కెనడా లో తాకా సంక్రాంతి సంబరాలు

1326

తెలుగు అలయన్స్అఫ్ కెనడా (తాకా) రంగ రంగ వైభోగంగా సంక్రాంతి సంబరాలు కెనడా, మిస్స్సిసాగా లోని గ్లెన్ ఫారెస్ట్ సెకండరీ స్కూల్ లో  జనవరి 13, 2018 న జరుపు కొన్నారు. ఈ సంబరాలలో దాదాపు 1000 మందికి పైగా తెలుగు వారు -25 డిగ్రీ ల చలి వాతావరణము లో కూడా వచ్చి  వేడుకలను విజయవంతం చేసారు. తాకా కార్యదర్శి శ్రీ నాగేంద్ర హంసాల, శ్రీమతి మీనా ముల్పూరి, శ్రీమతి వాణి జయంతి, శ్రీమతి ముంతాజ్ షేక్ ని ఆహ్వానించగా, వారు దీప ప్రజ్వలన చేయగా సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. తాకా వారు కార్యక్రమానికి వచ్చిన చిన్నపిల్లలకు దీపా సాయిరామ్ మరియు శ్రీమతి వాణి జయంతి గారి ఆధ్వర్యం లో భోగి పళ్ళతో మంగళ వాయిద్యాల మద్యన వారిని ఆశీర్వదించారు. అరుణ్ కుమార్ లయం గారి ఆధ్వర్యం లో వివిధ రకమైన బొమ్మలతో ఆకర్షిణీయంగా బొమ్మల కొలువును ఏర్పరిచారు.  ఈ సంబరాలలో తాకా ఉపాద్యక్షులు శ్రీ దుగ్గిన రామచంద్రరావు ఆద్వర్యంలో ప్రత్యేకంగా  టొరోంటొ ఘడియలుతో చేపించబడిన  తెలుగు క్యాలెండర్ని పూర్వ అధ్యక్షులు చారి సమాంతపూడి, మరియు గంగాధర్ సుఖవాసి గార్ల చే ఆవిష్కరించారు. ఈ సంబరాలలో  దాదాపు 25  సాంస్కృతిక  కార్యక్రమాలు  తోటి  తెలుగు వారితో  నాటికలు, కూచిపూడి , భారత నాట్య, సినిమా మరియు సినీ పాటలతో    ఆరు గంటల  పాటు ప్రదర్శించ బడ్డాయి. విక్రమ్ కొండతాశుల, శ్రీనివాస్ బొగా డి , మల్లేశ్వరి  వ్యాఖ్యాతలు గా  వ్యవహరించారు. అచ్చ తెలుగు వంటకాలు మరియు అరిసెలతో తాకా వారు భోజనాలని ఏర్పరిచారు.

తాకా కార్య వర్గం, పూర్వ కార్యవర్గం అధ్యక్షులు చారి సమాంతపూడి గారి ని వారి సేవని కొనియాడుతూ శాలువాతో సత్కరించి మెమెంటో అందచేశారు. ఈకార్య క్రమంలో తానా కెనడా ఉపాద్యాయులు లక్ష్మీనారాయణ సూరపనేని గారు ఇతర కార్యవర్గ సభ్యులకు  బహుమతులు అందచేశారు. అధ్యక్షులు అరుణ్ కుమార్ సంక్రాంతి ముఖ్య దాత వెంకట్ పెరుగు గారికి మెమెంటో అందచేశారు. తాకా కార్యవర్గం ముగ్గుల పోటీలు మరియు ఇతర లక్కీడ్రాల విజేతలకు బహుమతులు అందచేశారు.

 తాకా  సాంస్కృతిక కార్యదర్శి  శ్రీమతి దీపా సాయిరామ్ మరియు శ్రీమతి వాణి జయంతి ఆధ్వర్యం లో  సాంస్కృతిక  కార్యక్రమాలు ఎంతో ఉత్సాహమంతమైన వాతావరణం లో జరపపడ్డాయి. అద్యక్షులు శ్రీ అరుణ్ కుమార్ లయం గారు సంక్రాంతి  మరియు  తెలుగు సంస్కృతి  గురించి  సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. కెనడా లోని తెలుగు చిన్నారులు మరియు యువతీ యువకులతో ప్రదర్శించబడిన అష్టదిగ్గజాలు మరియు నృత్య ప్రదర్శన సభికులను ఎంతో ఆకట్టుకున్నది.  సురేష్ నిట్టల , ధీరజ్ బర్ల , సంధ్య గార్ల సుస్వరధ్వని , డాన్స్ మంత్ర  వారిలో ఫాషన్ షో  మరియు ఎన్నో ఇతర కార్యక్రమాలు దాదాపు ఆరుగంటలు సేపు ప్రేక్షకులను ఉర్రూతలుగించాయి.

ఎంతో అద్భుతంగా చేపట్టి మరియు విజయవంతం చేసిన ఫుడ్ కమిటీ శ్రీ సురేష్  కూన మరియు శ్రీమతి కల్పన గారి ని ,డెకరేషన్ కమిటీ శ్రీ నాగేంద్ర హంసల మరియు రఘు అల్లం గారి ని, సాంస్కృతిక కమిటి దీపా సాయిరామ్ మరియు వాణి  జయంతి ను, క్యాలెండర్ కమిటీ  గంగాధర్ సుఖవాసి మరియు రామచంద్రరావు దుగ్గినను, రిజిస్ట్రేషన్ కమిటీ శ్రీమతి కల్పన మోటూరి, శ్రీ రఘు అల్లం మరియు రాంబాబు కల్లూరి గార్లను తాకా అద్యక్షులు అభినందించారు. ఈ కార్యక్రమం లో ట్రస్టీ సభ్యులు శ్రీబాషా షేక్, శ్రీ రాంబాబు కల్లూరి, కిరణ్ కాకర్లపూడి, ఆర్నాల్డ్ మద్దెలపూడి మరియు ట్రస్టీ ఛైర్మన్  శ్రీ లోకేష్ చిల్లకూరు, వ్యవస్థాపక సభ్యులు శ్రీ శ్రీనాథ్ కుందూరు, శ్రీ చారి  సమాంతపూడి  మరియు శ్రీ గంగాధర్ సుఖవాసి పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. చివరిగా అందరికి  ధన్యవాదాలు చెపుతూ జనగణమన  జాతీయ గీతంతో  కార్యక్రమాలు ముగించారు.