TAGB సంక్రాంతి సంబరాలు 2014

1445
TAGB సంక్రాంతి సంబరాలు 2014 - Performance 2
TAGB సంక్రాంతి సంబరాలు 2014 - Performance 2

2014 సంవత్సరానికి శుభరంభం చేస్తు TAGB సంక్రాంతి సంబరాలు లిటిల్టన్, MA లొ జనవరి 18 న అంబరాన్ని దాటాయి.ఆద్యంతం తనదైన శైలిలో జనరంజకంగా సాగిన ఈ వేడుక కి మంచు తుఫానులో కూడా 1000 పైగ ఆహుతులు రావడమే కార్యక్రమ ఆదరణకి కొలమానం.

ఆవరణ అంతా సంక్రాంతి ని తలపిస్తూ ముస్తబైయింది.అందమైన ముగ్గులు ఆహుతులను వెచ్చగా అహ్వానించాయి.పండగనాటి పల్లెవాతావరణాన్ని తలపిస్తూ గుడిసె ముందు నిలిపిన గంగిరెద్దు, హరిదాసు, గొబ్బెమ్మలు మరియు బొమ్మల కొలువు TAGB లోని సౄజనాత్మకతకి అద్దం పట్టయి. ఫక్తు ఆడంబరాలు సరదాలతో కలిసి తమ వస్త్రాలంకరణని పదిమందితో పంచుకుంటూ పలు పలహార మరియు ఇతర విక్రయశాలలో కలివిడిగా తిరుగుతున్న జనం పండుగ వాతావరణాన్ని బోస్టన్ ముంగిట నిలిపారు.

TAGB సంక్రాంతి సంబరాలు 2014
TAGB సంక్రాంతి సంబరాలు 2014

TAGB చరిత్రలోనే మొట్టమొదటిసారి వైఙానిక ప్రదర్శన నిర్వహించారు. Middle School మరియు High School పిల్లలు చక్కటి ప్రయోగాలు చేసి వివరించడమే కాక, వచిన పిల్లలతో పెద్దలతో చేయించారు.జీవశస్త్రం నుండి రసాయన శాస్త్రం,optics-robotics తోపాటు పర్యావరణ శస్త్రం తో సహా ప్రయోగాలు ప్రదర్శితమయ్యయి.

ముగ్గుల పోటీలలో పలు మహిళలు పిల్లలు పాలుపంచుకొని కర్యక్రమానికి తమ వంతు అందాల రంగులు తిద్దారు.

 

TAGB సంక్రాంతి సంబరాలు 2014 - team
TAGB సంక్రాంతి సంబరాలు 2014 – team

ప్రతీ ఏటా TAGB ఎంతో మంది పిల్లలకి పెద్దలకి తమ కళని ప్రదర్సించడనికి వేదిక అవుతుంది. ఈ యేడాది కూడా దేశభక్తి- దైవభక్తి -సాంప్రదాయక నృత్యాలు-ఆధునిక మరియు సినిమా గీతాలు- నృత్యాలతో ఆహ్లాదకరంగా సాగింది. పిల్లలకి దౄష్టి తగలకుండ పెద్దలు ప్రేమతో ఆశిస్సులతో భొగి పళ్ళతో దీవించడంతో కార్యక్రమం మొదలైయ్యింది.సాంస్కౄతిక సంఘం అధ్యక్షులు శ్రీమతి మణిమాల చలుపాది ఆహుతులని ఆహ్వానిస్తూ కఠినమైన, అననుకూలమైన వాతావరణంలో వచ్చిన అందరికి కృతజ్ఞత తెలిపారు.

పరిసర ప్రాంతాలలోని విభిన్న dance school విద్యర్ధినీ-విద్యార్ధులు సంప్రదాయక నృత్యాలతో శిల్పకళాక్రుతులను తలపించే భంగిమలతో ఆహుతులనూ అలరించారు. వీటికి పోటీగా సినిమా డాన్సులు కూడా అందరిని మెప్పించాయి. శ్రీ .మధు చారి మరియు శ్రీమతి. వల్లీ భమిడిపాటి 60- 70 దశాంకంలో ని పాటలతో ఆ సాయంత్రాన్ని ఆహ్లాదభరితం చేసారు.చిరంజీవులు నవ్యా పెద్దిరెడ్డి మరియు మేఘనా తల్లం సాంప్రదాయక సంక్రాంతి పాటలతో మన  సంస్కృతి-సంప్రదాయన్ని మనం అమెరికాలో కాపాడుకుంటున్నా తీరుకి అద్దంలో నిలిపారు.

 

TAGB సంక్రాంతి సంబరాలు 2014 - Performance 1
TAGB సంక్రాంతి సంబరాలు 2014 – Performance 1

ఈ కార్యక్రమానికి సభా సంచాలకులు గా శ్రీమతి దీప్తి గోర మరియు శ్రీమతి మధవి కమ్మ వ్యవహరించారు. తమదైన శైలిలో సాహిత్య పరమైన విషయాలు-చలోక్తులు-ప్రశ్నావళి జోడించారు.

ప్రముఖ గయకులు శ్రీ సందీప్ కూరపాటీ (ETV Padutha Theeyaga fame), గాయకురాలు హరిణి దర్భ(Maa TV Paadalani Undi fame)పాతా- కొత్త , యుగళ గీతాలు ఒక్కరు పాడేవి, హౄద్యమైనవి-వూపెక్కించేవి అన్ని పాడి ఆహుతునలు అలరించారు. చిన్నారులు మౌనిక,హరిక తల్లురి, భార్గవ్, భరద్వజ్ పరకాల, భావన చలుపాది మరియు సౌమ్యా వరద చిందులు సందీప్ మరియు హరిణి పాటలకి ఉత్సాహాన్ని జత చేసాయి. ఈ పాటా-ఆటా లకి కరతాళ్ళ ధ్వనులతో అంతా ప్రొత్సాహాన్నిచారు.

2013 ఉగాది నిండి 2014 సంక్రాంతి వరకు కార్యవర్గాన్ని నడిపించిన అధ్యక్షులు శ్రీ రమేష్ తల్లం సగర్వంగా తమ కార్యవర్గాన్ని పరిచయం చేసారు.ఈ సంవత్సరం కొత్తగా ప్రవేశ పెట్టిన నవనూత్నమైన “వెబ్ సైట్”,ఆకర్షణీయమైన  సమయ సూచిక (క్యాలెండర్)సభ్యులకు అందచేయడం. ఈ సంవత్సరమే కొత్త జనసంఘాలలో (కమ్యూనిటీలు)పర్యటించి TAGB సభ్యత్వాలని గణనీయంగా పెంచారు, మొట్టమొదటిసారి న్యూహంప్షైర్లో దీపావళి కార్యక్రమాన్ని నిర్వహించారు, కొత్త క్రీడా కార్యక్రమాలు, విద్యా వైఙానిక కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు విజయవంతంగా జరగడానికి అన్నిరకాలుగా సహకారం అందించిన  కార్యనిర్వాహక సభ్యులకు, ఇతర అన్ని కమిటీల సభ్యులకు, పరిపాలకపీఠ (బోర్డ్ ఆఫ్ఫ్ ట్రస్టీస్) సభ్యులకు హౄదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు.

ఎన్నికల సంఘం కొత్తగా అన్నికైన కార్యనిర్వాహక సంఘాన్ని, పరిపాలకపీఠ పరిచయం చేసారు.శ్రీ రాం గుబ్బల అధక్షులు కాగా, శ్రీ శంకర్ మాగాపు  ప్రెసిడెంట్ ఎలెక్ట్.

 

TAGB సంక్రాంతి సంబరాలు 2014 - Performance 2
TAGB సంక్రాంతి సంబరాలు 2014 – Performance 2

ప్రస్తుతకమిటీ సభ్యుల కుటుంబాలు ప్రదర్శించిన ‘ధీం తనక” “డాన్స్ ప్రొగ్రాం” 60 దశాంకం నుండి నేటి వరకు ఉర్రుతలూగించిన పాటల కూర్పు.ఈ కార్యక్రమం కూడా ఆహుతులని విశేషంగా ఆకర్షించింది.

ఆరు గంటలు ఏకబిగిన సాగిన ఈ కార్యక్రమం శ్రీ శంకర్ మాగాపు  ప్రెసిడెంట్ ఎలెక్ట్, వందనసమర్పణతో ముగిసింది. అందరిని అలరించిన చిన్నరులకి-పెద్దలకి, వాటిని నేర్పిన గురువులకి, గ్రూప్ లీడర్లకి,స్పాన్సర్ లకి,స్వచ్ఛంద సేవకులకి కృతజ్ఞత తెలియజేసారు.

TAGB కమిటీకి చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు అశేషంగా ప్రశంసలు మరియు ఇటువంటి కార్యక్రమాల వల్ల మన సంస్కృతి-సంప్రదాయన్ని కాపాడుకోగల్గుతున్నామని కృతజ్ఞతలు తెలియజేసారు చాల మంది సభ్య్లులు.

పలహారం- విందు మినర్వా రెస్టారెంట్ వారు ఏర్పాటు చేసారు.

అద్భుతమైన కార్యక్రమంతో తమ విది నిర్వహణా కాలాన్ని ముగించినా శ్రీ రమేష్ తల్లం మరియు శ్రీమతి మణిమాల చలుపాది లకు ప్రత్యెక కృతజ్ఞతాభినందనలు.