధం విరాళాలు సేకరించారు. విశాఖ లో హుదుద్ తుపాను బారిన పడిన పాఠశాల విద్యార్ధుల సహాయార్ధం TAGS ప్రత్యేకం గా విరాళాలు సేకరిస్తుంది అని, తుపాను బాధితుల సహాయార్ధం విరాళం ఇవ్వదలచిన వారు మరింత సమాచారం కు [email protected] కు ఈమెయిలు లో సంప్రదించాలని TAGS కార్యనిర్వాహక సభ్యులు కోరారు. TAGS చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకోవాలనుకునేవారు http://www.sactelugu.org లేదా

https://www.facebook.com/SacTelugu ను సందర్శించాలని లేదా [email protected] కు ఈమెయిలు లో సంప్రదించాలని TAGS కార్యనిర్వాహక సభ్యులు కోరారు.

TAGS matru devobhava pitru devobhava (5) TAGS matru devobhava pitru devobhava (4) TAGS matru devobhava pitru devobhava (3) TAGS matru devobhava pitru devobhava (2) TAGS matru devobhava pitru devobhava (1)