Shri NTRs 91st Jayanthi

1580

భగవద్గీత, ఖురాన్, బైబిల్,

పైనపేర్కొన్నమూడు పవిత్ర గ్రంధాలలొ, మానవ జీవనయానంలొ ఎదురయ్యే ప్రతీ సమస్యకీ పరిష్కారం దొరుకుతుంది, జీవితం ఉన్నత ఆశయాలతొ గడపటానికి ఒక మార్గం కనపడుతుంది అంటారు.

N.T.R.

NTRఅలాగే పైన పేర్కొన్నమూడు అక్షరాల మహనీయుడి జీవితం గమనిస్తే, ఒక సాధారణ కుటుంబంలొ జన్మించిన మనిషి అయినా ధైర్యం, సాహసమే పెట్టుబడిగా, అఖుంటిత దీక్షతొ, అంతులేని పట్టుదలతొ, పౌరుషంతొ పరిశ్రమిస్తే, ఎవ్వరికీ తల వంచని ధీరుడిలా జీవితాన్ని ఎలాశాసించవచ్చో, అనితర సాధ్యమైన విజయాల్ని ఎలా శ్వాసించవచ్చో అర్ధం అవుతుంది. గొప్ప మత గ్రంధాలలోనె మాత్రమే కాకుండా, మనకి జీవితంలో తారసపదే గొప్ప వ్యక్తుల జీవన విదానంనుందీ మనం నేర్చుకోవాలసినది ఎంతో వుంటుంది.

అలాంటి మహనీయుడి 91 జన్మదినసందర్భంగా ఒకజ్ఞాపకాల హారం అల్లాలిఅంటే, ఒక గొప్ప సాహసం అవుతుంది అని తెలుసు. కానీ ఆయన జీవితంలో ఆయనకి అత్యంత సన్నిహితంగా మసలి, ఆయన ఇచ్చిన స్పూర్తితొ తమ జీవితాల్ని మలచుకొన్న ఆయన ఆత్మీయసహచరులసాయంతొ సాధ్యం అవుతుందనే నమ్మకంతొ అలాంటి వారిలో కొందరిని సంప్రదించి వారికి ఆయనతొ వున్న అనుభవాలకి అక్షర రూపకల్పనే ఆర్టికల్.

30 ఏళ్ళ మచ్హలేని రాజకీయ జీవితంలొ 5 సార్లు MLA గా గెలిచి, అనేక ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను సమర్ధవంతంగా నిర్వహించి, ప్రస్తుతం తన పూర్తి సమయాన్ని పార్టీ వ్యవహారాలపైన ద్రుష్టి సారిస్తున్న మిస్టెర్క్లీన్శ్రీ మండవ వెంకటేశ్వర్రావ్, శ్రీN.T.R. గురుంచి ఆయన మాటల్లొనా రాజకీయ జీవితంలొ ఒక్క అవినీతి ఆరొపణకూడా లెకుండా వున్నానంటే అది కేవలం నాకు రాజకీయ జన్మ ప్రసాదించిన శ్రీ రామారావ్గారి స్పూర్తే కారణం‘, శ్రీ N.T.R. గారితో ప్రతీ ఒక్క వ్యక్తికీ ఒక ఆత్మీయ సంబంధం వుండెది, ఆయన పార్టీ అభిమానుల కుటుంబ, సామాజిక, ఆర్ధిక నేపధ్యం ఎప్పుడూ పట్టించుకునేవారు కాదు. మాకిచ్చిన గౌరవం, బాధ్యతా అన్నీ కూడా పార్టీ పట్ల మా అంకిత భావం, మా వ్యక్తిగత నడవడిక, మా నిభద్దత మీద ఆధారపడి వుండేవి. పాలనాపరమైన నిర్ణయాల్లొ, ఆయనకి నచ్హని విషయం చెప్పినా మేము చెప్పేదాంట్లో సరైన కారణం వుండి అంతే చివరికి ఆయన అభిప్రాయం మార్చుకొని మమ్మల్ని సప్పొర్ట్ చేసేవారు. విదమైన బేషజం కనిపించెది కాదు ఆయనలొ. ఆయన్ని కలిసినప్పుడు కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడినా, ఆయన చూపించే ఆత్మీయత వల్ల ఆయనకి మేమంతా దగ్గరవాళ్ళం భావన కలిగేది.

నన్ను నక్సలైట్స్ కిడ్నాప్ చేసినప్పుదు ఆయన శ్రీచెన్నారెడ్డి గారి మీద ఎంతొ వత్తిడి తెచ్చి నేను క్షేమంగా విడుదల ఆయ్యేలా చూసారు. ఆ రోజుల్లో నక్సలైట్స్ కిడ్నాప్చేసి ఎలాంటి హాని తలపెత్తకుండా వదిలిపెట్టిన మొదటి ప్రజాప్రతినిధిని నేనే. సమయంలొ ఆయన చూపించిన ప్రేమ, ఆత్రుత ఒక M.L.A. మీద ఒక పార్టీ నాయకుడు చూపించే బాధ్యతలా కాక, ఒక పెద్దఅన్నయ్య తన తమ్ముడి క్షేమం కొరకు పడ్డఅందొళన, ఆప్యాయత కనిపించాయి. అలాగే మా నాన్న గారికి పక్షవాతం వచ్హినప్పుడు, జీవితంలొ ఇబ్బంది వచ్చినా ఆయనతొ పంచుకునేవాడిని. నాకు ఆయన జీవితం ఆదర్శంఆయన భగవంతుడిచ్చిన అన్న.

ఉత్తరాంధ్ర రాజకీయ వుద్దండుడు, 4 సార్లు MLA గాగెలిచి, తెలుగుదేశం పార్టీలొ అనేకమైన కీలకమంత్రిత్వశాఖలను సమర్దవంతంగా నిర్వహించి, ఒక పర్యాయం రాజ్యసభకి ఎన్నికైన శ్రీ కిమిడికళా వెంకట్రావ్గారి మాటల్లొ చెప్పాలి అంటే

అన్న శ్రీ నందమూరి తారక రామారావు గారితొ మాకున్న ప్రతి అనుభవమూ చిరస్మరణీయం, ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళిన మమ్మల్ని అడిగే మొదటి మాటఏంబ్రదర్, ఎలావున్నారు మనరైతులు, ధాన్యం ధర ఎలా వుంది?’

పరిపాలనా పరంగా ఎప్పుడు ఆయన్ని కలిసినా ఎప్పుడూ పల్లెల్లొ వుండే బీద రైతులు, పేద వారి సంక్షేమం కొరకు తొలి ప్రాధాన్యత వుండెది ఆయన మాటల్లొ, బడుగు, బలహీన వర్గాల కొరకే ఆయన అహర్నిశలూ ఆలొచించేవారు. కార్యక్రమం తలపెట్టినా వర్గాల పట్ల తీసుకొనే శ్రద్ద మొదటి ప్రాధాన్యత సంతరించుకొనేది.

ఆయన తన అభిమానిని ఎప్పుడూ మరచిపొయెవారు కాదు. 1982 లొ పార్టీని స్తాపించి శ్రీకాకుళంలొ చైతన్య రధంతొ ప్రచారం చేస్తుండగా జరిగిన ఒక ఆసక్తికర సంఘటనకి నేనే ప్రత్యక్ష సాక్షిని, ఒక కూడలిలొ చైతన్యరధం ఆపినప్పుడు అక్కడవున్న ఒకచిన్న తినుబండారాల కొట్టు యజమానిని చూసి ఇతన్ని ఎక్కడో చూసాను నాఅభిమానిలా వున్నడు, ఒక్కసారి పిలిపించండి బ్రదర్ అన్నారు. దూరంగా వున్న వ్యక్తిని మేము కార్యకర్తల ద్వారా పిలిపించాము. అతను వస్తూనే సార్ మద్రాసులొ మిమ్మల్ని కలిసాను, మల్లీ ఇన్నాళ్ళకి మిమ్మల్ని చూదగలిగాను అంటూ అన్నగారి కాళ్ళ పైనపడిపొయాడుఅభిమాని ఇప్పటికీ వున్నారు, షుమారుగా 75 ఏళ్ళ వయస్సు వుంటుంది ఆయనకి ఇప్పటికీ అతను తెలుగు దేశంవీరాభిమాని. ఆయనకి అంతలా అభిమానించే వీరాభిమానులు లక్షల్లొ వుండటం ఒక ఎత్తైతే, తన అభిమానులను గుర్తుకుపెట్టుకొని ఆదరించే మనస్తత్వం వుండటం మరింత గొప్ప లక్షణం.

ఇక పార్టీ నాయకులు, ప్రజా పతినిధుల పట్ల ఆయనకి వున్న గౌరవం చెప్పే సంఘటన ఒకటి.

ఒకసారి నేను(శ్రీకళావెంకటరావు), వసంతనాగేశ్వరరావు కలిసి, అన్నగారి చాంబర్లో ఎదో ప్రబుత్వ కార్యక్రమానికి సంభందించిన చర్చలొ వుండగాఅన్నగారి P.S. డోర్ ఒపెన్ చెసి అన్నగారితొమిమ్మల్ని కలవటానికి ఉత్తరాంధ్ర వాణిజ్యవేత్తలు వచ్చారు సార్అన్నారు.  

దానికి అన్నగారి సమాదానంబ్రదర్ మీగొంతులొ అత్రుత చూస్తె వచ్చిన వారి వెనుక వున్నది చూస్తున్నట్లు మాకు అనిపిస్తున్నది. ఇక్కద ప్రజాప్రతినిధులతొ సమావేశంలొ ఉన్నాము, వీరు ప్రజలు ఎన్నుకుంటే ఇక్కదకి వచ్చారు. వీరితొ జరుగుతున్న చర్చ ముఖ్యం మాకు, వారిని తరువాత కలుద్దాం, వేచివుండమని చెప్పండీ అన్నారుతరువాత మా చర్చని కొనసాగించాము. చివరిలొ అంతాఅయ్యాక బెల్ల్ నొక్కి P.S. గారు లొపలకిరాగానే మన మిత్రులను లోపలికి పంపండి అన్నారు. వారు లొపలకి వస్తుండగా లేచినిలుచుని సాదరంగా ఆహ్వానించారు. పార్టీకి అండగా నిలిచే వాణిజ్యవేత్తలకి ప్రాధాన్యత ఇస్తూనే ప్రజాప్రతినిధులకి అంతకన్న ప్రధాన్యత ఎక్కువ ఎలా ఇవ్వాలొ మాకు ఒక గొప్ప అనుభవంలా నిలిచింది. సంఘటన మాకు మా నియోజకవర్గంలో పార్టీ శ్రెణులని, ప్రజాప్రతినిధులని ఎలా గౌరవించాలో నేర్పింది.

ఆయన ఒక రాజకీయ నాయకుడి కంటే ఒక REFORMER గా చరిత్రలో చెరగని ముద్రవేసారు. స్త్రీలకి ఆస్తిలో సమానహక్కు, పేదవారికి జనతావస్త్రాలు, ఇళ్ళు, 2 రూపాయలకే కిలో బియ్యం, గ్రామాల్లో కరణం, మునసబు వ్యవస్థని తీసివేయటం ఇలా ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొనివచ్చి సమాజంలో అన్ని వర్గాల ప్రజల జీవన విధానాన్ని సమూలంగా మార్చివేసిన ఒక ఆదర్శ పురుషుడు ఆయన అన్న విషయాలు అందరికీ తెలిసినవే, అందుకే ఇక్కడ ఎక్కువగా ప్రస్తావించటంలేదు.

ప్రతినాయకుడితొ, పార్టీకార్యకర్తతొ కుల, మత, ప్రాంత, ఆర్దిక స్తాయిలతొ సంబంధం లేకుండా ఆత్మీయ అనుబంధం నెరపటమే ఆయన్ని తిరుగులేని నాయకుడిలా చేసింది. అనుక్షణం ప్రజా శ్రేయస్సుకై పరితపించిన లక్షణమే ప్రజాహ్రుదయాలలొ ఆయన్ని అమరుడిగా నిలిపింది.

స్వార్దం పెరిగిపోయి, అధికార దాహంతో, విలువల వలువలూడదీస్తూ, కన్న తల్లిలాంటి పార్టీని రొమ్ము గుద్ది వదిలి వెల్లిన నాయకులను సాక్షాత్తు అన్నగారి నియోజకవర్గంలొనే మనం మధ్యనే చూసాం!

అదే సమయంలో అభివ్రుద్ది, ప్రజా సంక్షేమం సమన్వయంచేస్తూ రాష్ట్రాభివ్రుద్దికొరకు పాటుపడుతున్న చంద్రబాబుగారికి, అండగా విదేశాల్లో చేస్తున్న వుద్యొగాలు వదిలి, పదవీ ఆశించకుండా పార్టీ ఆఫీసులొ అవిశ్రాంతంగా పనిచేసే యువకులనూ చూస్తున్నాం! సమర్దవంతుడైన శ్రీ నరేంద్రమోడీ, కల్మషంలేనివ్యక్తినిజాయతీపరుడూ అయిన శ్రీ పవన్ కల్యాణ్లాంటి మంచి వ్యక్తులూ కదిలి వచ్చి చంద్రన్నకి తోడుగా పోరాడటం కూడా చూస్తున్నాం!

రోజు తెలంగాణాని పునర్నిర్మాణం చేస్తాం అంటున్నారు కొంతమంది రాజకీయ నాయకులుచరిత్రని తిరగేస్తే తెలంగాణలో పటేల్, పట్వారీ వ్యవస్తని రద్దుచేసి అక్కది బడుగుబలహీనవర్గాల వారికి నిజమైన స్వాతంత్ర్యం తెచ్చింది తెలుగుదేశంపార్టీ! 1 H.P మోటార్కి ఎంత కరంట్ వాడుకున్నా కేవలం 50 రూపాయలు కడితేచాలు అన్న నూతన విద్యుత్ విధానాన్ని ప్రవేశపెట్టి తెలంగాణాలో ఒక హరిత విప్లవం తెచ్చింది తెలుగుదేశం పార్టీమండల వ్యవస్తని తెచ్చిబడుగుబలహీనవర్గాలవారికి అధికారం అప్పచెప్పి తరతరాల దాస్యస్రుంకలాలు తెంచింది తెలుగుదేశం పార్టీ!

ఈ రొజుకొన్ని రాజకీయపార్టీలుకొంతమంది నాయకులు, మేము తెలంగాణాని ఎదో పునర్నిర్మాణం చేసేస్తాం అని కబుర్లు చెప్పటం, చారిత్రిక వాస్తవాన్ని కప్పిపుచ్చటానికి చేస్తున్న కుప్పిగంతులు మాత్రమే! ఇవన్నీ తెలుగుదేశం పార్టీ ఏనాడో చేసి చూపించింది!

అయితే ప్రజల హ్రుదయాలు భావోద్వేగాలతొ నిండినప్పుడు కొన్ని ప్రాంతాల్లొ ప్రాధాన్యతలు మారి తెలుగుదేశం పార్టీ అనుకున్నంత ఫలితాలను సాధించి వుండకపొవచ్హు. కానీ అది తాత్కాలికమే!

అది గోదావరిజిల్లాలు కావొచ్చు, లేదా ఒరిస్సా కావొచ్చు, ఉత్తరాఖండ్ అయినాకావొచ్చు, ప్రజలు ఎలాంటి ప్రక్రుతి వైపరీత్యాలలో ఇరుక్కుని బాధల్లో వున్న ప్రతిసారీ తక్షనమే స్పందించి, కుల మత ప్రాతాలతో సంభంధం లేకుండా సహాయ కార్యక్రమాల్లోపాల్ల్గొన్న చరిత్ర మన నాయకుడు శ్రీ చంద్రబాబు గారికి, మన కార్యకర్తలందరికీ వుంది.

మారుతున్న రొజుల్లొశ్రీ N.T.R చూపిన మార్గంలొ వెళ్ళడం కష్ఠమే కావొచ్చు, కానీ దీక్షా, దక్షతలతో పరిశ్రమించే నిరంతర శ్రామికుడూ, నవ్యాంధ్రస్వప్న సాధకుడూ అయినశ్రీ నారాచంద్రబాబుగారి నాయకత్వంలొ అది సుసాధ్యమే! ప్రతి తెలుగుదేశం కార్యకర్తా, నాయకుడూ, అన్నగారి ఆశయాలను మరచిపోకుండా, ఆయన మార్గంనుండి పక్కకి మళ్ళకుండా, ప్రజలకి మరింత దగ్గరవుతూ ముందుకి వెళ్ళడమే ఆయనకి అర్పించే అసలైన నివాళి.

జీవించినా, మరణించినాజైతెలుగుదేశం! చివరిశ్వాసవరకూజైతెలుగుదేశం!

బసవేంద్రసూరపనేని, Detroit, USA [email protected]