కెనడాలో తాకా ఆద్వర్యంలో ఘనంగాజయ నామ సంవత్సర ఉగాది వేడుకలు

1451

తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (తాకా) వారి ఆద్వర్యంలో ఎప్రిల్ 5 వ తేది శనివారం  బ్రాంప్టన్ నగరంలోని పీల్ సెకండరి స్కూల్లోని ఆడిటోరియంలో సుమారు 800 పైగా  తెలుగు వారు పాల్గొనగా అత్యంత వైభవంగా జరిగాయి.  ఈ వేడుక అచ్చ తెలుగు సాంప్రదాయ పద్దతులతో దాదాపు 6 గంటలపాటు వివిద సాంస్క్రుతిక కార్యక్రమాలతొ సభికులను అలరించాయి. పండిట్ మంజునాత్ గారు పంచాంగ శ్రవణం చేయగా శ్రీమతి దుగ్గిన లక్ష్మి గారు మరియు శ్రీమతి ధనలక్ష్మి మునుకుంట్ల గారు అందరికి ఉగాది పచ్చడి అందచేసారు.

Ugadi2014TACA1

 

 

తాకా జనరల్ సెక్రెటరి రమెష్ మునుకుంట్ల గారు ఆహ్వానించగా శ్రీమతి రాధిక రావుల, శ్రీమతి ప్రశాంతి కాట్రగడ్డ, శ్రీమతి ఆమ్రుత దుద్దుల, శ్రీమతి పావని స్తొత్రభాశ్యం మరియు శ్రీమతి సంధ్య రాపూరి గార్లు జ్యోతి ప్రజ్వలన చేయగా కార్యక్రమాలు ప్రారంబమయ్యాయి. శాంస్క్రుతిక కార్యమలన్నింతిని శ్రీ అరున్ కుమార్ లయం గారు పర్యవెక్షనలో నిర్వహించబడినాయి. శ్రీకర్ కొవిరినేని  మరియు అశ్రిత గారపాటి వ్యాక్యాతలుగా వ్యవహరించారు

Ugadi2014TACA3

Ugadi2014TACA4

తాకా అధ్యక్షులు మునాఫ్ ఆబ్దుల్ గారు, మనబడి ఉపాధ్యక్షులు శరత్ వేట గారు సబికులకు సందేశం అందించారు.  ఈ కార్యక్రమంలో తాకా ఉపధ్యక్షులు శ్రీనాధ్ కుందూరి,జనరల్ సెక్రెటరి శ్రీ రమెష్ మునుకుంట్ల, కొశాధికారి శ్రీ లొకెష్ చిల్లకూరు, ట్రుస్టు చైర్మన్ శ్రీ రామచంద్రరావు దుగ్గిన, ఫౌండేషన్ కమీటీ చైర్మన్ శ్రీ అరున్ కుమార్ లయం, డైరక్టర్లు శ్రీమతి శ్రీవాణి మూసాపేట, శ్రీ వెంకట్ నందిపాటి, శ్రీ భానుప్రకాష్ పొతకమూరి మరియు ట్రస్టీలు శ్రీమతి వైశాలి, శ్రీ ప్రసాద్ ఓడురి గార్లు పాల్గొన్నారు.Ugadi2014TACA2