మిన్నెసోటా తెలుగు సంఘం వారి సంక్రాంతి సంబరాలు

1108

మిన్నెసోటా, 24th January 2014:  మిన్నెసోటా తెలుగు కుటుంబాలు తీవ్రమైన చలి మరియు మంచు తుఫాను నడుమ మిన్నెసోటా తెలుగు సంఘం (టీమ్) వారు మాప్‌లే గ్రోవ్‌ హిందు మందిరంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. తీవ్రమైన చలి లెక్కచేయకుండా విచ్చేసిన భక్తులు సుప్రభాత సేవతో శ్రీవారిని మేలుకోలిపారు. తరువాత తెలుగువారు కూర్చిన అందమైన పూలాహారాలతో శ్రీవారికి తోమాలసేవను ఘనంగా నిర్వహించారు.

మిన్నెసోటా తెలుగు సంఘం వారి సంక్రాంతి సంబరాలు
మిన్నెసోటా తెలుగు సంఘం వారి సంక్రాంతి సంబరాలు

టీమ్ తరపున గౌరవాధ్యాక్షులు శ్రీదుర్గాప్రసాద్‌ కూనపరెడ్డీ శ్రీవారికి వస్త్రాలు సమర్పించారు. తుదుపరి శ్రీవారిని భక్తులు గోవింద నామస్మరణల మద్య నూతనంగా సంప్రదాయబద్ధంగా నిర్మంచిన శ్రీవెంకటేశ్వర ద్వారం నుండి పల్లకిపై ఉరేగించినారు. నూతనంగా సంప్రదాయబద్ధంగా నిర్మంచిన శ్రీవెంకటేశ్వర ద్వారం భక్తులను ఆకట్టుకోంది. అనంతరం రంగరంగ వైభవంగా శ్రీవారి కళ్యాణం భక్తజన కోటి మద్య పూజారులు మనోర్వచనలతో నిర్వహించారు. గోవింద నామస్మరాణంతో మందిరం ప్రతిద్వనించింది.

మిన్నెసోటా తెలుగు సంఘం వారి సంక్రాంతి సంబరాలు
మిన్నెసోటా తెలుగు సంఘం వారి సంక్రాంతి సంబరాలు

హిందూ మందిరం ఆలయ ప్రాంగణం పట్టుపంచలు, పట్టుచీరలు, తెలుగు సాంప్రదాయ వస్త్రాలతో జన్మభూమిని, సంక్రాంతిని తలాపింపజేసినది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ఆబాలగోపాలంను విశషముగా ఆకర్షించిది. టీమ్‌ వారు ఏర్పాటు చేసిన తెలుగు సంప్రదాయబద్ధమైన విందు భోజనం భక్తులు అందరు ఆస్వాదించారు.

మిన్నెసోటా తెలుగు సంఘం వారి సంక్రాంతి సంబరాలు
మిన్నెసోటా తెలుగు సంఘం వారి సంక్రాంతి సంబరాలు

భోజనాంతరం సాంస్కృతిక కార్యక్రమాలలో తెలుగువారు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలుగు కుటుంబాలవారిని గొబ్బెమ్మల ఆట, పిల్లలు జానపద నృత్యాలు, సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకోన్నివి. నృత్యాలయ డ్యాన్స్ అకాడమివారు నిర్వహించిన మోహినీ భస్మాసుర నృత్యనాటిక ప్రేక్షులందిరిని మంత్రముగ్దులిని చేసింది. వైకుంఠం, కైలాసం సెటింగులు మరియు నటీనటుల ఆహార్యం అభినందనీయం.

తదపరి టీమ్‌ వారు నిర్వహించిన ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు అందజేశారు.మిన్నెసోటా తెలుగు సంఘం వారి సంక్రాంతి సంబరాలు 3

టీమ్ గౌరవాధ్యాక్షులు శ్రీదుర్గాప్రసాద్‌ కూనపరెడ్డీ ఈకార్యక్రమం విజయవంతం అవటానికి కృషిచేసిన టీమ్ వారిని మరియు వాలంటియర్లను అభినందించారు. కార్యక్రమ సూత్రధారి శశిపాలనికూడా కార్యక్రమాన్ని విజయంతం చేసినందరికి ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమాన్ని ముగించారు.మిన్నెసోటా తెలుగు సంఘం వారి సంక్రాంతి సంబరాలు 7 మిన్నెసోటా తెలుగు సంఘం వారి సంక్రాంతి సంబరాలు 6 మిన్నెసోటా తెలుగు సంఘం వారి సంక్రాంతి సంబరాలు 4 మిన్నెసోటా తెలుగు సంఘం వారి సంక్రాంతి సంబరాలు - 2