తెలుగు అలయన్స్అఫ్ కెనడా (తాకా) రంగ రంగ వైభోగంగా సంక్రాంతి సంబరాలు బ్రాంప్టన్, కెనడా లో జనవరి24, 2015 న జరుపు కొన్నారు. ఈ సంబరాలలో దాదాపు 600 మంది తెలుగు వారు చలి వాతావరణము లో కూడా వచ్చి విజయవంతం చేసారు. శ్రీమతి వైశాలి శ్రీధర్, శ్రీమతి వాణి మూసాపేట, శ్రీమతి లక్ష్మి దుగ్గిన, చైతన్య జ్యోతి ప్రజ్వలన చేయగా సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. తాకా వారు కార్యక్రమానికి వచ్చిన చిన్నపిల్లలకు భోగి పళ్ళతో మంగళ వాయిద్యాల మద్య ఆశీర్వదించారు. దుగ్గిన రామచంద్రరావు గారి ఆధ్వర్యం లో వివిధ రకమైన బొమ్మలతో ఆకర్షిణీయంగా బొమ్మల కొలువును ఏర్పరిచారు. ఈ కార్యక్రమం లో తెలుగు ఆడపడచులు, మరియు చిన్నారులు రంగు రంగు ముగ్గులు వేసి, పోటీలో పాల్గొని సంబరపరిచారు. ఈ సంబరాలలో ముఖ్య అతిధి గా కెనడా లో వున్న ఇండియన్ కన్సుల్ జనరల్ శ్రీఅఖిలేష్ మిశ్రా ప్రత్యేకంగా టొరోంటొ ఘడియలుతో చేపించబడిన తెలుగు క్యాలెండర్ని ఆవిష్కరించారు. ఈ సంబరాలలో దాదాపు 25 సాంస్కృతిక కార్యక్రమాలు తోటి తెలుగు వారితో నాటికలు, సినిమా డాన్సులు, పాటలు ఆరు గంటల పాటు ప్రదర్శించ బడ్డాయి. అచ్చ తెలుగు వంటకాలు అరిసెలతో తాకా వారు భోజనాలని ఏర్పరిచారు. తాకా వారు బొమ్మల కొలువు ని వివిధ రకమైన బొమ్మల తో ప్రత్యేక ఆకర్షణ గా ఏర్పాటు చేశారు.
తాకా సాంస్కృతిక కార్యదర్శి శ్రీ అరుణ్ కుమార్ లయం ఆధ్వర్యం లో సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఉత్సాహమంతమైన వాతావరణం లో జరప పడ్డాయి. అద్యక్షులు శ్రీ మునాఫ్ అబ్దుల్ గారు సంక్రాంతి మరియు తెలుగు సంస్కృతి గురించి సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. తాకా వ్యవస్థాపక సభ్యులు శ్రీ చారి సామంతపూడి మరియు గంగాధర సుఖవాసి ముఖ్య అతిధి మిశ్రా గారిని తోడ్కొని రాగా, కార్యవర్గ సభ్యుల అందరి సమక్షం లో 2015 తెలుగు క్యాలెండర్ ని ఆవిష్కరింప చేసి అది తన అదృష్టంగ చెప్పుకున్నారు. శ్రీ మిశ్రా గారు తెలుగు వారి గొప్పతనాన్ని మరియు తాకా వారి సేవ కార్యక్రమాలిని అబినందించారు. శ్రీమతి గీతా దేసు, నలిని దేవినేని, విద్య రుద్రరాజు , శ్రీ అరుణ్ కుమార్ లయం లు కార్యక్రమం అంతటికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
ఎంతో అద్భుతంగా చేపట్టి మరియు విజయవంతం చేసిన ఫుడ్ కమిటీ శ్రీ వెంకట్ నందిపాటి, శ్రీనాథ్ కుందూరు ను, డెకరేషన్ కమిటీ భాను పోతకామూరిని, సాంస్కృతిక కమిటి అరుణకుమార్ ను, క్యాలెండర్ కమిటీ శ్రీ గంగాధర్ సుఖవాసి మరియు రమష్ మునుకుంట్ల ను, రిజిస్ట్రేషన్ కమిటీ శ్రీ లోకేష్ చిల్లకూరుల ను తాకా అద్యక్షులుఅభినందించారు. తాకా వారు ముగ్గులు పోటీలు మరియు బొమ్మలకొలువు లో గెలుపొందినవారికి బహుమతులు అంధ చేసారు. ఈ క్రింది తాకా కమిటీలు ఈ సంక్రాంతి సంబరాలను ఎంతో శ్రమకోర్చి కెనడా లో ని తెలుగు వారి కోసం ఏర్పాటు చేసారు. చివరిగా అందరికి ధన్యవాదాలు చెపుతూ జనగణమన జాతీయ గీతంతో కార్యక్రమాలు ముగించారు.
ఎగ్జిక్యూటివ్ కమిటీ :
ప్రెసిడెంట్: శ్రీమునాఫ్ అబ్దుల్
వైస్ ప్రెసిడెంట్: శ్రీ శ్రీనాథ్ కుందూరు
జనరల్ సెక్రటరీ: శ్రీ రమేష్ మునుకుంట్ల
కల్చరల్ సెక్రటరీ: శ్రీ అరుణ్ కుమార్ లయం
ట్రజరర్: శ్రీ లోకేష్ చిల్లకూరు
డైరెక్టర్స్: 1 శ్రీ నందిపాటి వెంకటేశ్వర్లు
2 శ్రీమతి శ్రీవాణి మూసాపేట్
- శ్రీ భాను పోతకమూరి
బోర్డు అఫ్ ట్రస్టీస్:
శ్రీ రామచంద్రరావు దుగ్గిన (చైర్మన్)
శ్రీ ప్రసాద్ ఓడూరి
శ్రీమతి వైశాలి శ్రీధర్
వ్యవస్థాపక కమిటీ :
శ్రీ చారి సామంతపూడి
శ్రీ గంగాధర్ సుఖవాసి
శ్రీ రాకేశ్ గరికపాటి
శ్రీ రవి వారణాసి