కెనడా లో తాకా సంక్రాంతి సంబరాలు 2016

1552

తెలుగు అలయన్స్అఫ్ కెనడా (తాకా) రంగ రంగ వైభోగంగా సంక్రాంతి సంబరాలు మిస్స్సిసాగా లో, కెనడా లో జనవరి23, 2016 న జరుపు కొన్నారు. ఈ సంబరాలలో దాదాపు 700 మంది తెలుగు వారు చలి వాతావరణము లో కూడా వచ్చి  వేడుకలను విజయవంతం చేసారు. తాకా కార్యదర్శి శ్రీ లోకేష్ చిల్లకూరు, శ్రీమతి మీనా ముల్పూరి, శ్రీమతి రజని లయం, శ్రీమతి షర్మిల సూర్యదేవర, శ్రీమతి వినోద బాచిన, మరియు శ్రీమతి కల్పన మోటూరి ని ఆహ్వానించగా, వారు దీప ప్రజ్వలన చేయగా సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. తాకా వారు కార్యక్రమానికి వచ్చిన చిన్నపిల్లలకు దీపా సాయిరామ్ మరియు శ్రీమతి కల్పన మోటూరి గారి ఆధ్వర్యం లో భోగి పళ్ళతో మంగళ వాయిద్యాల మద్యన వారిని ఆశీర్వదించారు. దుగ్గిన రామచంద్రరావు గారి ఆధ్వర్యం లో వివిధ రకమైన బొమ్మలతో ఆకర్షిణీయంగా బొమ్మల కొలువును ఏర్పరిచారు. ఈ సంబరాలలో తాకా అద్యక్షులు శ్రీ చారి సామంతపూడి ప్రత్యేకంగా టొరోంటొ ఘడియలుతో చేపించబడిన  తెలుగు క్యాలెండర్ని ఆవిష్కరించారు.  ఈ సంబరాలలో  దాదాపు 20  సాంస్కృతిక  కార్యక్రమాలు  తోటి  తెలుగు వారితో  నాటికలు, సినిమా డాన్సులు, పాటలు  ఆరు   గంటల  పాటు ప్రదర్శించ బడ్డాయి. అచ్చ తెలుగు వంటకాలు మరియు అరిసెలతో తాకా వారు భోజనాలని ఏర్పరిచారు.

 

తాకా  సాంస్కృతిక కార్యదర్శి  శ్రీ అరుణ్ కుమార్ లయం మరియు దీప సాయిరాం ఆధ్వర్యం లో  సాంస్కృతిక  కార్యక్రమాలు ఎంతో ఉత్సాహమంతమైన వాతావరణం లో జరప పడ్డాయి. అద్యక్షులు శ్రీ చారి సామంతపూడి గారు సంక్రాంతి  మరియు  తెలుగు సంస్కృతి  గురించి  సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. కెనడా లోని తెలుగు చిన్నారులు మరియు యువతీ యువకులతో ప్రదర్శించబడిన బాహుబలి నాటక మరియు నృత్య ప్రదర్శన సభికులను ఎంతో అగోట్టుకున్నది. సంక్రాంతి హరిదాసు నృత్య ప్రదర్శన సంక్రాతి వేడుకల చిహ్నం గా నిలంచింది. దీప సాయిరాం ఆధ్వర్యం లో నడచిన లేడీస్ ఫాషన్ షో మరియు ఎన్నో ఇతర కార్యక్రమాలు దాదాపు ఆరుగంటలు సేపు ప్రేక్షకుల ను ఉర్రూతలుగించాయి.

 

ఎంతో అద్భుతంగా చేపట్టి మరియు విజయవంతం చేసిన ఫుడ్ కమిటీ శ్రీమతి కల్పన మరియు ట్రస్టీ సభ్యులు మీనా ముల్పూరి గారి ని ,డెకరేషన్ కమిటీ శ్రీ లోకేష్ చిల్లకూరు మరియు శ్రీ బాచిన శ్రీనివాస్ ను, సాంస్కృతిక కమిటి అరుణకుమార్ ను, క్యాలెండర్ కమిటీ శ్రీ గంగాధర్ సుఖవాసి మరియు బాచిన శ్రీనివాసు ను, రిజిస్ట్రేషన్ కమిటీ శ్రీ భాను పోతకమురిని , మీడియా కమిటీ శ్రీ నాగేంద్ర హంసాల ను తాకా అద్యక్షులుఅభినందించారు. ఈ కార్యక్రమం లో ట్రస్టీ సభ్యులు శ్రీబాషా షేక్, శ్రీమతి మీనా ముల్పూరి, మరియు ట్రస్టీ ఛైర్మన్ శ్రీ అరుణ్ లయం , మరియు వ్యవస్థాపక కమిటీ ఛైర్మన్ శ్రీ రమేష్ మునుకుంట్ల, వ్యవస్థాపక సభ్యులు శ్రీ శ్రీనాథ్ కుందూరు, శ్రీ గంగాధర్ సుఖవాసి, శ్రీ మునాఫ్ అబ్దుల్, మరియు శ్రీ రామచంద్రరావు దుగ్గిన గార్లు పాల్గొని కార్యవర్గానికి ఎంతో సహకరించారు. యూత్ డైరెక్టర్స్ కీర్తి సుఖవాసి మరియు శ్రావణి దుగ్గిన తమవంతు సహకారాన్ని అందచేసి యువతను ఉత్సహపర్చారు.  తాకా కమిటీలు ఈ సంక్రాంతి సంబరాలను  ఎంతో శ్రమకోర్చి  కెనడా లో ని  తెలుగు వారి కోసం  ఏర్పాటు చేసారు. చివరిగా అందరికి  ధన్యవాదాలు చెపుతూ జనగణమన  జాతీయ గీతంతో  కార్యక్రమాలు  ముగించారు

2016 Sankranthi Sambaralu in Toronto, Canada (1) 2016 Sankranthi Sambaralu in Toronto, Canada (2) 2016 Sankranthi Sambaralu in Toronto, Canada (3) 2016 Sankranthi Sambaralu in Toronto, Canada (4) 2016 Sankranthi Sambaralu in Toronto, Canada (5) 2016 Sankranthi Sambaralu in Toronto, Canada (6) 2016 Sankranthi Sambaralu in Toronto, Canada (7) 2016 Sankranthi Sambaralu in Toronto, Canada (8)