తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ శాక్రమెంటో (TAGS) ఆధ్వర్యంలో శాక్రమెంటో తెలుగింటి వాకిట్లో సంక్రాంతి సంబరాలు

2022

కాలిఫోర్నియా రాష్ట్రం లో ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం 11 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి సంబరాల సందర్భం గా సిలికానాంధ్ర  వారి సహకారం తో రూపొందించిన పూర్తి నిడివి  జానపద రూపకం “మన పల్లె, మన సంక్రాంతి” ఆహుతులను విశేషం గా  ఆకట్టుకొన్నది. హరిదాసులు, గంగిరెద్దులు, రంగవల్లులు, జానపద కళాకారులు చేసిన సందడితో సంక్రాంతి వేడుకల ప్రాంగణం లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. స్థానిక ఫోల్సోం నగరం లో ఉన్న  హారిస్ ధియేటర్ లో శనివారం జనవరి 17 వ తేది 2015 మధ్యాన్నం 1:30 గంటలకు మొదలైన సంక్రాంతి సంబరాలు రాత్రి 11 గం వరకు కొనసాగాయి.

 

శాక్రమెంటో తెలుగు సంఘం సంక్రాంతి సంబరాల లో ప్రదర్శించిన ముఖ్యాంశాలు:

  1. శాక్రమెంటో లో మొట్ట మొదటిసారిగా పూర్తి నిడివి జానపద రూపకం “మన పల్లె ….. మన సంక్రాంతి…..“.
  2. జానపద రూపకం లో “ప్రత్యక్ష గానం, మరియు డప్పు తో” అలరించిన డా.లింగా శ్రీనివాస్.
  3. జానపద గీతాలతో ఆకట్టుకొన్న  నిరుపమ చేబియం, వంశీ నాదెళ్ళ, నారాయణన్ రాజు.
  4. జానపద నృత్య రూపకర్త స్నేహ వేదుల రూపొందించిన ఆట పాటలతో సందడి చేసిన 50 మందికి పైగా స్థానిక నృత్యకారులు.
  5. డోలక్ తో ఉర్రూతలూగించిన “బాలాజీ మహదేవన్”.
  6. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్న 250 మందికి పైగా స్థానిక కళాకారులు

 

 TAGS Sankranti 2015 _7 TAGS Sankranti 2015 _8 TAGS Sankranti 2015 _9
TAGS Sankranti 2015 _1 TAGS Sankranti 2015 _2 TAGS Sankranti 2015 _3 TAGS Sankranti 2015 _4 TAGS Sankranti 2015 _5 TAGS Sankranti 2015 _6

సంక్రాంతి వేడుకల సందర్భం గా TAGS  అధర్వంలో జరిగిన సాంస్కృతిక  కార్యక్రమాలు, పూర్తి  నిడివి జానపద రూపకం, వేదిక పై ఉన్న 250 మందికి పైగా స్థానిక కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు,స్థానిక పీకాక్ రెస్టారెంట్ వారు రూపొందించిన నొరూరుంచే పసందైన తెలుగు వంటకాలు, మరి ఇంకెన్నో విశేషాలతో  ఆహుతులను అలరించాయి. కదలి రండి, కలసి రండి, సంక్రాంతి సంబరాన్ని ఉమ్మడిగా జరుపుకొందాము అని TAGS  ఇచ్చిన పిలుపుకు స్పందించిన స్థానిక తెలుగు కుటుంబాలు 800 మందికి పైగా వేదిక కు తరలి వచ్చారు. ఈ సందర్భం గా ముఖ్య అతిధి, స్థానిక తెలుగు కుటుంబానికి చెందిన నరేంద్ర ప్రత్తిపాటి ని TAGS  అధ్యక్షుడు వెంకట్ నాగం సభకు పరిచయం చేసారు. నరేంద్ర ప్రత్తిపాటి గారు సట్టర్ హెల్త్, మరియు డ్రిక్సెల్ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాన సంస్థలకు బోర్డు మెంబెర్ గా ఉండడం తెలుగు వారికి గర్వకారణం అని పేర్కొన్నారు. ఈ సందర్భం గా నరేంద్ర ప్రత్తిపాటి  గారు ఆహుతులకు సంక్రాంతి సందేశాన్ని అందించి, చెస్ కప్ గెలుచుకున్న స్థానిక తెలుగు పిల్లలకు ట్రోఫీ లను అందజేశారు. ప్రియమైన అతిధి గా విచ్చేసిన స్థానిక ఫోల్సోం నగర మేయర్ “ఆండీ మొరిన్” స్థానిక తెలుగు కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలకు అచ్చెరువొందారు. ఫోల్సోం సిటీ హాల్ సమావేశం లో ఈ  సంక్రాంతి వేడుకను ప్రత్యేకంగా ప్రస్తావిస్తానని ఈ సందర్భం గా చెప్పారు. మరో ప్రియమైన అతిధి గా విచ్చేసిన సిలికానాంధ్ర  చైర్మన్ ఆనంద్ కూచిభొట్ల ను TAGS  చైర్మన్ వాసు కుడుపూడి సభికులకు పరిచయం చేసారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ సిలికానాంధ్ర  చైర్మన్ ఆనంద్ కూచిభొట్ల గారు  2004 లో మొట్టమొదటి సారిగా TAGS శాక్రమెంటో లో సంక్రాంతి సంబరాలను జరిపిందని, ఇప్పుడు వరుసగా 11వ సారి సంక్రాంతి సంబరాలను జరుపుకోవడం ఆనందంగా ఉందని, మన సంస్కృతి, సంప్రదాయాన్ని పిల్లలకు అందించడానికి ఇటువంటి వేడుకలు అవసరం అని నొక్కి చెప్పారు.

 

ఈ సందర్భం గా TAGS రూపొందించిన సమాచార పత్రిక ను స్థానిక తెలుగు ప్రముఖులు శ్రీ శివాజీ వల్లూరుపల్లి గారు ఆవిష్కరించారు. TAGS సౌజన్యం తో జరుగుతున్న సిలికానాంధ్ర మనబడి కి రెండు ఏండ్లగా  ఉపాధ్యాయులుగా ఉండి శాక్రమెంటో లో  తెలుగు భాషా వ్యాప్తి కి కృషి చేస్తున్న శ్రీ ప్రసాద్ పన్నాల, శ్రీమతి విజయలక్ష్మి పన్నాల గార్లను TAGS కార్యవర్గ సభ్యులు ఘనం గా  సన్మానించారు. ఈసందర్భం గా ప్రతిభావంతులైన పిల్లలను పోత్సహించే గత సంప్రదాయాన్ని పాటిస్తూ, టాగ్స్ కార్యవర్గ సభ్యులు స్థానిక ప్రతిభావంతులైన పిల్లలు:  వినీత్ సోమంచి, ఆరతి బొబ్బాల, శివాని బొబ్బాల, అర్నావ్ మామిడి, మరియు  వంశీ గంగారం లకు వేదికపై జ్ఞాపికలు అందజేశారు.

 

మనోహర్ మందాడి వందన సమర్పణ గావించారు. జగిత్యాల నుండి TAGS సంక్రాంతి సంబరాలకు ప్రత్యేకంగా విచ్చేసిన డా. లింగా శ్రీనివాస్ డప్పు తో, జానపద పాటలతో, స్థానిక కళాకారులతో చేసిన నృత్యాలతో వేదిక దద్దరిల్లింది. ఈ సందర్భం గా TAGS తరపున అధ్యక్షులు వెంకట్ నాగం డా. లింగా శ్రీనివాస్ కు “జానపద కళా ప్రపూర్ణ” బిరుదును ప్రదానం చేసారు. డా. లింగా శ్రీనివాస్ ప్రదర్శించిన కోడి బాయె లచ్చమ పాటతో కార్యక్రమం విజయవంతం గా ముగిసింది. ఇంకా కాసేపు ఉంటే బాగుండెను అనే భావనతో ఆహుతులు వెనుదిరిగారు. కాలిఫోర్నియా శాక్రమెంటో లో “మాతృ దేవో భవ, పితృ దేవో భవ” విజయవంతం కావడానికి అహర్నిశలు కృషి చేసిన వారిలో టీఏజిఎస్ కార్యవర్గ సభ్యులు మనోహర్  మందాడి, గిరిధర్ టాటిపిగారి, శ్రీదేవి మాగంటి, రాజా రామ్ ముమ్మడవరపు, వనిత ఆలపాటి, మోహన్ కాట్రగడ్డ, అబ్దుల్ షైక్, దుర్గా చింతల, స్వర్ణ కంభంపాటి,అశ్విన్ తిరునాహరి, గిరి టాటిపిగారి, సుధాకర్ వట్టి, రాంబాబు బావిరిశెట్టి, మల్లిక్ సజ్జనగాండ్ల, వాసు కుడుపూడి, భాస్కర్ దాచేపల్లి, వెంకట్ నాగం, TAGS కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు. ఈ సందర్భం గా TAGS కార్యనిర్వాహక సభ్యులు విశాఖ లో హుదుద్ తుపాను బారిన పడిన CBM పాఠశాల విద్యార్ధుల సహాయార్ధం, అలాగే వికలాంగుల సహాయార్ధం  తిరుపతి లో ఉన్న అభయ క్షేత్రం అనే సంస్థ కు (http://www.abhayakshethram.org/), అలాగే అనాధ భారతీయ బాలబాలికలకు సహాయార్ధం హోప్ ఎబయ్డ్స్ http://www.hopeabides.org/ కు  TAGS ప్రత్యేకం గా విరాళాలు అందజేస్తుంది  అని, ఈ సంస్థలకు  సహాయార్ధం విరాళం ఇవ్వదలచిన వారు మరింత సమాచారం కు [email protected] కు ఈమెయిలు లో సంప్రదించాలని TAGS కార్యనిర్వాహక సభ్యులు కోరారు. TAGS చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకోవాలనుకునేవారు http://www.sactelugu.org లేదా https://www.facebook.com/SacTelugu ను సందర్శించాలని లేదా [email protected] కు ఈమెయిలు లో సంప్రదించాలని TAGS కార్యనిర్వాహక సభ్యులు కోరారు.