తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ శాక్రమెంటో (TAGS) ఆధ్వర్యంలో ఆటల పోటీలు

1511

తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ శాక్రమెంటో (TAGS) ఆధ్వర్యంలో ఫోల్సోం కరాటే అకాడమి క్రీడా ప్రాంగణంలో ఆదివారం జనవరి 4, 2015 న ఆటల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. అమెరికా లో కాలిఫోర్నియా రాష్ట్రం శాక్రమెంటో శివారు నగరాలకు చెందిన తెలుగు కుటుంబాలకు చెందిన పిల్లలు, పెద్దలు పెద్దఎత్తున పలు ఆటల పోటీలలో పాల్గొన్నారు. ఆటలో గెలిచి తీరాలన్న లక్ష్యమే వారిని విజేతలుగా నిలిపింది. తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ శాక్రమెంటో (TAGS) ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో 5 ఏండ్ల పిల్లల నుండి 70 ఏండ్ల సీనియర్ సిటిజన్స్ సైతం క్రీడా పోటీల్లో సత్తా చాటారు. ఈ పోటీలను అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకట్ నాగం  ప్రారంభించారు. శ్రీదేవి మాగంటి, మనోహర్ మందడి, మోహన్ కాట్రగడ్డ, దుర్గ చింతల, రాజారాం ముమ్మడవరపు, మల్లిక్ సజ్జనగాండ్ల పర్యవేక్షణలో చదరంగం, తెలుగు ప్రశ్నావళి, తెలుగు కధ చెప్పడం, క్యారమ్స్, గాలిపటాల తయారీ, చిత్ర లేఖనం, మరియు ముగ్గుల  పోటీలను పోటీలను నిర్వహించారు.

 

కాలిఫోర్నియా శాక్రమెంటో లో TAGS ఆటల పోటీలు విజయవంతం కావడానికి అహర్నిశలు కృషి చేసిన వారిలో టీఏజిఎస్ చైర్మన్ వాసు కుడుపూడి, అధ్యక్షులు వెంకట్ నాగం, కార్యవర్గ సభ్యులు మనోహర్ మందడి, గిరిధర్ టాటిపిగారి, శ్రీదేవి మాగంటి, రాజా రామ్ ముమ్మడవరపు, వనిత ఆలపాటి, మోహన్ కాట్రగడ్డ, అబ్దుల్ షైక్, దుర్గా సాయి చింతల, స్వర్ణ కంభంపాటి,అశ్విన్ తిరునాహరి, గిరి టాటిపిగారి, సుధాకర్ వట్టి, రాంబాబు బావిరిశెట్టి, మల్లిక్ సజ్జనగాండ్ల, భాస్కర్ దాచేపల్లి, తదితరులు, మరియు TAGS కార్యకర్తలు ఉన్నారు. చదరంగం పోటీల నిర్వహణకు విశేష సహకారం అందించిన చదరంగం గురు “బ్రహ్మ మొహంతి” కు, తెలుగు కధ చెప్పడం పోటీ  ని ప్రోత్సహించిన వంశీ మాగంటి కు  TAGS కార్యవర్గ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విజేతల వివరాలను అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకట్ నాగం  ప్రకటించారు. విజేతలకు జనవరి 17 న జరుగబొనున్న TAGS 11 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి సంబరాల సందర్భంగా బహుమతులు అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. TAGS సంక్రాంతి సంబరాల  కార్యక్రమాలకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకోవాలనుకునేవారు http://www.sactelugu.org లేదా https://www.facebook.com/SacTelugu ను సందర్శించాలని లేదా [email protected] కు ఈమెయిలు లో సంప్రదించాలని TAGS కార్యనిర్వాహక సభ్యులు కోరారు.

TAGS IndoorSports 2TAGS IndoorSports 3TAGS IndoorSports