కెనడాలో అత్యంత వైభవంగా తాకా వారి 2013 దీపావళి ఉత్సవాలు

1342
TACA 2013 deepavali dance
TACA 2013 deepavali dance


కెనడా తెలుగు స౦ఘము TACA ఆద్వర్య౦లో  టోరో౦టో  నగర౦లోని తెలుగు ప్రజలు అత్య౦త వైభవ౦గా 9 నవంబరు 2013 శనివారం రోజున తిసిల్టౌన్ కాలేజియేట్ ఇన్స్టిట్యుట్ లో దీపావళి ఉత్సవాలు  మరియు తాకా 3వ వసంత వేడుకలు జరుపుకున్నారు. ఈ స౦బరాలలో దాదాపు 500 మ౦ది తెలుగు వారు పాల్గొన్నారు.

TACA 2013 deepavali dance
TACA 2013 deepavali dance

 

కెనడా తెలుగు స౦ఘము TACA ఆద్వర్య౦లో పిల్లలకు ఫ్యాన్సి డ్రెస్స్ పోటీలు జరిగాయి. ఈ స౦దర్బ౦లో ౩౦ కి  పైగా చక్కటి సా౦స్క్రుతిక కార్యక్రమాలు తాకా  ఆద్వర్య౦లో జరుగగా ఇ౦దులో కెనడా లోకల్ తెలుగు కళాకారులు పాల్గొన్నారు. తాకా వారు చక్కటి రుచికరమైన తెలుగు భోజన౦ ఏర్పాటు చేశారు.

డా ॥ యార్లగడ్డ  లక్ష్మీప్రసాద్ గారు కెనడా లోని భారత ప్రభుత్వ సాంస్కృతిక కేంద్రము డైరెక్టర్ ముఖ్య అతిధిగా విచ్చేసి  సభికులను ఉద్దేసి౦చి ప్రసంగించారు. అధ్యక్షులు  గంగాధర్ సుఖవాసి, బోర్డు ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ హనుమ౦తా చారి సామంతపూడి గారు, ఉపాధ్యక్షులు అబ్దుల్ మునాఫ్,  సాంస్క్రుతిక సెక్రెటరి అరుణ్ కుమార్ లయ౦, కోశాధికారి లోకేశ్ చిల్లకూరు గారు అన్ని కార్యక్రమాలను  సమన్వయం చేశారు. అధ్యక్షులు గంగాధర్ సుఖవాసి గారు మరియు బోర్డు ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ హనుమ౦తా చారి సామంతపూడి గారు దీపావళి  ప౦డుగ ప్రాశస్త్యాన్ని, తాకా చేస్తున్నవివిధ కార్యక్రమాలను వివరి౦చారు, తెలుగు వార౦దరిని తాకా   సభ్యత్వాన్నితీసుకోవలసినదిగా  కోరారు. సభ్యులకు కలుగు లాభాలను వివరి౦చారు, తెలుగు స౦స్క్రుతి, సా౦ప్రదాయలను కొనసాగిస్తు కెనడా  లోని ము౦దుతరాల వారు మరచిపోకు౦డా అ౦ది౦చుటకు సహకరి౦చవలసినదిగా కోరారు.

Yarlagadda Lakshmi Prasad 2013 TACA diwali celebrations
Yarlagadda Lakshmi Prasad 2013 TACA diwali celebrations

తాకా ఆద్వర్య౦లో వెలువడిని తాకా పత్రిక మొదటి సంచికను ముఖ్య అతిధి  డా ॥ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఆవిష్కరించారు.  ఈ సందర్భముగా డా ॥ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి తాకా వారు పౌర సన్మానం చేశారు.

2013 TACA Deepavali Celebrations
2013 TACA Deepavali Celebrations

ఈ కార్యక్రమములో 2013-15 కాలానికి నూతనంగా ఎన్నికైన తాకా గవర్నింగ్ బోర్డును అధ్యక్షులు శ్రీ గంగాధర్ సుఖవాసి గారు సభికులకు పరిచయం చేశారు.

2013-15 నూతనగవర్నింగ్బోర్డు

Executive Committee:

అధ్యక్షులు :  అబ్దుల్ మునాఫ్

ఉపాధ్యక్షులు: శ్రీనాధ్ కుందూరి

సెక్రెటరి: రమేష్ మునుకు౦ట్ల

కోశాధికారి: లోకేష్  చిల్లకూరు

డైరక్టరు: వెంకటేశ్వర్ రావు నందిపాటి

డైరక్టరు: భాను ప్రకాష్  పొతకమూరి

డైరక్టరు: శ్రీవాణి మూసాపేట

Foundation Committee:

చైర్మన్: అరుణ్ కుమార్ లయ౦

Board of Trustees:

చైర్మన్: రామచ౦ద్ర రావు దుగ్గిన

ట్రస్టీ:  ప్రసాద్ ఓడూరి

ట్రస్టీ: వైశాలి శ్రీధర్

 

ఈ కార్యక్రమ౦ లో ప్రస్తుత Foundation Committee చైర్మన్: శ్రీనాధ్ కుందూరి, డైరక్టర్లు రవికిరణ్  చవ్వ, కమలాకర్ గుత్తా , శ్రీనివాస్ బాచిన,  ట్రస్టీస్ గంగాధర్ వెన్నమనేని, లక్ష్మీనారయణ సూరపనేని మరియు రమేష్ మునుకు౦ట్ల పాల్గొన్నారు.

2013 TACA Deepavali Celebrations
2013 TACA Deepavali Celebrations
TACA deepavali celebrations 2013 Audience
TACA deepavali celebrations 2013 Audience

ఈ కార్యక్రమములో పాల్గొన్న చిన్నారులందరికి బహుమతి ప్రదాన౦ చేశారు. రమేష్ మునుకు౦ట్ల గారి  వ౦దన సమర్పణతో ఉత్సవాలు ముగిశాయి.