TAGS – Comedy and Music Show at Sacramento California

1620

శాక్రమెంటో లో జబర్దస్త్ కామెడి మరియు మ్యూజిక్ షో

 

కాలిఫోర్నియా రాష్ట్రం లో ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (TAGS), రిథమ్ మరియు మెలోడీ సంస్థ  వారి  సహకారం తో నిర్వహించిన జబర్దస్త్ కామెడి మరియు మ్యూజిక్ షో  ఆహుతులను విశేషం గా  ఆకట్టుకొన్నది. చలాకీ చంటి, వెంకీ ల హాస్య ప్రదర్శన, ప్రణవి, మణి శాస్త్రి, కృష్ణ ప్రసాద్ పాడిన మధుర గీతాలతో  ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. స్థానిక ఫోల్సోం నగరం లో ఉన్న విస్టా డి లాగో హై స్కూల్ ఆడిటోరియం లో  ఆదివారం అక్టోబర్ 25, 2015 న  సాయంత్రం 4 నుండి 9 గంటల వరకు జబర్దస్త్ కామెడి మరియు మ్యూజిక్ షో  జరిగింది.

చంటి, వెంకీ ప్రదర్శించిన హాస్య సన్నివేశాలు, ప్రణవి, మణి శాస్త్రి, కృష్ణ ప్రసాద్ పాడిన మధుర గీతాలు, నువ్వు నాకు నచ్చావ్ ఫేం సుదీప (పింకీ) యాంకరింగ్,  పీకాక్ రెస్టారెంట్ వారు రూపొందించిన  పసందైన తెలుగు వంటకాలు, మరి ఇంకెన్నో విశేషాలు  ఆహుతులను అలరించాయి.  కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు, నిను కోరి వర్ణం, పుణ్య భూమి నా దేశం నమోనమామి తదితర గీతాలు ఆహుతులను పరవశింపజేసాయు.  ఈ సందర్భం గా రిథమ్ మరియు మెలోడీ సంస్థ అధ్యక్షుడు సుధీర్ కోట మరియు వారి బృందాన్ని TAGS  అధ్యక్షుడు వెంకట్ నాగం సభకు పరిచయం చేసారు. మాససిక వికలాంగులకు ఆపన్న హస్తం అందిస్తున్న విజేష్ణ ఫౌండేషన్ – హైదరాబాద్, మరియు అభయక్షేత్రం – రేణిగుంట కు సహాయం అందించడానికి  రిథమ్ మరియు మెలోడీ సంస్థ  నడుంబిగించిన ఈ యజ్ఞం లో శాక్రమెంటో తెలుగు సంఘం భాగస్వామి అవ్వడం సంతోషకరం అని TAGS  చైర్మన్ వాసు కుడుపూడి ప్రకటించారు.

TAGS Comedy and Music Show October 25th 2015 (1) TAGS Comedy and Music Show October 25th 2015 (2) TAGS Comedy and Music Show October 25th 2015 (3) TAGS Comedy and Music Show October 25th 2015 (4) TAGS Comedy and Music Show October 25th 2015 (5) TAGS Comedy and Music Show October 25th 2015 (6) TAGS Comedy and Music Show October 25th 2015 (7) TAGS Comedy and Music Show October 25th 2015 (8) TAGS Comedy and Music Show October 25th 2015 (9)

ఈ సందర్భం గా చలాకీ చంటి, వెంకీ, ప్రణవి, మణి శాస్త్రి, కృష్ణ ప్రసాద్, సుదీర్ కోట, సుదీప, మధు వాణి లకు  శాక్రమెంటో తెలుగు సంఘం కార్యవర్గ సభ్యులు వేదికపై   ఘన సన్మానం గావించి, జ్ఞాపికలు అందజేశారు. సుదీప పేరు పేరునా ఆహుతులను వేదిక పై పిలిచి వారిచే నృత్యం చేయించారు. చిన్న పెద్ద తేడాలేకుండా అందరు సరదాగా నృత్యం చేసి సేద తీరారు. ఇంకా కాసేపు ఉంటే బాగుండెను అనే భావనతో ఆహుతులు వెనుదిరిగారు. జనవరి 30, 2016 లో ఫోల్సోం లో జరగనున్న శాక్రమెంటో తెలుగు సంఘం 12 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి సంబరాల కు  కీర్తి సురం ఆధ్వర్వం లో బాల బాలికలతో రూపొందించిన టీజర్ వీడియో ను ఈ సందర్భం గా ఆవిష్కరించారు.

 

కాలిఫోర్నియా శాక్రమెంటో లో “జబర్దస్త్ కామెడి మరియు మ్యూజిక్ షో ” విజయవంతం కావడానికి అహర్నిశలు కృషి చేసిన వారిలో టీఏజిఎస్ కార్యవర్గ సభ్యులు మల్లిక్ సజ్జనగాండ్ల, మనోహర్ మందడి, గిరిధర్ టాటిపిగారి, శ్రీదేవి మాగంటి, రాజా రామ్ ముమ్మడవరపు, వనిత ఆలపాటి, కీర్తి సురం, మోహన్ కాట్రగడ్డ, దుర్గా చింతల, స్వర్ణ కంభంపాటి, అశ్విన్ తిరునాహరి, సుధాకర్ వట్టి, రాంబాబు బావిరిశెట్టి, అబ్దుల్ షేక్, శ్రీధర్ రెడ్డి, సంజయ్ యడ్లపల్లి, వాసు కుడుపూడి, ప్రసాద్ కేటిరెడ్డి, భాస్కర్ దాచేపల్లి, వెంకట్ నాగం, మరియు TAGS కార్యకర్తలు : వాణి  నాగం, అన్నపూర్ణ, ప్రశాంత్, ఉదయ్, హరినాథ్ రెడ్డి, రాజేష్, రమణి, విశ్వా, ధీరజ్, వెంకట్ ఆలపాటి  తదితరులు పాల్గోన్నారు. ఈ సందర్భం గా TAGS కార్యనిర్వాహక సభ్యులు  వికలాంగుల సహాయార్ధం  తిరుపతి లో ఉన్న అభయ క్షేత్రం అనే సంస్థ కు (http://www.abhayakshethram.org/), అలాగే అనాధ  బాలబాలికలకు సహాయార్ధం విజేష్ణ ఫౌండేషన్ (http://vegesnafoundation.org/ )కు  TAGS ప్రత్యేకం గా విరాళాలు అందజేస్తుంది  అని, ఈ సంస్థలకు  సహాయార్ధం విరాళం ఇవ్వదలచిన వారు మరింత సమాచారం కు [email protected] కు ఈమెయిలు లో సంప్రదించాలని TAGS కార్యనిర్వాహక సభ్యులు కోరారు. TAGS చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకోవాలనుకునేవారు http://www.sactelugu.org లేదా https://www.facebook.com/SacTelugu ను సందర్శించాలని లేదా [email protected] కు ఈమెయిలు లో సంప్రదించాలని TAGS కార్యనిర్వాహక సభ్యులు కోరారు.