శాక్రమెంటో తెలుగు సంఘం (TAGS) ఆధ్వర్వం లో జియ్యర్‌ స్వామి వారి ఆధ్యాత్మిక ప్రవచన సదస్సు

1337

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జియ్యర్‌ స్వామి వారి మంగళాశాసనాలతో శాక్రమెంటో తెలుగు సంఘం (TAGS) ఆధ్వర్వం లో మంగళవారం జనవరి 10న ప్రారంభం అయిన ఆధ్యాత్మిక ప్రవచన సదస్సుకుకాలిఫోర్నియా రాష్ట్రం లోని శాక్రమెంటో శివారు నగరం ఫోల్సం వేదిక అయ్యింది. ఫోల్సం నగరం లో విస్టా డీలాగో హైస్కూల్ ప్రాంగణం లో అణువణువునా ఉట్టిపడిన ఈ ఆధ్మాత్మికత సదస్సుకు స్థానిక తెలుగు ప్రజలు పెద్ద ఎత్తునహాజరు అయ్యారు. మొదట జియ్యర్‌ స్వామి వారి కి TAGS చైర్మన్ వెంకట్ నాగం పూర్ణకుంభం తో సాంప్రదాయబద్దంగా స్వాగతం చెప్పారు, పిదప జియ్యర్‌ స్వామి వారి ని TAGS అధ్యక్షులు మనోహర్ మందడి పూలమాలతో అలంకృతంగావించారు. అనంతరం రెండు గంటలకు పైగా సాగిన జియ్యర్‌ స్వామి ఆధ్మాత్మిక ప్రసంగంతో ఆహుతులు తడిసి ముద్దయ్యారు. దేహాన్ని దేవాలయంగా భావించి నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలని జియ్యర్‌ స్వామి తన ప్రవచనం లోచెప్పారు. ‘ప్రజ్ఞ ‘ ని స్థాపించి వేలాది మంది పిల్లలందరికీ శ్లోకాలు, భారత, రామాయణం కథలు, వేదాలు నేర్పించడం జరుగుతున్నదని, ఉచ్చారణ లో తప్పులు లేకుండా శ్రద్ధగా నేర్చుకొంటే వాటి ఫలితం పూర్తిగా పొందవచ్చునని,అయితే ఈ విషయం లో ప్రవాసాంధ్రులు పిల్లలకు సహకరించాలని చిన్న జియ్యర్ స్వామి వివరించారు.

 

అతి సామాన్యుడికి సైతం ఆలయ ప్రవేశం కలిగేలా చేసి సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆరాధనా విధానాన్ని క్రమబద్దీకరించి నిత్యం లక్షలాది భక్తులు ఆ కలియుగ ప్రత్యక్షదైవాన్ని దర్శించుకునేలా చేసిన సమతామూర్తి శ్రీరామానుజచార్య ప్రాభవాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలియజేయడంతో పాటుగా ఆయనను భావితరాల వారికి పరిచయం చేయాలనే సత్సంకల్పంతో సుమారు 600 కోట్ల రూపాయలతో శ్రీమద్రామానుజ స్ఫూర్తి కేంద్రం హైదరాబాద్ లోనిశంషాబాద్ లో నిర్మించనున్నట్లు చిన్నజియ్యర్ స్వామి చెప్పారు.

 

సమాజ సంస్కరణాభిలాషతో వందల ఏళ్ళ క్రితమే సమాజంలో కులతత్వ నివా రణకు కృషి చేసి, సమాజానికి ఆధ్యాత్మిక సుగంధం పూసే పలు విశిష్టమైన గ్రంథా లను రచించి, తన బోధలతో.. రచనలతో సమాజాన్ని ఎంతగానోప్రభావితం చేసిన మహనీయుడు శ్రీ భగవద్రామానుజస్వామి వారు. ఆ మహానుభావుడు జన్మించి 2017 నాటికి వెయ్యేళ్ళవుతున్న విశిష్ట సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన ప్రవచనాలను ప్రపంచానికంతా పున:పరిచయం చేయాలనే సదాశయంతో శ్రీ త్రిదండి చిన్న శ్రీమ న్నారాయణ రామానుజ జియ్యర్‌స్వామి వారు తాము చేస్తున్న ప్రయత్నాన్ని సోదాహరణంగా వివరించారు. ఈ బృహత్‌ కృషిలో భాగంగా, హైదరాబాద్‌ సమీపం లోని శంషాబాద్‌ ఆశ్రమంలోసుమారు 45 ఎకరాల విస్తీర్ణంలో 216 అడుగులు ఎత్తున శ్రీ రామానుజస్వామివారి పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్టించడానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయని వారు చెప్పారు. ‘స్టాట్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ’ పేరుతో ఇంత భారీఎత్తున నిర్మించే ఆ’సమతామూర్తి’ విగ్రహం ఏర్పాటుకే కనీసం నూరుకోట్ల రూపాయల దాకా వ్యయమవుతుందని, ఈ మొత్తం ప్రాజెక్టుకు సుమారు వెయ్యి కోట్ల రూపాయల దాకా వ్యయమవుతాయని ఆయన చెప్పారు. మూడు దశల్లో జరిగే ఈ ప్రాజెక్టును 2022నాటికి పూర్తిచేయాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నామని చిన్నజియ్యర్‌ స్వామివారు చెప్పారు. అంతేకాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ శ్రీ రామా నుజులస్వామివారి దివ్యక్షేత్రాలు వుండా లనే ఆకాంక్షతో విజయవాడలోని విజయ కీలాద్రిపర్వతంపై కూడా 108 అడుగుల ఎత్తయిన శ్రీ రామానుజుల స్వామివారి సుధామూర్తి (సిమెంట్‌ విగ్రహం) ఏర్పా టుకు కూడా కృషి జరుగుతున్నదని జియ్యర్‌స్వామి చెప్పారు. కార్యక్రమం పిదప వేణు మెప్పర్ల ఆధ్వర్వం లో భక్తులకుప్రసాదాలు TAGS కార్యకర్తలు అందజేశారు.

 

భావితరాలకు స్ఫూర్తినిస్తూ, ఆధ్యాత్మిక రంగానికి అనితర సాధ్యమైన సేవలందించి అజరామర కీర్తినార్జించిన భగవత్‌ రామా నుజాచార్యులవారు నాటి తరానికే కాదు.. నేటి తరానికీ.. భావితరాలకు కూడా స్ఫూర్తి ప్రదాత.. ఆ మానవతాదీప్తిని.. సమతా మూర్తిని స్మరించుకుంటూ.. శాక్రమెంటో తెలుగు వారందరికీ రామానుజస్వాములవారి దివ్యబోధలను తెలుసుకునే సదవకాశాన్ని అందించిన జియ్యర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కు TAGS కార్యవర్గం ప్రత్యేక కృతజ్ఞతలుతెలియజేసింది. TAGS సెక్రటరీ మోహన్ కాట్రగడ్డ, మరియు ట్రెజరర్ సందీప్ గుడిపెల్లి తదితరులు జియ్యర్‌స్వామి వారికి ఘనంగా వీడ్కోలు చెప్పారు.

sri-chinna-jeyyar-swami-jis-spiritual-pravachana-event-by-tags-1 sri-chinna-jeyyar-swami-jis-spiritual-pravachana-event-by-tags-2 sri-chinna-jeyyar-swami-jis-spiritual-pravachana-event-by-tags-4 sri-chinna-jeyyar-swami-jis-spiritual-pravachana-event-by-tags-6 sri-chinna-jeyyar-swami-jis-spiritual-pravachana-event-by-tags-9 sri-chinna-jeyyar-swami-jis-spiritual-pravachana-event-by-tags-12 sri-chinna-jeyyar-swami-jis-spiritual-pravachana-event-by-tags-13

జియ్యర్‌ స్వామి వారి ఆధ్యాత్మిక ప్రవచన సదస్సు జయప్రదం గా జరగడానికి TAGS కార్యవర్గ సభ్యులు: మనోహర్ మందడి, మోహన్ కాట్రగడ్డ, సందీప్ గుడుపెల్లి, శ్రీదేవి మాగంటి, కీర్తి సురం, సురేంద్రనాథ్ కొప్పారపు, శ్రీరామ్ అకిన,మమతా దాసి, నాగేశ్వరరావు దొండపాటి, నాగేంద్రనాథ్ పగడాల, శ్రీనివాస రావు యనపర్తి, శ్రీధర్ రెడ్డి, వెంకట్ నాగం, అశ్విన్ తిరునాహరి, మల్లిక్ సజ్జనగాండ్ల తదితరులు, మరియు కార్యకర్తలు: వేణు ఆచార్య,శాంత, అనుదీప్ గుడిపెల్లి,రామ కృష్ణ నీలం, సత్యవీర్ సురభి,శ్రీ, రాకేష్ గుర్రాల, ఉష మందడి, వాణి నాగం తదితరులు సహకారం అందించారు.

 

శాక్రమెంటో తెలుగు సంఘం TAGS పిలుపుకు స్పందించి జియ్యర్‌ స్వామి వారి ఆధ్యాత్మిక ప్రవచన సదస్సుకు స్పందించి, తుపాను ను కూడా లెక్కచెయ్యకుండా పెద్ద ఎత్తున వేదిక కు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం ఆసాంతంవిని జయప్రదం చేసిన స్థానిక తెలుగు వారికి, మిత్రులకు, ఫోటోగ్రఫీ సహకారం అందించిన రాకేష్ గుర్రాల “ఆర్ ఆర్ ఫోటోగ్రఫీ” కి TAGS కార్యవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.

 

ఈ సందర్భంగా ఫోల్సోం హై స్కూల్ ధియేటర్ లో శనివారం జనవరి 14 వ తేది 2017 11 గంటలకు శాక్రమెంటో తెలుగు సంఘం ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం, తదుపరి 1:30 గంటలకు సంక్రాంతి సంబరాలు మొదలు అవుతాయని,వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనకు 300 మందికి పైగా స్థానిక కళాకారులు సంసిద్ధులు అవుతున్నారు కాబట్టి కార్యక్రమానికి విచ్చేసి వారిని పోత్సహించి సంక్రాంతి సంబరాలను జయప్రదం చేయవలసినదిగా శాక్రమెంటోతెలుగు వారికి, మిత్రులకు TAGS కార్యవర్గం విజ్ఞప్తి చేసింది. మరుగునపడిన కళల వికాసానికి శాక్రమెంటో తెలుగు సంఘం చేస్తున్న సాంస్కృతిక కృషి కి అందరు పెద్ద ఎత్తున హాజరై సహకరించాలని కార్యవర్గ సభ్యులు ఈ సందర్భం గావిజ్ఞప్తి చేసారు. TAGS సంక్రాంతి సంబరాల కార్యక్రమాలకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసు కోవాలనుకునే వారు http://www.sactelugu.org లేదా https://www.facebook.com/SacTelugu ను సందర్శించాలని లేదా[email protected] కు ఈమెయిలు లో సంప్రదించాలని ఈ సందర్భంగా TAGS కార్యనిర్వాహక సభ్యులు కోరారు.